14, మే 2023, ఆదివారం

సమస్య - 4421

15-5-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాడి యగును మాత సుతునిఁ బరిణయమాడన్”
(లేదా...)
“పాడియగున్ గుమారుని వివాహముఁ జేసికొనంగ మాతకున్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

20 కామెంట్‌లు:

 1. వీడినధర్మముతోడను
  పాడియగునుమాతసుతునిపరిణయమాడన్
  తోడనుకలియుగమంతము
  చూడగసిద్ధముజనులునుచోోద్యముగాదే

  రిప్లయితొలగించండి

 2. కోడలుగా తగు గదనా
  చేడియ గుణవంతురాలు చేగొను మనుచున్
  వేడిరి కాంచగ నామెయె
  పాడి యగును మాత, సుతునిఁ బరిణయమాడన్.

  రిప్లయితొలగించండి
 3. ఈడూజోడూ కుదిరెను
  వేడుకతో సరియనవలె బెదరగనేలా
  ఱేడెంతో యోగ్యుడుగద
  పాడి యగును మాత! సుతునిఁ బరిణయమాడన్

  [సుతుడు - రాజు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తోడుగ మంచివాడమర తొందరలో దిగనాడ వచ్చునా
   నీడగ నిల్చువారు జననీసుతులే గ్రహియింప నీకికన్
   పాడియగున్ గుమారుని వివాహముఁ జేసికొనంగ, మాతకున్
   కోడలి సేవలంగొనెడు కోరిక తీరును పెండ్లి యాడినన్

   తొలగించండి
 4. కందం
  వేడుకనఁగ రాముని చే
  తాడనమున విల్లు విఱుగఁ దత్కౌసల్యన్
  కూడియు నరుదెంచఁ గుజకు
  పాడి యగును మాత సుతునిఁ బరిణయమాడన్

  (మాత సుతునిఁ = మాతయొక్క సుతునిఁ)

  ఉత్పలమాల
  వేడుకఁ దత్స్వయంవరము వీరుల కెల్లను గూర్చినంతఁ జే
  తాడనమందువిల్విఱుగ తారకరాముడు జేతయై నిలన్
  గూడియు రాగఁ దా జనని కోసలరాట్సుత వెంట, సీతతో
  పాడియగున్ గుమారుని వివాహముఁ జేసికొనంగ మాతకున్

  రిప్లయితొలగించండి

 5. కోడలుగాను నీ సుతుడు కోరిన కన్నియ పైన శంకలన్
  వీడుము బుద్ధిలోగన వివేకి గుణాంబుధి శీలి గాదె యా
  చేడియ నంచు నా పడతి చెంతన జేరుచు చెప్పె నిట్టులన్
  పాడియగున్ గుమారుని వివాహముఁ జేసికొనంగా, మాతకున్.

  రిప్లయితొలగించండి
 6. పోడిమి యున్న మిత్రుని సుపుత్రిక
  తండ్రికి నచ్చె నామతో
  పాడియగున్ కుమారుని వివాహము
  జేసికొనంగ , మాతకున్
  కోడలియౌట మంచిదని కోరుకొనెన్
  తన యన్న కూతురున్
  నీడుగ నెల్లవేళలను నిక్కము తోడ్పడు
  నంచు పుత్రుడున్.

  రిప్లయితొలగించండి
 7. నీడగ రక్షించు ట యే
  పాడి యగును మాత సుతుని :: పరిణయ మాడన్
  పోడిమి గల కన్యక గని
  తోడు గ నుండ o గ సలుప తోషము సుతు కున్

  రిప్లయితొలగించండి
 8. చూడుమిక భావినందున
  పాడి యగును మాత సుతునిఁ బరిణయమాడన్
  వీడుటదగు నాతలపును
  కీడు కలుగునన నిజమగు కేవలము జవన్

  రిప్లయితొలగించండి
 9. తల్లి యొక్క ఆరోగ్యం బాగు పడుటకు జ్యోతిష్కుడు కుమారస్వామి వివాహం చేయించమని గ్రహదోష నివారణగా చెప్పెను...

  చూడగ దోషముల్ ముదిరె సుంతయు శాంతములేదు మాతకున్
  కూడెను పెక్కు రోగములు ఘోరముగా నగుపించె రోజులున్
  మూడవనాటి లోపు మన మూర్తయ శాస్త్రులు చెప్పినట్లుగా
  పాడియగున్ గుమారుని వివాహముఁ జేసికొనంగ మాతకున్
  కుమారుడు = కుమారస్వామి

  రిప్లయితొలగించండి
 10. -

  క్రీడాసక్తుని మార్చె ప్ర
  గాఢపు తెలివిడి గలిగిన కవివర్యునిగా
  వేడంగ జగన్మాతన్
  పాడి యగును, మాత సుతునిఁ బరిణయమాడన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. (కొడుకు కోరిన వధువుకిచ్చి పెండ్లి జరిపించుటకు ఇంటిపెద్దయైన అత్తగారిని ఒప్పించమని భర్తను వేడుకొంటున్న వరుని తల్లి.)

  ఈడునుజోడునున్కుదిరె నిర్వురికిన్ తగ పెండ్లియాడగన్
  చేడియ సద్గుణాన్విత విశిష్ట పదంబుననుండె నాపెకున్
  పాడియగున్ గుమారుని వివాహముఁ జేసికొనంగ, మాతకున్
  పోడిమి పల్కులన్దెలిపి పుణ్యము గట్టుకొనంగ వేడెదన్

  రిప్లయితొలగించండి
 12. కూడినవిరువురి మనసులు
  వేడెదనంగీకరించి వేడుక దీర్పన్
  చేడియ సద్గుణవతియే
  పాడి యగును మాత సుతునిఁ బరిణయమాడన్

  రిప్లయితొలగించండి
 13. ఉ॥ వేడిన కన్యకా మణియె వేడుక తోడుగ నెల్లరున్ గనన్
  బాడియగున్ గుమారుని వివాహముఁ జేసుకొనంగ, మాతకున్
  గోడలి సేవలన్ బడయఁ గూడును స్వస్థత పాట్లు తగ్గగన్
  బోఁడిమి మీరు మోదమగు ముద్దుల పౌత్రుఁడు పుట్టినంతనే

  రిప్లయితొలగించండి
 14. వీడినకర్మబంధమునవిజ్ఞతతోడుతసాధనంబునన్
  వేడగమోక్షమున్జననివేగమసంయమిగాచునూహతో
  చేడియరూపునన్ఋషినిచెంతకుబిల్చిపరంబునీయగా
  పాడియగున్కుమారునివివాహముజేసికొనంగమాతకున్

  రిప్లయితొలగించండి
 15. ఉ.

  కాడలతోడ మాతృకల స్కందునిఁ బ్రార్థన తారకాంతకున్
  జూడగ మాతృకల్ సతులు చోద్యము భూత సనత్కుమారుకున్
  వాడిక పెండ్లియే జరిగె వల్లికి వెంబడి దేవసేనతో
  *పాడియగున్ గుమారుని వివాహముఁ జేసికొనంగ మాతకున్.*

  రిప్లయితొలగించండి
 16. పోడిమి చందము న్ గలిగి ముద్దుగగన్ప డు. కన్య కే గదా
  పాడి యగున్ గుమా రునివివాహము జేసి కొనంగ::మాతకున్
  గోడలి వర్త నంబులును గూ రిమి తో యొనరించు సేవలున్
  వేడుక గూర్చి మోదమును ప్రీతి యొసo గగ తృప్తి గల్గె డున్

  రిప్లయితొలగించండి

 17. పిన్నక నాగేశ్వరరావు.

  వేడుకగా పెండ్లి జరుప
  పాడి యగును మాత!; సుతునిఁ బరిణయ
  మాడన్
  చేడియను జూచితిమి గద
  కోడలి యర్హతలు కలవు కోరినవెల్లన్.

  రిప్లయితొలగించండి
 18. ఊర్వసి అర్జునునితో
  చూడు తనూవిలాసము సొక్కగ జేసెద మారు చెయ్దులన్
  వీడుము మొండిపట్టును వివేకముతో విను, దేవలోకమున్
  కూడుట దేవవేశ్యలకు కూర్చిన ధర్మము, నన్ను నమ్ముమా
  పాడియగున్ గుమారుని వివాహముఁ జేసికొనంగ మాతకున్

  రిప్లయితొలగించండి