3, మే 2023, బుధవారం

సమస్య - 4411

4-5-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాండవులకుఁ బెద్ద భార్య కుంతి”
(లేదా...)
“అరయఁగఁ బంచపాండవుల కా సతి కుంతియె పెద్ద భార్యయౌ”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

15 కామెంట్‌లు:

 1. భారతమ్ము నందు బాండుడె జనకుడు
  పాండవులకుఁ ; బెద్ద భార్య కుంతి
  మొదట బడసె సుతులు ముగ్గురిని నెఱగ
  మాద్రి చివరి వారి మాత యయ్యె

  రిప్లయితొలగించండి
 2. భారతమ్మునందు ప్రఖ్యాతినొందిన
  పాండవులకుతండ్రి పాండురాజు
  కోరి పాండురాజుఁ గూరిచి తెలుపంగ
  పాండవులకుఁ బెద్ద, భార్య కుంతి

  రిప్లయితొలగించండి
 3. క్రామాలంకారం లో --==
  పాండు రాజె వరికి వసుధలో పిత య య్యె?
  ధర్మ జునకు భీము తమ్ము డైన
  పార్థు కెవరు తల్లి వచింయింపు మన్న చో
  పాండవులకు :+ పెద్ద భార్య కుంతి

  రిప్లయితొలగించండి
 4. ఆటవెలది
  సాగ చిన్న భార్య సహగమనమ్మున
  పెంచి పెద్దఁ జేయ పిల్లవాండ్ర
  దిటవుఁ జేకొని మది దిక్కయ్యె బాలలౌ
  పాండవులకుఁ, బెద్ద భార్య కుంతి

  చంపకమాల
  మరువక భర్తనే 'సతి' గ మాద్రియె వెంటను నిర్గమింపఁగన్
  గొరతయె లేని రీతిగను గూర్మిని బెంచెను సొంత తల్లిగా
  నరయగఁ బంచపాండవుల కా సతి కుంతియె, పెద్ద భార్యయౌ
  గురుకుల పాండురాజునకుఁ గూర్చెను మోదము నాత్మరూపికిన్

  రిప్లయితొలగించండి
 5. వరముగ మౌనిమంత్రమును పావని కుంతి శిరమ్ముఁ దాల్చు సం
  వరణమునన్ జనించితిరి పాండవులేవురు మాతృమూర్తియౌ
  నరయఁగఁ బంచపాండవుల కా సతి కుంతియె, పెద్ద భార్యయౌ
  నిరవుగ పాండురాజునకు నీయమ మాద్రి సపత్ని యయ్యెడిన్

  రిప్లయితొలగించండి
 6. తండ్రి పాండురాజుతల్లి కుంతీదేవి
  పాండవులకుఁ, బెద్దభార్య కుంతి
  మాద్రి చిన్న భార్య; మరణమొందగ పతి
  మాద్రి సహగమించెమగనితోడ

  రిప్లయితొలగించండి
 7. కరముగ కాననంబునను గష్టము
  లెల్ల సహించి యోర్పుతో
  దిరముగ సర్వకాలమున దేకువ
  వీడని ద్రౌపదే తగున్
  అరయగ పంచపాండవుల కాసతి,
  కుంతియె పెద్ద భార్యయౌ
  నిరుపమ పాండు రాజునకు నిక్కము
  మాద్రియె చిన్న భార్యసూ.

  రిప్లయితొలగించండి
 8. పాండురాజు కుంతితో తాను మరణించిన తర్వాత ఇంటి పెద్ద కుంతియే అని చెబుతూ...
  ఆ.వె.
  బ్రహ్మచర్య నిష్ఠ పాడైన సమయాన
  మృతిని పొందు నేను మేను విడచి
  మునుపె చెప్పుచుంటి వినుమమ్మ నీవేయౌ
  పాండవులకుఁ బెద్ద, భార్యకుంతి!

  రిప్లయితొలగించండి
 9. ఆ॥ పాండు రాజు చనఁగ భారమంతయు వేసి
  భార్య పైన సుతులు పాండవులను
  జేయ యోగ్యులుగను జేసె సపర్యలు
  పాండవులకుఁ, బెద్ద భార్య కుంతి

  రిప్లయితొలగించండి
 10. పాండురాజు తండ్రి పాండవులకు
  పెద్దభార్యకుంతిపెంచెవారి
  ధర్మరాజుతలనుదాల్చెగబాధ్యత
  పిన్నవారిగనుచుప్రేమమీర

  రిప్లయితొలగించండి
 11. చం॥ మరువక బాధ్యతల్ గనుచు, మానిని మాద్రి చనంగ భర్తతో,
  నరియఁగఁ బంచపాండవుల కా సతి కుంతియె, పెద్ద భర్యయౌ
  గరిమగఁ బాండురాజునకుఁ, గష్టము లన్నియు సైఁచి తల్లిగన్
  గరములఁ బట్టి తండ్రిగను గాంచఁగ మోదము తోడ నాయెగా!

  రిప్లయితొలగించండి
 12. వరమున బుట్టె ధర్మజుడు పార్థుడు బీముడు కుంతి దేవికిన్
  మరణము సంభవించె గద మాద్రికి నయ్యె డ పాండు రాజుకున్
  మురిపము గాగ జే కొనెను ముద్దుల సూనుల బెంచు బాధ్యత
  న్న రయగ పంచ పాండవుల కా సతి కుంతి పెద్ద భార్య యై

  రిప్లయితొలగించండి
 13. స్వామి‌ పాండురాజు‌‌ జనుకుడాయెనుపంచ
  పాండవులకుఁ ;పెద్ద భార్య కుంతి‌.
  మాద్రి‌ చిన్నభార్య‌ మైథునంబునుచేయ‌
  చావు‌ కలిగె‌ మునుల‌ శాపమదియె‌

  రిప్లయితొలగించండి
 14. విద్యలెల్లనేర్పె వేగమాద్రోణుడు
  హస్తినాపురమ్మునందుతాను
  పాండురాజుకయ్యె పరిణయమునుసేయ
  *“పాండవులకుఁ బెద్ద భార్య కుంతి

  రిప్లయితొలగించండి
 15. తరుణి విశాలనేత్రి సఖి ద్రౌపది యెవ్వరి పత్నియంటి? భా
  సురుడగు పాండురాజుకు శోభన గొంతి సజాత్యమేమి? యు
  త్తరమిడు మంచు గోరగ బుధానుడు శిష్యుడు చెప్పె నిట్లుగా
  నరయఁగఁ బంచపాండవుల కా, సతి కుంతియె పెద్ద భార్యయౌ.


  కృష్ణ యెవరికి సతి? కృశమధ్యమ పృథ యా
  పాండు రాజు కేమి వరుస? తెలుపు
  కన్న తల్లి యెవరు కర్ణున కన తెల్పె
  పాండవులకుఁ, బెద్దభార్య, కుంతి.

  రిప్లయితొలగించండి