9-5-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అన్నదమ్ములు దంపతు లైరి కనఁగ”(లేదా...)“అన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్”(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
దాశరథిగ నగ్రజుడు తా దాల్చె పాత్రచిన్నవాడందు వేసేను సీత పాత్రనట్టి నాటకమును గని యనిరి లోకులన్నదమ్ములు దంపతు లైరి కనఁగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిన్నగా నటి యించువారని మెచ్చి పిల్వగ వచ్చరే చెన్నపట్టణ నాట్యబృందము, సీతగాథను వేయగానన్నరాముని పాత్రవేయగ నమ్మసీతగ తమ్ముడై అన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్.
తేటగీతితల్లిదండ్రులు కాలమై చెల్లి మిగులకొరత రానీక పెంచిరి కోమలిగనుమురిసి యీడైన పురుషుని ముడిని వైచనన్నదమ్ములు, దంపతులైరి కనఁగమత్తకోకిలకన్నవారలు కాలమైనను గాచి పెంచిరి యన్నలేచిన్ని చెల్లికి నమ్మనాన్నల చింతఁ దీర్చిరి ప్రేమతోఁదిన్నగా మనసైన వానిని దెచ్చి కూర్చఁగ భర్తగానన్నదమ్ములు వేడ్క, దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మిన్నయౌ బహుమాన మొక్కటి మెత్తువంచును తెచ్చినా మన్నమాటల నాలకించుచు నమ్మకుంతియె పల్కెనే యన్నదమ్ములు పంచుకొమ్మని యామె యానతి గృష్ణతో నన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్.
అందరు పురుషులె నటించు హద్దు గలుగునాటక గణము వేసిన నాటకమునదమ్ముడె తన భార్యగ పాత్ర దాల్చినంతనన్నదమ్ములు దంపతు లైరి కనఁగ
యక్షగానమునందు వేసిరి యన్నదమ్ములు వింతగాలక్షణంబుగ నన్నవేసెను రాము వేషముప్రేమతోదక్షతాయుతడైన తమ్ముడు దాల్చెజానకి వేషమున్అన్నదమ్ములు వేడ్క దంపుతులైరి లోకుల మెచ్చగన్
ప్రాస ?
పెద్ద వాడు ధరించెను భీముడు గనుచిన్న వాడు హిడంబి గ జేసె నటననాలు మగలుగ గాంచియు నని రి లోకు లన్న దమ్ములు దంపతులైరి కనగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు: సుగుణ గుణముల పెంపొంది సొబగు మించి రన్నదమ్ములు; దంపతులైరి కనగ నందు పెద్దవాడును సీతయను వనితయు పెద్దల సముఖమందున పేర్మితోడ. ఉన్నతమ్మగు శీలసంపదనొంది వెల్గిరి కీర్తితోనన్నదమ్ములు; వేడ్క దంపతులైరి లోకులు మెచ్చగన్ మిన్నయౌ సరిదీవెనల్ గొని మేలురీతిని యన్నయే వన్నెమీఱిన కోమలాంగిని పట్టి మోదము నొందగా!
కన్నవారలు లేనిలోటునుఁ గాననీయక గోముగాకన్నులందిడి సాకిరామెను కందనీయక పాదముల్కన్నె ప్రాయమునందు గూర్చఁగ కంతునిన్ తన కాంతుఁగానన్నదమ్ములు, వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
కవల సోదరు లిద్దరు కలసి మెలసికవల సోదరీ మణులను గాంచి రచటఒక్క లగ్నము నందున నక్క చెలెలునన్నదమ్ములు దంపతు లైరి కనఁగకన్నుకుట్టును సుందరాంగులఁ గాంచినంతనె స్త్రీలకున్వన్నెచిన్నెల కన్నెలన్ గన వచ్చి రిద్దరు సోదరుల్కన్నవారలు ప్రోత్సహించగ కన్నె లిద్దరి జోడుగానన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
కన్నవారలు గతియించ కన్నులనిడిపెంచిరామెను సోదరుల్ ప్రేమమీరయుక్తవయసున గూర్చఁగ నొకనిఁ బతిగనన్నదమ్ములు, దంపతు లైరి కనఁగ
యక్షగానమునందువేసిరియన్నదమ్ములు వేషముల్లక్షణంబుగ నన్నవేసెను రాము వేషము ప్రేమతోప్రేక్ష కావళి సంతసిల్లగ వేసె దమ్ముడు సీతగాఅన్నదమ్ములు వేడ్క దంపుతులైరి లోకుల మెచ్చగన్
మిన్నయైన కుటుంబమందున మేలునే తలపోయుచున్కన్నవారలు సమ్మతింపగ గౌరవించుచు పుత్రులన్పన్నుగానొక యింటిబిడ్డల పాణి పీడన జేయగానన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
అన్నదమ్ములు దంపతు లైరి కనఁగఅక్కచెల్లెండ్రలవివాహ మాడి సూవె
తే॥ అన్నదమ్ములు వరులైరి యచట కుదిరెనొక్క యక్క చెల్లెండ్రతోఁ జక్కఁ గానుబెండ్లి వైభవము ముగియఁ బెద్దలెదుటనన్నదమ్ములు దంపతులైరి కనఁగమత్త॥ అన్నదమ్ములు కోరి మెచ్చిరి యంగనామణు లిద్దరిన్అన్న మెచ్చిన నారి చెల్లెలు నప్సరేయని తమ్ముడున్గన్నతోడనె మెచ్చఁ గాను సగౌరవమ్ముగఁ బెండ్లిలోయన్న దమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
కలువవిప్పారెకొలనులోకాంతికలిమిపంకజంబునుపరువంపుపాటబాడెచలువవేడిమిసాకగాసైచిమురియఅన్నదమ్ములుదంపతులైరికనగ
పూను కొనినాటకమునకు పురుషులంతస్త్రీ ల పాత్రలు పురుషులు చేసినంతవింత లుసరదాలకదియె వేదికవగనన్నదమ్ములు దంపతు లైరి కనఁగ.
జనకునిసభలోనెల్లరు సంతసానమురిసి దీవించుచుండగపుడమియందురామచంద్రుని తోబాటు రయముగానునన్నదమ్ములు దంపతులైరికనగ
దాశరథిగ నగ్రజుడు తా దాల్చె పాత్ర
రిప్లయితొలగించండిచిన్నవాడందు వేసేను సీత పాత్ర
నట్టి నాటకమును గని యనిరి లోకు
లన్నదమ్ములు దంపతు లైరి కనఁగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమిన్నగా నటి యించువారని మెచ్చి పిల్వగ వచ్చరే
చెన్నపట్టణ నాట్యబృందము, సీతగాథను వేయగా
నన్నరాముని పాత్రవేయగ నమ్మసీతగ తమ్ముడై
అన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండితల్లిదండ్రులు కాలమై చెల్లి మిగుల
కొరత రానీక పెంచిరి కోమలిగను
మురిసి యీడైన పురుషుని ముడిని వైచ
నన్నదమ్ములు, దంపతులైరి కనఁగ
మత్తకోకిల
కన్నవారలు కాలమైనను గాచి పెంచిరి యన్నలే
చిన్ని చెల్లికి నమ్మనాన్నల చింతఁ దీర్చిరి ప్రేమతోఁ
దిన్నగా మనసైన వానిని దెచ్చి కూర్చఁగ భర్తగా
నన్నదమ్ములు వేడ్క, దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమిన్నయౌ బహుమాన మొక్కటి మెత్తువంచును తెచ్చినా
మన్నమాటల నాలకించుచు నమ్మకుంతియె పల్కెనే
యన్నదమ్ములు పంచుకొమ్మని యామె యానతి గృష్ణతో
నన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరు పురుషులె నటించు హద్దు గలుగు
రిప్లయితొలగించండినాటక గణము వేసిన నాటకమున
దమ్ముడె తన భార్యగ పాత్ర దాల్చినంత
నన్నదమ్ములు దంపతు లైరి కనఁగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండియక్షగానమునందు వేసిరి యన్న
రిప్లయితొలగించండిదమ్ములు వింతగా
లక్షణంబుగ నన్నవేసెను రాము వేషము
ప్రేమతో
దక్షతాయుతడైన తమ్ముడు దాల్చె
జానకి వేషమున్
అన్నదమ్ములు వేడ్క దంపుతులైరి
లోకుల మెచ్చగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రాస ?
తొలగించండిపెద్ద వాడు ధరించెను భీముడు గను
రిప్లయితొలగించండిచిన్న వాడు హిడంబి గ జేసె నటన
నాలు మగలుగ గాంచియు నని రి లోకు
లన్న దమ్ములు దంపతులైరి కనగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసుగుణ గుణముల పెంపొంది సొబగు మించి
రన్నదమ్ములు; దంపతులైరి కనగ
నందు పెద్దవాడును సీతయను వనితయు
పెద్దల సముఖమందున పేర్మితోడ.
ఉన్నతమ్మగు శీలసంపదనొంది వెల్గిరి కీర్తితో
నన్నదమ్ములు; వేడ్క దంపతులైరి లోకులు మెచ్చగన్
మిన్నయౌ సరిదీవెనల్ గొని మేలురీతిని యన్నయే
వన్నెమీఱిన కోమలాంగిని పట్టి మోదము నొందగా!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికన్నవారలు లేనిలోటునుఁ గాననీయక గోముగా
రిప్లయితొలగించండికన్నులందిడి సాకిరామెను కందనీయక పాదముల్
కన్నె ప్రాయమునందు గూర్చఁగ కంతునిన్ తన కాంతుఁగా
నన్నదమ్ములు, వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
కవల సోదరు లిద్దరు కలసి మెలసి
రిప్లయితొలగించండికవల సోదరీ మణులను గాంచి రచట
ఒక్క లగ్నము నందున నక్క చెలెలు
నన్నదమ్ములు దంపతు లైరి కనఁగ
కన్నుకుట్టును సుందరాంగులఁ గాంచినంతనె స్త్రీలకున్
వన్నెచిన్నెల కన్నెలన్ గన వచ్చి రిద్దరు సోదరుల్
కన్నవారలు ప్రోత్సహించగ కన్నె లిద్దరి జోడుగా
నన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
కన్నవారలు గతియించ కన్నులనిడి
రిప్లయితొలగించండిపెంచిరామెను సోదరుల్ ప్రేమమీర
యుక్తవయసున గూర్చఁగ నొకనిఁ బతిగ
నన్నదమ్ములు, దంపతు లైరి కనఁగ
యక్షగానమునందువేసిరియన్న
రిప్లయితొలగించండిదమ్ములు వేషముల్
లక్షణంబుగ నన్నవేసెను రాము
వేషము ప్రేమతో
ప్రేక్ష కావళి సంతసిల్లగ వేసె
దమ్ముడు సీతగా
అన్నదమ్ములు వేడ్క దంపుతులైరి
లోకుల మెచ్చగన్
మిన్నయైన కుటుంబమందున మేలునే తలపోయుచున్
రిప్లయితొలగించండికన్నవారలు సమ్మతింపగ గౌరవించుచు పుత్రులన్
పన్నుగానొక యింటిబిడ్డల పాణి పీడన జేయగా
నన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
అన్నదమ్ములు దంపతు లైరి కనఁగ
రిప్లయితొలగించండిఅక్కచెల్లెండ్రలవివాహ మాడి సూవె
తే॥ అన్నదమ్ములు వరులైరి యచట కుదిరె
రిప్లయితొలగించండినొక్క యక్క చెల్లెండ్రతోఁ జక్కఁ గాను
బెండ్లి వైభవము ముగియఁ బెద్దలెదుట
నన్నదమ్ములు దంపతులైరి కనఁగ
మత్త॥ అన్నదమ్ములు కోరి మెచ్చిరి యంగనామణు లిద్దరిన్
అన్న మెచ్చిన నారి చెల్లెలు నప్సరేయని తమ్ముడున్
గన్నతోడనె మెచ్చఁ గాను సగౌరవమ్ముగఁ బెండ్లిలో
యన్న దమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
కలువవిప్పారెకొలనులోకాంతికలిమి
రిప్లయితొలగించండిపంకజంబునుపరువంపుపాటబాడె
చలువవేడిమిసాకగాసైచిమురియ
అన్నదమ్ములుదంపతులైరికనగ
పూను కొనినాటకమునకు పురుషులంత
రిప్లయితొలగించండిస్త్రీ ల పాత్రలు పురుషులు చేసినంత
వింత లుసరదాలకదియె వేదికవగ
నన్నదమ్ములు దంపతు లైరి కనఁగ.
జనకునిసభలోనెల్లరు సంతసాన
రిప్లయితొలగించండిమురిసి దీవించుచుండగపుడమియందు
రామచంద్రుని తోబాటు రయముగాను
నన్నదమ్ములు దంపతులైరికనగ