11, మే 2023, గురువారం

సమస్య - 4418

12-5-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిద్దుర వచ్చె పడక విడి నే లేచెదరా!”
(లేదా...)
“నిద్దుర వచ్చుచున్నదని నేనిక లేచెద వీడి మంచమున్”

19 కామెంట్‌లు:

  1. సద్దునుసేయనిగుణములు
    వద్దనిసెప్పగపరమునువంగనిహృదితో
    హద్దునుదెలిసితియెరుకను
    నిద్దురవచ్చెపడకవిడినేలేచెదరా

    రిప్లయితొలగించండి
  2. కందం
    అద్దిరబన్నా! పేకల
    నొద్జిక నాడంగ సఖులు నొప్పిన మీదన్
    మిద్దెక్కి మూక, వీడియు
    నిద్దుర, వచ్చె పడక విడి నే లేచెదరా!

    ఉత్పలమాల
    అద్దిరబన్న! స్నేహితులనందరి గుంపుగ పేకలాడఁగా
    నొద్దిక రమ్మనన్ గదిలి యోపిక జాగరణమ్ము సేయఁగన్
    మిద్దెకు పైనఁ జేరగను మేలని చెప్పఁగ మూక, వీడియున్
    నిద్దుర, వచ్చుచున్నదని నేనిక లేచెద వీడి మంచమున్

    రిప్లయితొలగించండి
  3. శ్రద్ధగ శివరాత్రమ్మున
    నిద్దురవిడనాడి హరుని నియతిగ కొలువన్
    హద్దులు మీరుచు వడివడి
    నిద్దుర వచ్చె పడక విడి నే లేచెదరా!

    రిప్లయితొలగించండి

  4. ముద్దుల మనుమడు కోరగ
    పద్దెము జెప్పుచును వాని పర్యంకముపై
    నొద్దిక జేరి ఘృతాచిని
    నిద్దుర వచ్చె, పడక విడి నే లేచెదరా!



    పద్దెము జెప్పమంచు నను పౌత్రుడు కోరగ వాని మంచమం
    దొద్దకగాను కూలబడి యుత్సుక పద్యము జెప్పు చుండగా
    సోద్దెమదేమొ యభ్రమున చుక్కలు పొడ్ముచు భౌతి చేరగా
    నిద్దుర వచ్చుచున్నదని నేనిక లేచెద వీడి మంచమున్.

    రిప్లయితొలగించండి
  5. ప్రొద్దు పొ డిచినను హెచ్చుగ
    నిద్దుర వచ్చె ; పడక విడి నే లేచెదరా!
    వద్దనకు మిప్పు డైనను
    గొద్దిగ దేనీరునైన గుడువగ నొప్పున్

    రిప్లయితొలగించండి
  6. హద్దులు మీరి శ్రమించగ
    నిద్దుర వ చ్చె :పడక విడి నే లేచె దరా
    బద్ధకము వీడి పనులను
    శ్రద్ధ గ నొనరింప వలయు సంపద పొందన్

    రిప్లయితొలగించండి
  7. ప్రోద్దున లేచి పోయితిని పొమ్మని
    చెప్ప పొలమ్ము దున్నగా
    సద్దిని జేత పట్టుకొని సాగితి నమ్మ
    వచించినట్లుగా
    నెద్దుగ కాయకష్టము మరిప్పుడుజేసి
    శ్రమంబు జెందితిన్
    నిద్దుర వచ్చున్నదని నేనిక లేచెద
    వీడి మంచమున్

    రిప్లయితొలగించండి
  8. ఉ.

    ప్రొద్దున, ప్రేయసీ ! సుఖము బొందుట పద్ధతి కాదు! రాత్రులే
    ముద్దుల మున్గ చేయుటకు మోహపు కోరిక దీర్చ మేలగున్
    కొద్దిగ జాలి జూపు సఖి! కొంచెము నిద్రయు నిన్న లేదుగా,
    *నిద్దుర వచ్చుచున్నదని నేనిక లేచెద వీడి మంచమున్.*

    రిప్లయితొలగించండి
  9. శ్రద్ధగనే పరీక్షలను వ్రాయగ కష్టము సైచి పొత్తముల్
    బుద్ధిగ వల్లెవేయుటకుఁ బూనితి జాగరణమ్ము సేయగన్
    హద్దులు మీరి కన్నుగవ యక్కట! మూసుకు పోవుచుండెనే!
    నిద్దుర వచ్చుచున్నదని నేనిక లేచెద వీడిమంచమున్

    రిప్లయితొలగించండి
  10. పద్దులు వ్రాయుచు నుండగ
    నిద్దుర వచ్చె,పడకవిడినేలేచెదరా
    బద్దకమునువీడుచెపుడు
    నొద్దికగాపనియుచేయనూరటకలుగున్

    రిప్లయితొలగించండి
  11. ముద్దులొలుకు బాలకునకు
    నిద్దుర వచ్చె పడక విడి నే లేచెదరా!
    హద్దులు లేవిక తమరికి
    ప్రొద్దుపొడుచు వరకుఁ జూప ముద్దులు మురిపాల్

    ముద్దులు మూటగట్టుమన పుత్రుడు మెల్లగ గుర్రువెట్టినన్
    నిద్దుర వచ్చుచున్నదని నేనిక లేచెద వీడి మంచమున్
    సిద్దము సేసియుంటి తమసేవకు చక్కని పూలపాన్పునే
    నిద్దుర వచ్చుచున్నదని నీకిక చెప్పిన నొప్పుకొందువా

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఒద్దికజూపి పరీక్షల
    నుద్దించెడి రంధితోడ నుద్గాఢమునౌ
    పద్దునుగూడి చదువు వడి
    నిద్దురవచ్చె, పడక విడి నే లేచెదరా!

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఒద్దికజూపు తత్త్వమున యుత్తమమౌ తలపోతజేయుచున్
    శ్రద్ధగ నభ్యసించి తగు సాధనతోడ పరీక్షలన్నిటిన్
    బుద్దిగ వ్రాయబూనువడి పూర్తిగ బద్దకమేర్పడంగ, హా
    నిద్దుర వచ్చుచున్నదని నేనిక లేచెద వీడి మంచమున్.

    రిప్లయితొలగించండి
  14. కం॥ ప్రొద్దు పొడుచు సమయమనుచు
    బద్దకము వలదని యెంచి పరిణితి తోడన్
    నిద్దుర వీడఁగ నుడివితి
    నిద్దుర వచ్చె పడక విడి నేలేచెదరా!

    ఉ॥ బద్దక వీరుఁడై చనుట వద్దని దెప్పుచు లెమ్మటంచున్
    బ్రొద్దున నిద్ర ముంచునని పోరుచుఁ దెల్పఁగ భార్య క్రుద్ధతన్
    మొద్దుగ నండ రాదనుచు బుద్ధిగ లేచుచుఁ జెప్పితిట్టులన్
    నిద్దుర వచ్చుచున్నదని నేనిక లేచెద వీడిమంచమున్

    రిప్లయితొలగించండి
  15. సుద్దులు చెప్పుచునుండగ
    నిద్దుర వచ్చె పడక విడి నే లేచెదరా!
    మొద్ధుగ నిద్దురపోయిన
    బద్దకమేహెచ్చభవితపాడైపోవున్

    రిప్లయితొలగించండి
  16. 3 వ పాదము: మొద్దుగ నుండరాదనుచు లో చిన్న టైపాటండి

    రిప్లయితొలగించండి
  17. మరొక పూరణ

    ఉ॥ మొద్దుగ నిద్ర పోవుటకు ముద్దుల భార్యయు నొప్పదేలనన్
    బ్రొద్దుట లేచి నామెకును బుద్ధిగఁ గాఫి నొసంగఁ గావలెన్
    వద్దన కుండఁ ద్రావి తన బద్దక మంతయు వీడినా యనున్
    నిద్దర వచ్చుచున్నదని, నేనిక లేచెద వీడి మంచమున్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.

    శ్రద్ధగ పఠియించ దలచి
    బుద్ధిగ శయ్యను పరుండి పొత్తము దెరువన్
    కొద్ది సమయమ్ము పిమ్మట
    నిద్దుర వచ్చె;పడక విడి నే లేచెదరా!

    రిప్లయితొలగించండి