7, మే 2023, ఆదివారం

సమస్య - 4415

8-5-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామచంద్రమూర్తి రాక్షసుండు”
(లేదా...)
“రమ్యతనూవిలాసుఁడగు రాముఁడు రాక్షసుఁడే నిజంబుగన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

43 కామెంట్‌లు:


 1. శరణు గోరినంత కరుణను కురిపించి
  రక్ష జేయు నట్టి దక్షు డతడు
  ధరణిలో చెలగెడధర్మ వర్తనులకు
  రామచంద్రమూర్తి రాక్షసుండు.

  రిప్లయితొలగించండి
 2. గమ్యముముక్తిమార్గమనుకామనజూపుచుప్రాణికోటికిన్
  సామ్యతమానవుండునయిసాధనజేయరణంబుతోడిదే
  కామ్యముదీర్పరావణునికంఠముద్రెంచెనహింసమానుచున్
  రమ్యతనూవిలాసుడగురాముడురాక్షసుడేనిజంబుగన్

  రిప్లయితొలగించండి
 3. సౌమ్యత నుండకుండ మృగసంచయముంగని భూతనూజయే
  రమ్య సువర్ణశోభలిడు రాక్షసుడౌ మృగమున్ వరింపగా
  గమ్యము చూచిబాణము మృగమ్మును చంపగ గాంచెవింతనా
  రమ్యతనూవిలాసుఁడగు రాముఁడు, రాక్షసుఁడే నిజంబుగన్

  రిప్లయితొలగించండి
 4. జనుల మోసగించి సంపద హరియించి
  ధర్మ ములను వీడి ధరణి యందు
  ద్రోహ బుద్ధులైన దుష్టుల యెడల నా
  రామ చంద్ర మూర్తి రాక్షసుండు

  రిప్లయితొలగించండి
 5. -
  దశరథుని కొమరుడు దాశరథియగు శ్రీ
  రామచంద్రమూర్తి! రాక్షసుండు
  రావణుండు! లంక రాజ్యమతనిదాయె!
  వీరిరువురి నడుమ విగ్రహమ్ము


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. రిప్లయిలు
  1. ఆటవెలది
   భిన్న పాత్రలందు విశ్వవిఖ్యాతుఁడై
   నందమూరి వారి నటన మెరిసె
   రామరావు గారు రామాయణపు చిత్ర
   రామచంద్రమూర్తి, రాక్షసుండు

   ఉత్పలమాల
   సౌమ్యత రూపమై మెరయ సద్గుణరాముని బోలి వెల్గియున్
   గామ్యము గాని సీతగొను కైకసి పుత్రుని దీరు జెల్గుచున్
   సామ్యము సుంతయైన కనజాలని పాత్రల రామరావహో
   రమ్యతనూవిలాసుఁడగు రాముఁడు, రాక్షసుఁడే నిజంబుగన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 7. తండ్రి మాట కొరకు తానేగె వనముకు
  భార్య కొరకు గట్టె వార్ధి నొకటి
  కార్యదీక్షబూని కర్మమున్ సాధింప
  రామచంద్రమూర్తి రాక్షసుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సౌమ్యుడు తండ్రి మాటలకు సత్వరమేగెను కాననమ్ముకై
   కామ్యపు లేడికై వెడలి కష్టములందునఁ జిక్కి సీతకై
   గమ్యముచేర వారధిని కట్టెను లంకకు కార్యదీక్షతన్
   రమ్యతనూవిలాసుఁడగు రాముఁడు రాక్షసుఁడే నిజంబుగన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి

 8. సౌమ్యమె భూషణమ్ముగను సద్గుణ శీలము సత్యవాక్కు ప్రా
  కామ్యము గల్గినట్టి ప్రియ కాంతుడు పాలుషి భ్రూణ నిట్టులన్
  సామ్యత లేని కార్యమున సాకతమున్ విడి కాన కంపెనే
  రమ్యతనూవిలాసుఁడగు రాముఁడు రాక్షసుఁడే నిజంబుగన్.

  రిప్లయితొలగించండి

 9. కంటి నచట నేను కలికి సీతమ్మను
  బాధ పడుచు నుండ వనము నందు
  రాక్షసాంగనలను రక్షగా పెట్టెనో
  రామచంద్రమూర్తి, రాక్షసుండు.

  రిప్లయితొలగించండి
 10. అగ్ని యందు దూకి యచ్చము రూపించ ,
  నేలుకేటి పలుకు నెంచి,భార్య
  సీత నడవి కంప చిత్తగిం చిన దొర
  రామచంద్రమూర్తి రాక్షసుండు

  రిప్లయితొలగించండి
 11. రక్షకుండు జీవరాశుల చేదోడు
  రామచంద్రమూర్తి, రాక్షసుండు
  రావణాసురుండు లంకకుంగొనిపోయి
  చెఱనుబట్టె జనని సీతనౌర!

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ధర్మవర్తనమ్ము తప్పి చరించుచు
  తోడివారినెల్ల తొగలుపెట్టి
  పరిభవించునట్టి పాటవికులకెల్ల
  రామచంద్రమూర్తి రాక్షసుండు.

  సౌమ్యతలేని వర్తనము సమ్మతిగాని ప్రలాపతత్త్వమున్
  గమ్యము మృగ్యమౌ పొలుపు కక్కసబెట్టుచు తోడివారిపై
  స్వామ్యమొనర్చుచున్ కసగు పందలకెల్ల ననారతమ్ము తా
  రమ్యతనూవిలాసుడగు రాముడు రాక్షసుడే నిజంబుగన్.

  రిప్లయితొలగించండి
 13. సౌమ్యుఁడు సాధువర్తనుఁడు సారస నేత్రుఁడు సద్గుణుండు నౌ
  రమ్యతనూవిలాసుఁడగు రాముఁడు రాక్షసుఁడే నిజంబుగన్?
  సామ్యమునెంచగా తనకు సాటియె తానగు, ధర్మబద్ధుడై
  రమ్యగుణాభిరామ శుభలక్షణ జానకినంపె కానకున్

  రిప్లయితొలగించండి
 14. సౌమ్య మనస్కుడై వెలిగె చండకరాన్వయుడై జనించి తాన్
  సామ్యము చూపుచున్ బ్రజకు చక్కని పాలన తోడ మించుచున్
  గమ్యము శాంతిభద్రతలు కాంచుట పృథ్విని, శత్రు భంజనమ్మునన్
  రమ్యతనూవిలాసుఁడగు రాముఁడు, రాక్షసుఁడే నిజంబుగన్

  రిప్లయితొలగించండి
 15. *శంకరాభరణం సమస్యాపూరణము*
  ఆ.వె.
  ప్రజలమేలు గోరి పాలించినట్టి యా
  రామచంద్రమూర్తి ప్రేమమూర్తి;
  ప్రజల డబ్బు దినుచు బదవినున్నట్టి యీ
  *రామచంద్రమూర్తి రాక్షసుండు*

  రిప్లయితొలగించండి
 16. రమ్యగుణాన్వితంబయిన రాజిత
  సీతను బెండ్లయాడె నా
  రమ్య తనూవిలాసుడుగు రాముడు,
  రాక్షసుడే నిజంబుగన్
  గమ్యమెరుంగకన్ వినియు కల్లరి
  రావణు మాట చొప్పునన్
  సౌమ్యడు మారి జింకగను సాధ్వికి
  సీతకు కానిపించెడిన్.

  రిప్లయితొలగించండి
 17. ఆ॥ ధర్మరక్షణకని ధాత్రిని వెలసిన
  విష్ణుమూర్తి యతఁడు విహిత మరియ
  సద్గుణముల ప్రోవు సౌమ్యుఁడెటుల నగున్
  రామచంద్ర మూర్తి రాక్షసుండు

  ఉ॥ సామ్యము లేని వాఁడతఁడు సద్గుణ సంపదలందు ధాత్రిలో
  సౌమ్యుఁడు రాఘవుండనిరి సర్వులు రాముని బాణమొక్కటే
  గమ్యము ధర్మ రక్షణముఁ గాంచుట ఘోరము పల్కనిట్టులన్
  రమ్యతనూ విలాసుఁడగు రాముఁడు రాక్షసుఁడే నిజంబుగన్

  రిప్లయితొలగించండి
 18. దైవమతడుసత్య‌ ధర్మాన్ని కాపాడు‌
  శక్తి మేరువతడు‌ శాంతమూర్తి
  దురితాత్ములకును‌ తోవనుసరిచేయ‌
  రామచంద్రమూర్తి, రాక్షసుండు

  రిప్లయితొలగించండి
 19. తాను మృదువు తనదు ధర్మంబు మృదువును/
  మృదువు సీత జూడ మృదువు మృదువు/ ధర్మ మార్గమెపుడు తప్పించనెంచడు రామచంద్ర మూర్తి రాక్షసుండు

  రిప్లయితొలగించండి
 20. సౌమ్యుడుసాధుసన్నుతుడ సాగెను కానకు తండ్రిమాటకై
  రమ్యతనూవిలాసుడగురాముడు రాక్షసుడే నిజంబుగన్
  సౌమ్యపురూపుతోడనటచానయునొంటిగనుండవచ్చితా
  గమ్యముదప్పినెత్తుకొనికాంతను సాగెను దుష్టబుద్ధితో  శరణు గోరినంత కరుణను కురిపించి
  రక్ష జేయు నట్టి దక్షు డతడు
  ధరణిలో చెలగెడధర్మ వర్తనులకు
  రామచంద్రమూర్తి రాక్షసుండు.

  ధర్మరక్షకు డెవరన ధరణియందు
  రామచంద్రమూర్తి; రాక్షసుండు
  నతడెవినుముజవముగానసురులకును
  శిష్టజనులనుకాపాడు శ్రేష్టుడితడె

  ధర్మమునిల కావ ధరణిలో జనియించె
  రామచంద్రమూర్తి:రాక్షసుండు
  సతిని నపహరింప సంహరించగవచ్చె
  వానరులనుగూడివాసిగాను

  రిప్లయితొలగించండి