13, మే 2023, శనివారం

సమస్య - 4420

14-5-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తనయ తండ్రి కిచ్చె జనన మలరి”
(లేదా...)
“తనయ మనోహరుం డయిన తండ్రికి జన్మము నిచ్చె నింపుగాన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

13 కామెంట్‌లు:


  1. తండ్రి యతడె కాదె ధరణి జీవులకెల్ల
    పాప జన్నిగట్టు పరశు ధరుడు
    కరివదన సుముఖుడు, గిరిరాజ ముద్దుల
    తనయ తండ్రి కిచ్చె జనన మలరి.

    రిప్లయితొలగించండి
  2. మరణశయ్యనున్న దురదృష్టవంతులు
    మరలజన్మమొందు మార్గమొకటి
    నవయవముల దానమందించి చూపగా
    తనయ తండ్రి కిచ్చె జనన మలరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తనయగ విత్తునే తలచి తండ్రిగ భూజము నెంచి చూడగా
      వినుటకు వింతలేదుకద విత్తనమిచ్చును జన్మ మ్రాకుకున్
      కనుగొనగల్గినన్ దెలియు కన్నులముందర కల్గు చోద్యముల్
      తనయ మనోహరుం డయిన తండ్రికి జన్మము నిచ్చె నింపుగాన్

      తొలగించండి

  3. మునిజన వంద్యుడాతడయి ముందుగ పూజల నందు కొంచు తా
    జనకునిగాను లోకమున సత్కృతి బొందుచు నగ్రయాయి యౌ
    ఘనుడగు పుత్రునిన్ బడయ కాంక్ష జనింపగ రాజు పర్వతున్
    దనయ మనోహరుం డయిన తండ్రికి జన్మము నిచ్చె నింపుగాన్.

    రిప్లయితొలగించండి
  4. ఘనమగు రోడు దుర్ఘటన కారు ప్రయాణము
    సేయుచుండగా
    కనివిననట్టి తీరుగను గట్టిగ జర్గెను కన్న
    తండ్రికిన్
    దనువుకు దాకి దెబ్బలును దద్దయు రక్తము
    వోవ నిచ్చియున్
    తనయ మనోహరుండయిన తండ్రికి నిచ్చెను
    జన్మ నింపుగాన్

    రిప్లయితొలగించండి
  5. వినయము ధర్మ మార్గమును వేదవిధమ్ముగజీవనంబు నీ
    జనముకు చూపుగా హరియె జన్మమునేత్త దలంచి ధాత్రిలో
    గుణవతి,సాధుశీలయగు కోసలదేశపుబట్టి సింధురా
    డ్తనయ మనోహరుం డయిన తండ్రికి జన్మము నిచ్చె నింపుగాన్

    రిప్లయితొలగించండి
  6. తండ్రి గాయ పడియు దైన్యమ్ము గా నుండ
    రక్త మిచ్చి తనను రక్ష సేయ
    సిద్ద పడియు వెడలి సేమమ్ము నరసియున్
    తనయ తండ్రి కిచ్చె జనన మలరి

    రిప్లయితొలగించండి
  7. చం.

    వినయము భక్తి "పేరొ" యను విశ్వసనీయపు సూన ఖైదునన్
    జనకుని రక్షకై మిగుల జాలిని నొందె , "సిమన్" ప్రశస్తకున్
    చనులను వంచ క్షీరమును చక్కగ ద్రాగగ క్షుత్తు నోర్చెడిన్
    *తనయ మనోహరుం డయిన తండ్రికి జన్మము నిచ్చె నింపుగాన్.*

    కథ:
    en.wikipedia.org/wiki/Roman_Charity

    రిప్లయితొలగించండి
  8. తొందరపడి నాసుతునికి యిరువదేండ్ల
    ప్రాయమందు ముందు వత్సరమున
    పెండ్లి జరుపగ మగ బిడ్డనతని మామ
    తనయ తండ్రి కిచ్చె జనన మలరి

    జననము = వంశము

    రిప్లయితొలగించండి
  9. అనయము సత్యభాషణము నార్తజనావళి రక్షణంబునున్
    వినయ విధేయతల్పడుగు పేకలుగా పెనవేసి నట్టి రా
    ముని, మునివంద్యునిన్, తనదు ముద్దుల పట్టిగ కోసలేశునిన్
    తనయ మనోహరుం డయిన తండ్రికి జన్మము నిచ్చె నింపుగాన్

    రిప్లయితొలగించండి
  10. సాధువర్తనమ్ము సత్యవాక్పాలన
    ప్రోది జేసుకున్న పుణ్యమూర్తి
    రామచంద్రుఁ సద్గుణమణి కోసలరాజ
    తనయ, తండ్రి కిచ్చె జనన మలరి

    రిప్లయితొలగించండి
  11. ఆ॥ స్వర్గమునకు తండ్రి చనఁగఁ గాలము చెల్లి
    కడుపు లోన బిడ్డ కదులు చుండె
    తనయ కపుడు సుతునిఁ గనఁగ జనులనిరి
    తనయ తండ్రి కిచ్చె జనన మలరి

    రిప్లయితొలగించండి