6, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4579

7-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేకువ వినిపించు జోల వీనులవిందౌ”
(లేదా...)
“వేకువ జామునందు శ్రుతిపేయమగున్ గద జోలపాటయే”

22 కామెంట్‌లు:


 1. పోకిరి తనమును విడుమిక
  చీకటి వ్యాపించె జోలె చేరగ రారా
  నాకుడ గననిది కాదుర
  వేకువ, వినిపించు జోల వీనులవిందౌ.

  రిప్లయితొలగించండి
 2. ఆకొనిబాలుండేడ్వగ
  సాకుచుతల్లియుమురిపెముచాలగజూపెన్
  రాకాబింబముతొలగెను
  వేకువవినిపించుజోలవీనులవిందై

  రిప్లయితొలగించండి
 3. కాకి కులాయమున బెరిగి
  మాకందము జిగురుమేసి మదమును బొందన్
  కోకిల గళమును విప్పుచు
  వేకువ వినిపించు జోల వీనులవిందౌ

  రిప్లయితొలగించండి
 4. ప్రాకట సుప్రభాతములు భక్తి ప్రగీతము లాలకింతురా
  చీకటి ద్రుంచుచున్ నభము సీరకుడుద్భవమందు నట్టియా
  వేకువ జామునందు, శ్రుత పేయమగున్ గద జోలపాట యే
  చీకటి వేళ తల్లి తన చిట్టడుగున్ పవళింపజేసెడిన్.

  రిప్లయితొలగించండి
 5. చాకిరితో రాత్రి గడచె,
  రాక సమయము తొలిజాము; రానినిదురకై
  చీకాకు పడు సమయమున
  వేకువ వినిపించు జోల వీనులవిందౌ!
  (Night duty problems).

  రిప్లయితొలగించండి
 6. కందం
  నాకన నుద్యోగమ్మది
  చేకూరెను రాత్రి పూట చేయఁగ విధులన్
  నా కులసతి లాలించుచు
  వేకువ వినిపించు జోల వీనులవిందౌ!

  ఉత్పలమాల
  చేకురె రాత్రులన్ విధులు సేయఁగనెంచెడు గొల్వు ముందుగన్
  నాకది క్రొత్తగాన నొక నాలుగు నాళ్లది కష్టమయ్యెనే
  నా కులకాంత లాలనల నాకని పాడుచు నుండ ప్రేమతో
  వేకువ జామునందు శ్రుతిపేయమగున్ గద జోలపాటయే!

  రిప్లయితొలగించండి
 7. కాకుల గోలే నిరతము
  వేకువ వినిపించు; జోల వీనులవిందౌ
  చీకటిముదిరిన సమయము
  శ్రీకృష్ణునికై యశోద లీలగ పాడన్

  కాకులగోలమేల్కొలుపు కర్ణకఠోరము గాదె నిత్యమున్
  వేకువ జామునందు; శ్రుతిపేయమగున్ గద జోలపాటయే
  చీకటి చిక్కనైనతరి చిన్మయ రూపుని నిద్రపుచ్చగా
  గోకులమున్ యశోద గొను కోమల గాత్రపు కూనిరాగముల్

  రిప్లయితొలగించండి
 8. శ్రీ కర పు సు ప్ర భాత ము
  వేకువ విని పించు :: వీ నుల విందౌ
  చీకటి వేళను బాపకు
  జోకొడు తూ తల్లి పాడ సోక గ జెవి కిన్

  రిప్లయితొలగించండి
 9. చీకటిరాతిరిన శిశువు
  ఆకలిగొని నిదురలేచి అమ్మాయనగా
  ప్రాకటముగ పాలిచ్చుచు
  వేకువ వినిపించు జోల వీనులవిందౌ

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. కం॥ ఆఁకలిఁ దీర్చుచు జననియె
   కోకిల కంఠమున పాడ కొమరుని కొరకై
   చేకొని యూఁచుచు నుయ్యల
   వేకువ వినపించు జోల వీనులవిందౌ

   ఉ॥ ఆఁకలిఁ దీర్చుచున్ జనని యల్లరి మాన్పఁగఁ దల్లడిల్లుచున్
   జేకొని చంటి పాపనటు సేవలఁ జేయుచు ప్రీతిఁ గాంచుచున్
   గోకిల కంఠ మాధురిని కోమలి యూయల లూఁచి పాడఁగన్
   వేకువ జామునందు శ్రుతి పేయమగున్ గద జోలపాటయే!

   చేకొను ఆదరించు
   చంటి బిడ్డలు రోజుకు 16-18 గంటలు నిద్రపోవాలి గదండి
   క్షమించాలి నేను తెలియక చేసే పొరపాట్లు కాకుండా ఐఫోన్ ఆటో కరెక్షన్ కూడ మార్చేస్తుంటుందండి

   తొలగించండి
 11. వాకిట కలరవములిరిసె
  వేకువ బొడసూప దూర్పు వేల్పర యంగన్
  నాకమె నాకా సమయము
  వేకువ వినిపించు జోల వీనుల విందౌ

  రిప్లయితొలగించండి
 12. పద్యాలు వ్రాయటం ఈమధ్యనే నేర్చుకుంటున్నాను. పెద్దలు తప్పులుంటే చెప్ప గలరు 🙏

  రిప్లయితొలగించండి

 13. చీకునుచింతయులేకయు
  నాకలిదప్పులనుమరచియనవరతంబున్
  కోకయె పాన్పవ పాపకు
  *వేకువ వినిపించు జోల వీనులవిందౌ”*

  మరొక పూరణ

  ఆకులుగలగలలాడగ
  కేకియుపురివిప్పియాడికేరింతలిడన్
  కోకిలగానామృతమే
  వేకువ వినిపించు జోల వీనులవిందౌ

  రిప్లయితొలగించండి
 14. ఆకసమార్గమందువడినర్కుడు స్యందన మెక్కు వేళలన్
  కాకులు కావుకావనుచు గట్టిగ గోలలు చేయు చుండగా
  కోకిల సుస్వరమ్ముగను కూయచు గానము నాలపింపగన్
  వేకువజామునందు శ్రుతి పేయమగున్ గద జోలపాటయే

  రిప్లయితొలగించండి
 15. ప్రాకుచు పక్క జేరి పసి పాపడు తల్లిని తట్టి లేపగా
  నాకలి కేడ్చు బిడ్డ కడుపారగ పాలను ద్రాపి ప్రేముడిన్
  చేకొని చంక నెత్తుకొని చిన్నగ నూపుచునుండ వానికా
  వేకువ జామునందు శ్రుతిపేయమగున్ గద జోలపాటయే
  ~ సూర్యం

  రిప్లయితొలగించండి
 16. ఉ.

  లోకుల శాంతికై, భటుల లోకము, రక్షణసేయ రాత్రులన్
  నూకలు రూకలున్ శివము, నోముగ నూటికి నూరువంతుగా
  భూకము బోవ నిద్రకయి ప్రొద్దున పానుపు నెక్కగా వెసన్
  *వేకువ జామునందు శ్రుతిపేయమగున్ గద జోలపాటయే.*

  రిప్లయితొలగించండి
 17. వేకువ కాక మున్నె విలపించెడు బిడ్డకు దల్లి యర్మిలిన్
  యాకలి దీర్చి స్తన్యమిడి యాదరమొప్పగ లాల పోయుచున్
  సోకుగ చిట్టిబుగ్గపయి చుక్కను దిద్దుచు నిద్రబుచ్చగన్
  వేకువ జామునందు శ్రుతిపేయమగున్ గద జోలపాటయే

  రిప్లయితొలగించండి
 18. వేకువ నేడ్చెడు బిడ్డకు
  సాకతమున స్తన్యమిచ్చి సంహర్షముగా
  యాకలి బాపుచు శుశ్రువు
  వేకువ వినిపించు జోల వీనులవిందౌ

  రిప్లయితొలగించండి

 19. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  చీకటి వీడుచు నుండగ
  కాకులరచుట మొదలయ్యె 'కాకా' యనుచున్
  కోకిల కూజిత స్వరముల
  వేకువ వినిపించు జోల వీనుల విందౌ.

  రిప్లయితొలగించండి