28-11-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్”(లేదా...)“పట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్”
కందంగిట్టని పనులను జేయగఁదట్టునెటుల కుర్రకుంక! దాటుట తగునా?గట్టిప్రాణమె! నీవాపట్టా లెక్కకయె, రైలు పరువులు దీసెన్!శార్దూలవిక్రీడితముగిట్టన్ జాలని వన్న నా పనులనే కేరింతలన్ జేతువే!తట్టున్ నీకెటులన్? బ్రమాదమనినన్ దాటంగ నీవెంచితే?గట్టిప్రాణము లౌను నీవిగనుకే గట్టెక్కితే! నీవటన్పట్టాలెక్కక, రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్!
చుట్టాలను రండనిజూపెట్టెనయస్కాంతరైలు, పృథివినదసలేముట్టదు, జూచుచు నుండన్పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్.
చుట్టాలొచ్చిన వేళనుపట్టగ తరమౌనె ఆటపాటలనెల్లన్దిట్టముగా రైలాటలొపట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్
చిట్టీ చిట్టీ మనమొకఅట్టాతో రైలుచేసి యాడుదు మనుచున్కట్టగ నాన్నొక బొమ్మనుపట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్
కం॥పుట్టింటినుండిరాననిపట్టున్ బట్టెనలిగిపతిపైతగులన్ బెట్టెవివాహరిజిష్ట్రేషనుపట్టాల్ ఎక్కకయె రైలు పరువులు దీసెన్గాదిరాజు మధుసూదన రాజు
పట్టున్ బట్టెనలిగితనపతిపైతగులన్
చిట్టియె చేరెను కనుమాజట్టున రైలాట నాడు సవయస్కులతోన్ బెట్టుచు కూయని కేకలుపట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్.చిట్టీ యంచును చెంతకేగగనె వైచిత్యమ్ము తో కూతురే పుట్టమ్ముల్ వలదంచు బావురనె సెల్ఫోనొక్కటిన్ గోరుచున్ బెట్టున్ జేయగ తెచ్చి యిచ్చితిని సంప్రీతిన్ మొబైలందునన్ పట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్.
పట్టములు పంచుట కొరకుపెట్టెలలో సిద్ధపరచి పెట్టిన వాటిన్పట్టణము జేర్చ బోవగపట్టా లెక్కకయె , రైలు పరువులు దీసెన్పట్టా = విశ్వవిద్యాలయము లిచ్చు డిగ్రీ
పట్టువిడని దేవేరినిపుట్టింటికి సాగనంపు పురుషుండతడేకట్టు తెగిన గుఱ్ఱమువలె,పట్టా లెక్కకయె రైలు, పరువులు దీసెన్కట్టించెన్ దనతండ్రి మిద్దె యనుచున్ గాంతామణే చెప్పుచున్పట్టే వీడక పుట్టినింటి కరిగెన్ బ్రాణేశునిన్ వీడుచున్కట్టే త్రెంచిన గుఱ్ఱమై మగడు తాఁ గాంతావినోదంబుకై,పట్టాలెక్కక రైలు, పర్వులిడె దుర్వారంపు వేగంబునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు, అమెరికా (క్యాంపు) కట్టడి గూడిన పిల్లలుజట్టుగ రైలాటనాడు సమయమునందున్బిట్టుగ నుఱుకుచు పోవగపట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్.జట్టైగూడిన పిల్లలందరు విశేషంబైన సంసక్తితోపెట్టెల్ మాదిరినిల్చి రైలువలె వ్యాప్తింజెంది నావెంటనేబిట్టుంజెంది రయమ్ముగా కదలుటన్ వీక్షించి భావించెదన్పట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్.
చెట్టాపట్టాల్ వేసుకునెట్టియదుపు నడ్డులేక హేలాలీలన్బిట్టుగ దిరుగగఁ యుగ్మముపట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్
చెట్టాపట్టగ ప్రేయసీప్రియులు నిస్సిగ్గున్ వెలారించుచున్చెట్టున్ పుట్టనుబట్టి పట్టపగలే శృంగార వారాశిలోబెట్టుంజూపక మున్గిదేలుటకు నిర్భీతిన్ ప్రదర్శింపగాపట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్
పుట్టెను వదంతి తనపైపుట్టెడు దుఃఖ మ్ము తోడ పోయెను జావన్కట్టా! పరుగున వెడలియుపట్టా లెక్కకనె రైలు పరివులు దీ సెన్
కం॥ కట్టూ బొట్టూ తీరునుబట్టక విడువఁగ మనుజులు భరతా వనిలోగట్టిగఁ బశ్చిమ సంస్కృతిపట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్శా॥ కట్టూబొట్టును వీడి నేఁడు మనుజుల్ గాక్షించుచున్ సంస్కృతిన్బట్టంగట్టుచు బాహ్య దేశముల యిప్పాటన్ బ్రమోదమ్ముతోదిట్టంగన్ జన పశ్చిమంపు విధముల్ దేదీప్య మానంబుగన్బట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్
పట్టునుబట్టుచుబాలుడుకొట్టునగనిరైలుబండికొనమనికోరన్నిట్టట్టనకనుకొననే*"పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్”*
చుట్టాల చంటి పాపకు నట్టలతోఁ జేసిరైలు హాయని యీయన్ బట్టుచు ముందుకు త్రోయన్ బట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. పట్టిన పట్టును వీడకకొట్టున నొక బొమ్మ రైలుఁ కొని తెచ్చియు నప్పట్టున 'కీ' యిచ్చి వదలపట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్.
కందం
రిప్లయితొలగించండిగిట్టని పనులను జేయగఁ
దట్టునెటుల కుర్రకుంక! దాటుట తగునా?
గట్టిప్రాణమె! నీవా
పట్టా లెక్కకయె, రైలు పరువులు దీసెన్!
శార్దూలవిక్రీడితము
గిట్టన్ జాలని వన్న నా పనులనే కేరింతలన్ జేతువే!
తట్టున్ నీకెటులన్? బ్రమాదమనినన్ దాటంగ నీవెంచితే?
గట్టిప్రాణము లౌను నీవిగనుకే గట్టెక్కితే! నీవటన్
పట్టాలెక్కక, రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్!
చుట్టాలను రండనిజూ
రిప్లయితొలగించండిపెట్టెనయస్కాంతరైలు, పృథివినదసలే
ముట్టదు, జూచుచు నుండన్
పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్.
చుట్టాలొచ్చిన వేళను
రిప్లయితొలగించండిపట్టగ తరమౌనె ఆటపాటలనెల్లన్
దిట్టముగా రైలాటలొ
పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్
చిట్టీ చిట్టీ మనమొక
రిప్లయితొలగించండిఅట్టాతో రైలుచేసి యాడుదు మనుచున్
కట్టగ నాన్నొక బొమ్మను
పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్
కం॥
రిప్లయితొలగించండిపుట్టింటినుండిరానని
పట్టున్ బట్టెనలిగిపతిపైతగులన్
బెట్టెవివాహరిజిష్ట్రేషను
పట్టాల్ ఎక్కకయె రైలు పరువులు దీసెన్
గాదిరాజు మధుసూదన రాజు
పట్టున్ బట్టెనలిగితనపతిపైతగులన్
తొలగించండిచిట్టియె చేరెను కనుమా
రిప్లయితొలగించండిజట్టున రైలాట నాడు సవయస్కులతోన్
బెట్టుచు కూయని కేకలు
పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్.
చిట్టీ యంచును చెంతకేగగనె వైచిత్యమ్ము తో కూతురే
పుట్టమ్ముల్ వలదంచు బావురనె సెల్ఫోనొక్కటిన్ గోరుచున్
బెట్టున్ జేయగ తెచ్చి యిచ్చితిని సంప్రీతిన్ మొబైలందునన్
పట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్.
రిప్లయితొలగించండిపట్టములు పంచుట కొరకు
పెట్టెలలో సిద్ధపరచి పెట్టిన వాటిన్
పట్టణము జేర్చ బోవగ
పట్టా లెక్కకయె , రైలు పరువులు దీసెన్
పట్టా = విశ్వవిద్యాలయము లిచ్చు డిగ్రీ
పట్టువిడని దేవేరిని
రిప్లయితొలగించండిపుట్టింటికి సాగనంపు పురుషుండతడే
కట్టు తెగిన గుఱ్ఱమువలె,
పట్టా లెక్కకయె రైలు, పరువులు దీసెన్
కట్టించెన్ దనతండ్రి మిద్దె యనుచున్ గాంతామణే చెప్పుచున్
పట్టే వీడక పుట్టినింటి కరిగెన్ బ్రాణేశునిన్ వీడుచున్
కట్టే త్రెంచిన గుఱ్ఱమై మగడు తాఁ గాంతావినోదంబుకై,
పట్టాలెక్కక రైలు, పర్వులిడె దుర్వారంపు వేగంబునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, అమెరికా (క్యాంపు)
రిప్లయితొలగించండికట్టడి గూడిన పిల్లలు
జట్టుగ రైలాటనాడు సమయమునందున్
బిట్టుగ నుఱుకుచు పోవగ
పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్.
జట్టైగూడిన పిల్లలందరు విశేషంబైన సంసక్తితో
పెట్టెల్ మాదిరినిల్చి రైలువలె వ్యాప్తింజెంది నావెంటనే
బిట్టుంజెంది రయమ్ముగా కదలుటన్ వీక్షించి భావించెదన్
పట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్.
చెట్టాపట్టాల్ వేసుకు
రిప్లయితొలగించండినెట్టియదుపు నడ్డులేక హేలాలీలన్
బిట్టుగ దిరుగగఁ యుగ్మము
పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్
చెట్టాపట్టగ ప్రేయసీప్రియులు నిస్సిగ్గున్ వెలారించుచున్
రిప్లయితొలగించండిచెట్టున్ పుట్టనుబట్టి పట్టపగలే శృంగార వారాశిలో
బెట్టుంజూపక మున్గిదేలుటకు నిర్భీతిన్ ప్రదర్శింపగా
పట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్
పుట్టెను వదంతి తనపై
రిప్లయితొలగించండిపుట్టెడు దుఃఖ మ్ము తోడ పోయెను జావన్
కట్టా! పరుగున వెడలియు
పట్టా లెక్కకనె రైలు పరివులు దీ సెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ కట్టూ బొట్టూ తీరును
రిప్లయితొలగించండిబట్టక విడువఁగ మనుజులు భరతా వనిలో
గట్టిగఁ బశ్చిమ సంస్కృతి
పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్
శా॥ కట్టూబొట్టును వీడి నేఁడు మనుజుల్ గాక్షించుచున్ సంస్కృతిన్
బట్టంగట్టుచు బాహ్య దేశముల యిప్పాటన్ బ్రమోదమ్ముతో
దిట్టంగన్ జన పశ్చిమంపు విధముల్ దేదీప్య మానంబుగన్
బట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్
పట్టునుబట్టుచుబాలుడు
రిప్లయితొలగించండికొట్టునగనిరైలుబండికొనమనికోరన్
నిట్టట్టనకనుకొననే
*"పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్”*
చుట్టాల చంటి పాపకు
రిప్లయితొలగించండినట్టలతోఁ జేసిరైలు హాయని యీయన్
బట్టుచు ముందుకు త్రోయన్
బట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
పట్టిన పట్టును వీడక
కొట్టున నొక బొమ్మ రైలుఁ కొని తెచ్చియు న
ప్పట్టున 'కీ' యిచ్చి వదల
పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్.