13-11-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కిరణమ్మే దారి దప్పఁ గీలకము గదా”(లేదా...)“కిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది దారి దప్పఁగన్”(ఒంగోలు అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)
గురుదేవులకు మరియు కవిమిత్రలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలతో.... సంధి విఫలమై యుద్ధమునకు దారితీయఁగ భీముడు ద్రౌపదిల అంతరంగము.... కందం'హరి వ్యూహమ్మున సంధియె'కురు సభఁ బాండవుల బలము గొప్పగఁ బలుకన్బురికొనె, కౌరవులన్ దాకి, రణమ్మే! 'దారి దప్పఁ గీలకము గదా!'చంపకమాల'గిరిధరు డల్లె వ్యూహమదె!' గెల్వఁగ ధర్మము సంధికేగుచున్గురు సభఁ బాండునందనుల గొప్పతనంబును యుద్ధమందునన్బురికొనఁ బల్కినంతటనె పొల్లొనగూర్పక కూర్చె వారిఁ దాకి, రణము మాత్రమే మనకుఁ! 'గీలకమైనది దారి దప్పఁగన్!'
వరమది మానవాలికిని వాసురయందున కర్మ సాక్షిదౌకిరణము మాత్రమే మనకు గీలకమైనది,దారతప్పగన్వరదుని రూపమై వెలుగు బంచియుచూపునుదారి నిత్యమున్అరయగ పద్మ బాంధవుని యద్భత మౌ కిరణమ్మె వెల్గిడున్
నెరవునెరుంగని పొలమునతిరముగ నిబ్బరము మరియు తేకువ తోడన్సరియగు దిక్కునెరుగ రవికిరణమ్మే దారి దప్పఁ గీలకము గదానెరవునెరుంగకుండినను నిబ్బరమేమన మానసంబునన్దిరముగ నుంచుకొన్నతఱి దిక్కులు చూడనవశ్యమేగదా సరియగు దిక్కునెంచుకొనఁ సానువు భానుని కాంతివంతమౌకిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది దారి దప్పఁగన్
నరులను లక్ష్యము జేర్చునుకిరణమ్మే ; దారి దప్పఁ గీలకము గదాగరువము తో పనియందుననిరతిని వెలువరచ కుండ నేమము గడుపన్
అరుణుడు పడమట క్రుంగగధరణిని వ్యాపించె గనుమ తామసి, యీ ప్రాంతరమందున లేకున్నను కిరణమ్మే , దారి దప్పఁ గీలకము గదా.( *లక్షాగృహ దహనమనంతరం అడవిలో చీకటి పడగా ధర్మరాజు అర్జునునితో అను మాటలు* )ధరణిని యాక్రమించెగద తామసి కాననమందు పత్సలమ్మెరుగగ లేము ఫల్గుణ త్రయీతను వాతడు తూర్పు దిక్కు గోచరమగు వేళకోసమయి జాగరణమ్మొన రింప మేలగున్ కిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది, దారి దప్పఁగన్.
అరిషడ్వర్గపు పాల్పడికరినిండిన లోకమందు కాంతులు నింపన్ తెరవేమిక తురగలిగొనుకిరణమ్మే దారి దప్పఁ గీలకము గదా
పరి పరి ముల యత్నపుహరి ద్యూ తము విఫ ల మ య్యె నని తప్పదు గాకురు సే నల మార్కొ ని దాకి ర ణ మ్మే దారి దప్ప కీలకము గదా "
పరులను వంచన చేయుచునిరతము జీవించువాని నియతిని మార్చన్వరముగ సజ్జన సంగతకిరణమ్మే దారి దప్పఁ గీలకము గదా
కం॥ వరమగు మనుజులు తృప్తిగగరువము వీడి బ్రదుకఁగను గరిమముఁ గనుచున్మరువకు భువినత్యాశాకిరణమ్మే దారి దప్పఁ గీలకము గదా!చం॥ వరమగు ధాత్రియందునను వాంఛలు హద్దులు దాఁట కున్నచోనరయఁగఁ దృప్తినొందు తెరఁగాశలె మోసుకు సాగకున్ననేమరువకు మిచ్ఛలేర్పరుచు మానక నిత్యము మోహ లాలసాకిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది దారి దప్పఁగన్ఆశాకిరణాన్ని అత్యాశా కిరణము మోహలాలసా కిరణముగా మార్చి వ్రాసానండి
శరణము వేడక తిరిగెడుదురాత్ములకిలనుమిగులునుదుఃఖంబొకటేమరువక నీతిని చన నాకిరణమ్మే దారి దప్ప కీలకము గదా
నరునకు దుష్ట సంగతమునన్ ప్రభవించగ వక్రబుద్ధి తానొరులకు కీడొనర్చ గడు నుత్సుకతన్ బ్రకటించు చుండు మత్సరము పెనంగొనంగ గతి తప్పును పోఁడిమి, చూడ గాంక్షయన్కిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది దారి దప్పఁగన్
గురుదేవులకు మరియు కవిమిత్రలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలతో....
రిప్లయితొలగించండిసంధి విఫలమై యుద్ధమునకు దారితీయఁగ భీముడు ద్రౌపదిల అంతరంగము....
కందం
'హరి వ్యూహమ్మున సంధియె'
కురు సభఁ బాండవుల బలము గొప్పగఁ బలుకన్
బురికొనె, కౌరవులన్ దా
కి, రణమ్మే! 'దారి దప్పఁ గీలకము గదా!'
చంపకమాల
'గిరిధరు డల్లె వ్యూహమదె!' గెల్వఁగ ధర్మము సంధికేగుచున్
గురు సభఁ బాండునందనుల గొప్పతనంబును యుద్ధమందునన్
బురికొనఁ బల్కినంతటనె పొల్లొనగూర్పక కూర్చె వారిఁ దా
కి, రణము మాత్రమే మనకుఁ! 'గీలకమైనది దారి దప్పఁగన్!'
వరమది మానవాలికిని వాసుర
రిప్లయితొలగించండియందున కర్మ సాక్షిదౌ
కిరణము మాత్రమే మనకు గీలకమైనది,
దారతప్పగన్
వరదుని రూపమై వెలుగు బంచియు
చూపునుదారి నిత్యమున్
అరయగ పద్మ బాంధవుని యద్భత
మౌ కిరణమ్మె వెల్గిడున్
నెరవునెరుంగని పొలమున
రిప్లయితొలగించండితిరముగ నిబ్బరము మరియు తేకువ తోడన్
సరియగు దిక్కునెరుగ రవి
కిరణమ్మే దారి దప్పఁ గీలకము గదా
నెరవునెరుంగకుండినను నిబ్బరమేమన మానసంబునన్
దిరముగ నుంచుకొన్నతఱి దిక్కులు చూడనవశ్యమేగదా
సరియగు దిక్కునెంచుకొనఁ సానువు భానుని కాంతివంతమౌ
కిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది దారి దప్పఁగన్
నరులను లక్ష్యము జేర్చును
రిప్లయితొలగించండికిరణమ్మే ; దారి దప్పఁ గీలకము గదా
గరువము తో పనియందున
నిరతిని వెలువరచ కుండ నేమము గడుపన్
అరుణుడు పడమట క్రుంగగ
రిప్లయితొలగించండిధరణిని వ్యాపించె గనుమ తామసి, యీ ప్రాం
తరమందున లేకున్నను
కిరణమ్మే , దారి దప్పఁ గీలకము గదా.
( *లక్షాగృహ దహనమనంతరం అడవిలో చీకటి పడగా ధర్మరాజు అర్జునునితో అను మాటలు* )
ధరణిని యాక్రమించెగద తామసి కాననమందు పత్సల
మ్మెరుగగ లేము ఫల్గుణ త్రయీతను వాతడు తూర్పు దిక్కు గో
చరమగు వేళకోసమయి జాగరణమ్మొన రింప మేలగున్
కిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది, దారి దప్పఁగన్.
అరిషడ్వర్గపు పాల్పడి
రిప్లయితొలగించండికరినిండిన లోకమందు కాంతులు నింపన్
తెరవేమిక తురగలిగొను
కిరణమ్మే దారి దప్పఁ గీలకము గదా
పరి పరి ముల యత్నపు
రిప్లయితొలగించండిహరి ద్యూ తము విఫ ల మ య్యె నని తప్పదు గా
కురు సే నల మార్కొ ని దా
కి ర ణ మ్మే దారి దప్ప కీలకము గదా "
పరులను వంచన చేయుచు
రిప్లయితొలగించండినిరతము జీవించువాని నియతిని మార్చన్
వరముగ సజ్జన సంగత
కిరణమ్మే దారి దప్పఁ గీలకము గదా
కం॥ వరమగు మనుజులు తృప్తిగ
రిప్లయితొలగించండిగరువము వీడి బ్రదుకఁగను గరిమముఁ గనుచున్
మరువకు భువినత్యాశా
కిరణమ్మే దారి దప్పఁ గీలకము గదా!
చం॥ వరమగు ధాత్రియందునను వాంఛలు హద్దులు దాఁట కున్నచో
నరయఁగఁ దృప్తినొందు తెరఁగాశలె మోసుకు సాగకున్ననే
మరువకు మిచ్ఛలేర్పరుచు మానక నిత్యము మోహ లాలసా
కిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది దారి దప్పఁగన్
ఆశాకిరణాన్ని అత్యాశా కిరణము మోహలాలసా కిరణముగా మార్చి వ్రాసానండి
శరణము వేడక తిరిగెడు
రిప్లయితొలగించండిదురాత్ములకిలనుమిగులునుదుఃఖంబొకటే
మరువక నీతిని చన నా
కిరణమ్మే దారి దప్ప కీలకము గదా
నరునకు దుష్ట సంగతమునన్ ప్రభవించగ వక్రబుద్ధి తా
రిప్లయితొలగించండినొరులకు కీడొనర్చ గడు నుత్సుకతన్ బ్రకటించు చుండు మ
త్సరము పెనంగొనంగ గతి తప్పును పోఁడిమి, చూడ గాంక్షయ
న్కిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది దారి దప్పఁగన్