3-11-2023 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?”(లేదా...)“చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?”(మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)
పదునగు జ్ఞానము నేర్పనిమది విలువలు బెంచి సరిగమార్చని చదవుల్కుదిపియు జీవితమిల నీ చదువే నశియింప జేయు శస్త్రములేలా?
చదువరి కాని మనుష్యుడుపదుగురిలో చచ్చినటుల భావించెదరేయిదియె నిజమైనచో మరిచదువే నశియింపఁజేయ శస్త్రములేలా
సదమలమౌ మన సంస్కృతివదలుచు నుదరమ్మునింపు పరసంస్కృతియే ముదమని చునుబోధించెడుచదువే నశియింపఁజేయ, శస్త్రములేలా?(ప్రహ్లాదుడు తండ్రి తో పలికిన మాటలు గా...)అదియా విద్యయనంగ? కాదు జనకా, యా శ్రీహరిన్ వీడుచున్ బుధులౌ దేశికు లెంతచెప్పినను సమ్మోదమ్ము కాదందునే విదితంబైన పరాత్పరున్ చరితమున్ భేదించి బోధించెడిన్ చదువే మూలము సర్వనాశమునకై, శస్త్రాదులింకేలొకో?
పదునగు హింసచెలంగగమదమాత్సర్యములఁ బెంచి మారణహోమంబొదవగ మానవ బుద్ధినిచదువే నశియింపఁజేయ శస్త్రములేలా?
పదవే ధ్యేయము కాదె మూర్ఖులిలలో పాఠ్యాంశముల్ గూర్చినన్మదమాత్సర్యములే రగుల్చు పొలుపున్ మాకేలనా పాఠ్యముల్మదిలో రేపగ హింసయన్న నెలమిన్ మాత్సర్య సంభూతమౌచదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?
అధునాతనపు మెకాలేవిధానము సనాతనమగు విద్యనడంపన్ కొదవై సంస్కారమ్మిట చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?
మదివెల్గించెడి విద్యనేర్పకను సన్మార్గమ్ము నేర్పించకన్బుధుడొక్కండును కానరాడకట ఈ భూమండలమ్మందునన్మధమాత్సర్యములే గుణమ్ములుగ సమ్మానమ్ము లొందంగ నీచదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?
హృదయ పరి వర్త నo బునుసదమల మార్గము దెలుపక స్వార్థపు బుద్ధి న్మదమును బెంచగ బూనెడుచదువే నశియింప జేయ శస్త్ర ము లే లా?
కం॥ ముదముగ బ్రదుకు తెరవుఁ గనిచదువులు విజ్ఞత వినయము సమకూర్చవలెన్మదమాత్సర్యములఁ బడయుచదువే నశియింపఁ జేయు శస్త్రము లేలామ॥ పదవుల్ సంపద లక్ష్యమౌచుఁ జదువుల్ వ్యాపార మయ్యెన్ఁ గనన్మదిలో విజ్ఞత కేది చోటిపుడు సమ్మానమ్ము క్షీణించఁగన్మదమాత్సర్యములన్ ఘనమ్ముగను సమ్మానించి పొషించెడిన్చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో(కార్పొరేటు చదువులండి)
మత్తేభములో మొదటి పాదము చివర “వ్యాపారమయ్యెన్ గనన్” అని సవరించానండి పొరపాటున అధికంగా మయ్యెన్ తరువాత ఁ పెట్టినాను
విదులెరుగనిదేనియ్యదిమదివికసితమగుట విద్య మహిమమ్మేగా పదుగురు నగిపోరేయనచదువే నశియింపఁజేయ శస్త్రములేలా?
కందంచదువన్ సత్కావ్యమ్ములమదిమెచ్చెడు రామమూర్తి మార్గము శుభమౌ!బదులుగ దశాస్యునొప్పెడుచదువే నశియింపఁజేయ శస్త్రములేలా?మత్తేభవిక్రీడితముచదువన్ భాగవతాది కావ్యములనే సౌశీల్య ముప్పొంగు సమ్ముదమున్ గూర్చెడు రామ కృష్ణ పథముల్ పూనంగ సద్భక్తిఁ, గాక దశాస్యాదుల వక్రమార్గముల దుష్కామంబు మోదించెడున్చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?
మ.కొదవన్ జేయక విద్యలన్నిటిని జేకూర్చంగ విద్వాంసులైవిదితుల్ పుత్రులు పీడితుల్ బిగువుచే వృత్తిన్ రుజల్ పూంచగన్ముదితల్ తల్లులు తేనెలూరు మధురమ్మున్ భోజ్యమున్ బెట్టెడిన్ *చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?*
చదువేమూలముజనులకుచదివినచాలునుకొలువదిచక్కగదొరుకున్చదివితిననిగర్వపడిన*“చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?”*మదిలో నెప్పుడు శ్రీహరిన్ దలచి నేమంబున్ సదావీడకన్సదయుండౌచునుసాగువారికిలలోసన్మార్గమున్ చూపునా*“చదువే మూలము, సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?”*మదిలో నిండిన దుష్టబుద్ధులవి దుమ్మానమ్మురేపంగతానెదుగన్ జాలకకూళుడైతిరుగుగానేదిక్కులేకుండగన్
వదలకమత్తునుగొనియెడిమదమన మనుగడనుసాకు మానవులుండన్చదవరు చదివించరు యాచదువేనశియింపజేయ శస్త్రములేలా?
చదువులు పొందఁగ నున్నతపదవులు జీవిక కనియెడు భ్రమలోనున్నన్చదువు నిరర్థకమగునాచదువే నశియింపఁజేయ శస్త్రములేలా?
చదువుల్ నేర్చిన జ్ఞానమబ్బు చదువే సన్మార్గముం జూపునాచదువుల్ నేర్చుట విత్తమార్జనమె లక్ష్యంబైనచో ఛాత్రుకున్మదిలో నుద్భటమై చెలంగుమదమున్ మాత్సర్యమున్ తోడుగాచదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదు లింకేలొకో?
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. చదువే విజ్ఞానమిడునుచదువే నేర్పును జనులకు సంస్కారమ్మున్మదిలో నజ్ఞానంబునుచదువే నశియింపఁ జేయ శస్త్రములేలా?
చదివెన్ రావణుడన్ని శాస్త్రముల నిస్సారంబు గావించి తామద గర్వాంధత లోక కంటకునిగా మారెన్ గదా గాంచినన్మద మాత్సర్య వికార దుర్గుణములన్ మాపంగ లేనట్టిదౌచదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?
రిప్లయితొలగించండిపదునగు జ్ఞానము నేర్పని
మది విలువలు బెంచి సరిగ
మార్చని చదవుల్
కుదిపియు జీవితమిల నీ
చదువే నశియింప జేయు శస్త్రములేలా?
చదువరి కాని మనుష్యుడు
రిప్లయితొలగించండిపదుగురిలో చచ్చినటుల భావించెదరే
యిదియె నిజమైనచో మరి
చదువే నశియింపఁజేయ శస్త్రములేలా
రిప్లయితొలగించండిసదమలమౌ మన సంస్కృతి
వదలుచు నుదరమ్మునింపు పరసంస్కృతియే
ముదమని చునుబోధించెడు
చదువే నశియింపఁజేయ, శస్త్రములేలా?
(ప్రహ్లాదుడు తండ్రి తో పలికిన మాటలు గా...)
అదియా విద్యయనంగ? కాదు జనకా, యా శ్రీహరిన్ వీడుచున్
బుధులౌ దేశికు లెంతచెప్పినను సమ్మోదమ్ము కాదందునే
విదితంబైన పరాత్పరున్ చరితమున్ భేదించి బోధించెడిన్
చదువే మూలము సర్వనాశమునకై, శస్త్రాదులింకేలొకో?
పదునగు హింసచెలంగగ
రిప్లయితొలగించండిమదమాత్సర్యములఁ బెంచి మారణహోమం
బొదవగ మానవ బుద్ధిని
చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?
పదవే ధ్యేయము కాదె మూర్ఖులిలలో పాఠ్యాంశముల్ గూర్చినన్
తొలగించండిమదమాత్సర్యములే రగుల్చు పొలుపున్ మాకేలనా పాఠ్యముల్
మదిలో రేపగ హింసయన్న నెలమిన్ మాత్సర్య సంభూతమౌ
చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?
అధునాతనపు మెకాలే
రిప్లయితొలగించండివిధానము సనాతనమగు విద్యనడంపన్
కొదవై సంస్కారమ్మిట
చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?
మదివెల్గించెడి విద్యనేర్పకను సన్మార్గమ్ము నేర్పించకన్
రిప్లయితొలగించండిబుధుడొక్కండును కానరాడకట ఈ భూమండలమ్మందునన్
మధమాత్సర్యములే గుణమ్ములుగ సమ్మానమ్ము లొందంగ నీ
చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?
హృదయ పరి వర్త నo బును
రిప్లయితొలగించండిసదమల మార్గము దెలుపక స్వార్థపు బుద్ధి న్
మదమును బెంచగ బూనెడు
చదువే నశియింప జేయ శస్త్ర ము లే లా?
కం॥ ముదముగ బ్రదుకు తెరవుఁ గని
రిప్లయితొలగించండిచదువులు విజ్ఞత వినయము సమకూర్చవలెన్
మదమాత్సర్యములఁ బడయు
చదువే నశియింపఁ జేయు శస్త్రము లేలా
మ॥ పదవుల్ సంపద లక్ష్యమౌచుఁ జదువుల్ వ్యాపార మయ్యెన్ఁ గనన్
మదిలో విజ్ఞత కేది చోటిపుడు సమ్మానమ్ము క్షీణించఁగన్
మదమాత్సర్యములన్ ఘనమ్ముగను సమ్మానించి పొషించెడిన్
చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో
(కార్పొరేటు చదువులండి)
మత్తేభములో మొదటి పాదము చివర “వ్యాపారమయ్యెన్ గనన్” అని సవరించానండి పొరపాటున అధికంగా మయ్యెన్ తరువాత ఁ పెట్టినాను
తొలగించండివిదులెరుగనిదేనియ్యది
రిప్లయితొలగించండిమదివికసితమగుట విద్య మహిమమ్మేగా
పదుగురు నగిపోరేయన
చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?
కందం
రిప్లయితొలగించండిచదువన్ సత్కావ్యమ్ముల
మదిమెచ్చెడు రామమూర్తి మార్గము శుభమౌ!
బదులుగ దశాస్యునొప్పెడు
చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?
మత్తేభవిక్రీడితము
చదువన్ భాగవతాది కావ్యములనే సౌశీల్య ముప్పొంగు స
మ్ముదమున్ గూర్చెడు రామ కృష్ణ పథముల్ పూనంగ సద్భక్తిఁ, గా
క దశాస్యాదుల వక్రమార్గముల దుష్కామంబు మోదించెడున్
చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?
మ.
రిప్లయితొలగించండికొదవన్ జేయక విద్యలన్నిటిని జేకూర్చంగ విద్వాంసులై
విదితుల్ పుత్రులు పీడితుల్ బిగువుచే వృత్తిన్ రుజల్ పూంచగన్
ముదితల్ తల్లులు తేనెలూరు మధురమ్మున్ భోజ్యమున్ బెట్టెడిన్
*చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?*
రిప్లయితొలగించండిచదువేమూలముజనులకు
చదివినచాలునుకొలువదిచక్కగదొరుకున్
చదివితిననిగర్వపడిన
*“చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?”*
మదిలో నెప్పుడు శ్రీహరిన్ దలచి నేమంబున్ సదావీడకన్
సదయుండౌచునుసాగువారికిలలోసన్మార్గమున్ చూపునా
*“చదువే మూలము, సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?”*
మదిలో నిండిన దుష్టబుద్ధులవి దుమ్మానమ్మురేపంగతా
నెదుగన్ జాలకకూళుడైతిరుగుగానేదిక్కులేకుండగన్
వదలకమత్తునుగొనియెడి
రిప్లయితొలగించండిమదమన మనుగడనుసాకు మానవులుండన్
చదవరు చదివించరు యా
చదువేనశియింపజేయ శస్త్రములేలా?
చదువులు పొందఁగ నున్నత
రిప్లయితొలగించండిపదవులు జీవిక కనియెడు భ్రమలోనున్నన్
చదువు నిరర్థకమగునా
చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?
చదువుల్ నేర్చిన జ్ఞానమబ్బు చదువే సన్మార్గముం జూపునా
రిప్లయితొలగించండిచదువుల్ నేర్చుట విత్తమార్జనమె లక్ష్యంబైనచో ఛాత్రుకున్
మదిలో నుద్భటమై చెలంగుమదమున్ మాత్సర్యమున్ తోడుగా
చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదు లింకేలొకో?
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
చదువే విజ్ఞానమిడును
చదువే నేర్పును జనులకు సంస్కారమ్మున్
మదిలో నజ్ఞానంబును
చదువే నశియింపఁ జేయ శస్త్రములేలా?
చదివెన్ రావణుడన్ని శాస్త్రముల నిస్సారంబు గావించి తా
రిప్లయితొలగించండిమద గర్వాంధత లోక కంటకునిగా మారెన్ గదా గాంచినన్
మద మాత్సర్య వికార దుర్గుణములన్ మాపంగ లేనట్టిదౌ
చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?