4, నవంబర్ 2023, శనివారం

సమస్య - 4577

5-11-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అంధుఁడా కాఁడు గనఁడు వర్ణాంతరముల”
(లేదా...)
“అంధుఁడు గాఁడు వర్ణముల యంతర మింతయుఁ గానలేఁ డయో”

17 కామెంట్‌లు:

  1. లవకుశులతో వాల్మీకి మహర్షి:

    తేటగీతి
    ఒక్కరైననసంతృప్తి నొందరాని
    ప్రజలు మెచ్చెడు పాలన పంచెననఁగ
    రామమూర్తి రాజన్న గర్వానఁ జెలఁగు
    నంధుడా? కాడు, గనఁడు వర్ణాంతరముల

    ఉత్పలమాల
    బంధుర పాలనమ్ము తన పాటవమందున నుల్లసిల్లగన్
    సంధిత ధర్మమార్గమున జానకిరాముడు సాగ నిత్యమున్
    బంధములైన వీడగల బాధ్యుడు! తానొక రాజునన్న గ
    ర్వాంధుఁడు గాఁడు వర్ణముల యంతర మింతయుఁ గానలేఁ డయో!

    రిప్లయితొలగించండి
  2. అతని నేల పొగడు చుంటివనుచు నడిగితివే,
    ప్రజలతననిని యెన్నగ వచ్చిన పదవీ మ
    దాంధుఁడా కాఁడు ; గనఁడు వర్ణాంతరముల
    జనులకు సతము క్షేమము జరుపుటందు

    రిప్లయితొలగించండి
  3. హరితమునకు నరుణిమకు నంతరమును
    గాన లేకపోయిన నది గాదు లోటు
    నీటి యడుగున గల సూది నిట్టె గనును
    అంధుఁడా కాఁడు గనఁడు వర్ణాంతరముల”

    రిప్లయితొలగించండి
  4. ప్రజల సేమము పరికించు ప్రభువు గాగ
    మంచి చెడ్డల నరసిడు మాన్యు డగుచు
    నంధు డా కాడు ::గనడు వర్ణా o త రముల
    సమత మమతలు గల్గిన సౌమ్యుడత డు

    రిప్లయితొలగించండి
  5. నీకులమని నాకులమని కాకులవలె
    పోరనేలరా, యేకమె యెల్లరనుచు,
    వరలు గుణమున నరుఁడను వాడు, కులమ
    దాంధుఁడా కాఁడు గనఁడు వర్ణాంతరముల

    రిప్లయితొలగించండి
  6. జ్ఞానశూన్యుడు మూఢుడు సంప్రయోగి
    తగని పాపపు కార్యాల తనరు వాడు
    పిచ్చి పొదలుకొనగ విర్రవీగువాడు
    అంధుఁడా కాఁడు గనఁడు వర్ణాంతరముల

    బంధురమైన మానసము పాతక రక్తియుఁ జ్ఞానశూన్యుడై
    బంధకమందునన్ దొరలి వచ్చిన మూర్ఖుడు ముఖ్యనేతయై
    గంధము పెచ్చరిల్లి మరి కన్నును మిన్నును గానకుండునే
    అంధుఁడు గాఁడు వర్ణముల యంతర మింతయుఁ గానలేఁ డయో

    [వర్ణము = సుగుణము]

    రిప్లయితొలగించండి
  7. ఆటపాటల యందున నాదమరచి
    చెట్టుపైనుండి బడ చిట్లెఁ జిన్నమెదఁడు
    పైకి కనబడకున్నను ఫలిత మిదియె
    అంధుఁడా కాఁడు గనఁడు వర్ణాంతరముల

    రిప్లయితొలగించండి
  8. ఇందురు ఛాపవర్ణములు ఇంపుగ కూర్చిన రంగవల్లులున్
    చందురు వన్నెలున్ను బహుచక్కని పుష్పలతా విలాసముల్
    కందొవ జూతమన్ననవి కన్పడుగా నసితాసితామ్ములై
    అంధుఁడు గాఁడు వర్ణముల యంతర మింతయుఁగానలేఁడయో

    రిప్లయితొలగించండి
  9. Colour blindness వలన అన్నీ black and white లో కనిపిస్తాయి అనే భావం లో (గుడ్డి వాడేం కాదు రంగుల భేదము తెలియదు అంతే)

    రిప్లయితొలగించండి
  10. అందరిలోన తానొకడునై ప్రజలన్ తలలోని నాల్కగా
    కొందలమొందనీక కడు కూరిమి నేలుచు సచ్చరిత్రుడై
    యందరి మన్ననల్ వడసి యాలన పాలన జూచు నేతగ
    ర్వాంధుఁడు గాఁడు వర్ణముల యంతర మింతయుఁ గానలేఁ డయో

    రిప్లయితొలగించండి
  11. తే॥ కొండ కోనల నడుమను నిండు జీవి
    తమ్ముఁ బ్రకృతి యొడి బ్రదుకుఁ దనరు చుండ
    కోయ బాలుఁడు చదువుల గురిని గనక
    నంధుఁడా కాఁడు గనఁడు వర్ణాంతరమల

    ఉ॥ బంధన రీతి హాయిగను బాధ్యత లేకయె కొండ కోనలన్
    గంధముఁ జూచి చిందులను గమ్మగ వేయుచు నాటపాటలన్
    దంధన లౌక్యమున్ గనక ధన్యతఁ గాంచెడి కోయ పిల్లవాఁ
    డంధుడు గాఁడు వర్ణముల యంతర మింతయుఁ గానలేఁడయో

    బంధన పక్షి, కంధము మేఘము, దంధన మాయ, వర్ణము అక్షరము

    రిప్లయితొలగించండి
  12. పాంధుడదేల వక్రగతి వాహన సంజ్ఞల మీరి ద్రిమ్మరున్
    బంధకమన్న కిన్క విడి వాస్తవమున్ పరికింపుమో సఖా
    అంధుఁడతండెరుంగడు పథంపు నిబంధనలంతె గాని గ
    ర్వాంధుఁడు గాఁడు వర్ణముల యంతర మింతయుఁ గానలేఁడయో
    ~ సూర్యం

    రిప్లయితొలగించండి
  13. సర్వమెరిగినధీశాలి సాధువతడు
    అంధుడా కాడు గనడు వర్ణాంతర ముల
    నెంచకశుభము కోరుచునిమ్ముగాను
    మానవాళికిసతతముమంచిచేయు

    రిప్లయితొలగించండి
  14. ఉ.

    రంధిత వస్తువుల్ తినగ రంధిని వ్రేసె బకాసురున్ దొలిన్
    బాంధవముల్ దృశించవు వివర్ణుల లక్షణముల్ నిశీథమున్
    బంధకి జేయ గీచకుని బంతిగ జేసి వధించె భీముడే
    *“అంధుఁడు గాఁడు వర్ణముల యంతర మింతయుఁ గానలేఁ డయో!*

    రిప్లయితొలగించండి