8, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4580

9-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివనామముఁ దలఁపఁ దగున శ్రీశైలమునన్”
(లేదా...)
“శివనామస్మరణమ్ము సేయఁ దగునా శ్రీశైలమం దెప్పుడున్”

13 కామెంట్‌లు:

  1. శివమయమె గద ప్రతిదియు, న
    నవరతమును మ్రోగు చుండు నదె నామమ్మే,
    యవసరమా మరల విడిగ
    శివనామముఁ దలఁపఁ దగున శ్రీశైలమునన్”

    రిప్లయితొలగించండి
  2. శివరాత్రి పర్వ దినమున
    భవనాశంకరుని హరుని పరమిమ్మనుచున్
    భవబంధములను వీఁడక
    శివనామముఁ దలఁపఁ దగున శ్రీశైలమునన్

    రిప్లయితొలగించండి

  3. అవమానించుచు పెద్దల
    నవమపు కృత్యముల నల్పె డటమట కారుల్
    భవహరుడని కుచ్చితుడై
    శివనామముఁ దలఁపఁ దగున శ్రీశైలమునన్.


    జవమున్ బారెడు కృష్ణవేణి తటినిన్ సంభగ్నుడా భర్గుడే
    భవమున్ బాపెడు మల్లికార్జునునిగా భక్తాలినిన్ బ్రోవ బా
    భ్రవి మాతా భ్రమ రాంబతో వెలెసెనా ప్రాంతమ్ము నిత్యమ్మటన్
    శివనామస్మరణమ్ము సేయఁ దగు, నా శ్రీశైలమం దెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  4. అవసానమందు నొప్పును
    శివనామముఁ దలఁపఁ; దగున శ్రీశైలమునన్
    భవుని నుతి గాక వేరుగ
    కవితలను రచించుచుండి కాలము గడుపన్

    రిప్లయితొలగించండి
  5. శివ శివ యంచును భక్తులు
    శివ నామము బలుకు చుండ చెవులకు సోకన్
    భవ హరుని మరల వేరుగ
    శివ నామము దలప దగున శ్రీ శై లము నన్

    రిప్లయితొలగించండి
  6. శివరాత్రమ్మున భక్తకోటి హరునిన్ చిత్తమ్మునన్ నిల్పి యా
    భవనాశంకరు శంకరున్ పరము సంప్రాప్తించగా వేఁడగన్
    భవబంధమ్ముల నుండి ముక్తిఁ గొన సంభావ్యంబునౌ, నెల్లరున్
    శివనామస్మరణమ్ము సేయఁదగు నా శ్రీశైలమం దెప్పుడున్

    రిప్లయితొలగించండి
  7. కం॥ శివుని మనమున నిలుపుచు
    భవనాశముఁ జేయఁ గోరి ప్రణతుల నిడుచున్
    జవినొంది తనియ ననిశము
    శివనాముముఁ దలఁపఁ దగున శ్రీశైలమునన్

    మ॥ శివనామస్మరణమ్ము సేయుచును సంసేవించెడిన్ భక్తులన్
    భవుఁడా చిన్మయ రూపుఁడెల్లపుడు సంభాలించుచున్ బ్రోవడా!
    భవ నాశమ్మును గోరి భక్తినిడి భావావేశ సంజాతులై
    శివనామస్మరణమ్ము సేయదగు, నాశ్రీశైలమం దెప్పుడున్

    రిప్లయితొలగించండి
  8. అవలక్షణముల వీడక
    తివిరి దురిత కర్మములకు తెగబడి, హృదిలో
    లవమైన భక్తి లేకను
    శివనామముఁ దలఁపఁ దగున శ్రీశైలమున

    రిప్లయితొలగించండి
  9. మ.

    వివృతిన్ స్కందుడు మల్లికార్జునుని సంవేదమ్ము సత్యాగ్నికిన్
    హవణిల్లున్ భ్రమరాంబ, వీక్షణపు మాహాత్మ్యమ్ము భక్తాళికిన్
    ఛవి కామేశ్వరి జూడ గోర్కెలు ఫలించన్ సానుమంతమ్మునన్
    *శివనామస్మరణమ్ము సేయఁ దగు, నా శ్రీశైలమం దెప్పుడున్.*

    రిప్లయితొలగించండి
  10. కందం
    ఎవరైనను భక్తాదులు
    వివరమ్ములు దెలియ సాక్షి విఘ్నేశ్వరునిన్
    ధ్రువముగ దర్శింపకయే
    శివనామముఁ దలఁపఁ దగున శ్రీశైలమునన్?

    మత్తేభవిక్రీడితము
    ఎవరైనన్ గన భక్తవర్యులటఁ దామేతించి నిష్ఠాత్ములై
    వివరమ్ముల్ దెలియంగ నొప్ప మును ఠీవిన్ సాక్షివిఘ్నేశ్వరున్
    స్తవముల్ జేయుచు మ్రొక్కకుండ హరునిన్ దర్శించి యా కోవెలన్
    శివనామస్మరణమ్ము సేయఁ దగునా శ్రీశైలమం దెప్పుడున్?

    రిప్లయితొలగించండి
  11. భవభంధమ్ములు తొలగును
    *“శివనామముఁ దలఁపఁ, దగున శ్రీశైలమునన్”*
    భువనాధీశునిసతతము
    నవహేళనముమొనరించుటజ్ఞతె యౌగా

    రిప్లయితొలగించండి