17, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4588

18-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గిల్లెను రావణుఁ డవనిజఁ గ్రీగంటఁ గనెన్”
(లేదా...)
“గిల్లెన్ సీతను రావణాసురుఁడు దాఁ గ్రీగంట వీక్షించుచున్”
(ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక నుండి)

14 కామెంట్‌లు:

  1. కందం
    పల్లవపాణిని లంకకుఁ
    జెల్లుననుచు దెచ్చి నిత్య సేవకుల నిడన్
    కొల్లగ మెచ్చుననుచు రా
    గిల్లెను, రావణుఁ డవనిజఁ గ్రీగంటఁ గనెన్

    శార్దూలవిక్రీడితము
    ఉల్లంబందున మోహమై వనమునందుంచంగ నా దాసులన్
    జెల్లన్ మెచ్చునటన్న నమ్మిక నినున్ సేవింతు రారాణిగన్
    ఫుల్లాబ్జాక్షి! నివాసమంతిపురమౌ మోదించి రమ్మంచు రా
    గిల్లెన్, సీతను రావణాసురుఁడు దాఁ గ్రీగంట వీక్షించుచున్

    రిప్లయితొలగించండి
  2. అల్ల వనమందు బూలను
    గిల్లెను రావణుడ ; వనిజఁ గ్రీగంటఁ గనెన్,
    తల్లడిలె నేమగుననుచు
    పెల్లుబికిన భయమొసంగు వెంపర తోడన్

    రిప్లయితొలగించండి

  3. చెల్లెలు శూర్పణఖ తెలుప
    నుల్లమునన్ మోహమదియె యురకలు వేయన్
    మెల్లిగ నటజేరుచు రా
    గిల్లెను రావణుఁ, డవనిజఁ గ్రీగంటఁ గనెన్.

    రిప్లయితొలగించండి
  4. మెల్లగ వనితల జేరియు
    గిల్లెను రావణు :: డవనిజ గ్రీ గం ట గనె న్
    తల్లడ మంది యుభయమున
    నుల్లము గంపింప దాను నూర్పులు విడి చెన్

    రిప్లయితొలగించండి
  5. ఉల్లమునందునవాంఛయు
    నెల్లలుదాటంగవచ్చినిమ్ముగ గనుచున్
    మెల్లగదరిచేరుచురా
    *“గిల్లెను రావణుఁ డవనిజఁ గ్రీగంటఁ గనెన్”*

    రిప్లయితొలగించండి

  6. కల్లోలంబును గల్గజేయగను హేకాంతామణీ పేర్మితో
    సల్లాపమ్ముల నాడవచ్చు గద నీ సంతాపమున్ దీర్తునే
    ఫుల్లాబ్జాక్షి యటంచు బల్కుచును తా మోహంబుతో కాంచి రా
    గిల్లెన్ , సీతను రావణాసురుఁడు దాఁ గ్రీగంట వీక్షించుచున్.

    రిప్లయితొలగించండి
  7. ఉల్లాసంబుగ పంక్తికంధరుడు తానుద్యుక్తుడై సీతతో
    సల్లాపమ్ములు సల్పబోవుటకు నాసక్తిన్ ప్రదర్శించుచున్
    యుల్లంబందనురక్తి క్రందుకొనగా యుత్తేజమొప్పార రం
    గిల్లెన్ సీతను రావణాసురుఁడు దాఁగ్రీగంట వీక్షించుచున్

    రిప్లయితొలగించండి
  8. ఉల్లంబందునబూనిలక్ష్యమునుదుర్వ్యూహంబునుగ్రాటవిన్
    విల్లంబుల్ త్యజియించిలింగధరుడైభిక్షార్థివేషంబునన్
    చల్లంగన్ దరిజేరెపంచవటినాశావేశుడైపూవులన్
    గిల్లెన్, సీతను రావణాసురుఁడు దాఁ గ్రీగంట వీక్షించుచున్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  9. కల్లలతో నేమార్చగ
    నెల్లప్పుడు సిద్దపడును నీఛాత్ముండే
    తల్లడపడి వడిగొని సా
    గిల్లెను రావణుఁ డవనిజఁ గ్రీగంటఁ గనెన్

    భల్లూకంబునుబోలు పట్టుదలతో వైదేహినిన్ వీడకన్
    గల్లల్ పల్కుచు నామె సమ్మతముకై కాంక్షించుచున్ సర్వదా
    తల్లక్రిందులు కాగ లంకదొర సీతాసన్నిధానంబు సా
    గిల్లెన్ సీతను రావణాసురుఁడు దాఁ గ్రీగంట వీక్షించుచున్

    రిప్లయితొలగించండి
  10. చల్లని సీతమ్మ యెడల
    కల్లరి అతికాంక్షగల్గి కల్మష హృదుడై
    చెల్లకనే ఎత్తులు ఎడ
    గిల్లెను రావణుఁ డవనిజఁ గ్రీగంటఁ గనెన్

    రిప్లయితొలగించండి
  11. ఉల్లాసమ్ముగ జానకి
    నుల్లంబందునఁ దలచుచు నుద్వేగముగా
    సల్లాపమాడఁ జన రం
    గిల్లెను రావణుఁ డవనిజఁ గ్రీగంటఁ గనెన్

    రిప్లయితొలగించండి
  12. కం॥ ఉల్లము నలసట హెచ్చఁగఁ
    జల్లఁగఁ బట్టిన నిదురను స్వప్నము విరియన్
    గల్లను గాంచితి నిటులన్
    గిల్లెను రావణుఁ డవనిజ గ్రీగంట గనెన్

    శా॥ కల్లోలంబును గాఁగఁ గార్యములు సాకారంబు గాలేదనిన్
    యుల్లంబందున హెచ్చఁగానలపు నాకూహించ లేనంతఁగన్
    జల్లంగన్ ఘన నిద్రపట్టఁగను దుస్స్వప్నమ్ము దర్శించితిన్
    గిల్లెన్ సీతను రావణాసురుఁడు దాఁ గ్రీగంట వీక్షించుచున్

    రిప్లయితొలగించండి
  13. శా.

    ఇల్లే స్వర్గముగా దలంచు చెలులే యిష్టాలు గోల్పోదురే
    భల్లూకాకృతి నుండు రక్కసి గుమిన్ భర్తన్ విచారించెడిన్
    ముల్లున్ బోలు విధిన్ స్మృతిన్ వనమునన్ మొట్టంగ గుండెన్ దిటన్
    *గిల్లెన్ సీతను,... రావణాసురుఁడు దాఁ గ్రీగంట వీక్షించుచున్.*

    రిప్లయితొలగించండి