28, నవంబర్ 2023, మంగళవారం

సమస్య - 4599

29-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జారులు పూజింతురు తొలిజామున శౌరిన్”
(లేదా...)
“జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికిఁ బూజ లేదుగా”
(ఆముదాల మురళి గారి అష్టావధానంలో దండిభొట్ల దత్తాత్రేయశర్మ గారిచ్చిన సమస్య)

19 కామెంట్‌లు:

  1. కందం
    భూరి కృపామయుడనుచున్
    మేరలు లేనట్టి భక్తి మేదిని గలుగన్
    నారాయణా యనుచు పూ
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      భూరి కృపామయుండనుచు మోహన రూపుని కృష్ణమూర్తినిన్
      మేరలు లేని భక్తిఁగొని మేదినికిన్ స్థితి కారకుండనన్
      నారద సన్నుతున్ మిగుల నర్మిలిఁ జూపుచు దేవదేవుఁ బూ
      జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికిఁ బూజ లేదుగా!

      తొలగించండి
    2. శిశుపాలుఁడు ధర్మరాజుతో....

      కందం
      పారాడుచు గోకులమున
      చీరలు దొంగిలి మగువల శీలము దోచున్
      వారసులుగ కృపఁ గనుమని
      జారులు పూజింతురు తొలిజామున శౌరిన్!

      ఉత్పలమాల
      పారఁగ నెత్తులున్ మిగుల భామల పొందుకు వెంటనంటుచున్
      చీరలు దొంగిలున్ తతుల శీలము దోచును! నల్లకాకినిన్
      తీరిచి యగ్రపూజలకు దేవుడటందువె? వారసత్వమై
      జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికిఁ బూజ లేదుగా!

      తొలగించండి
  2. జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    కం॥
    ఊరేదైననుగుడిలో
    చేరిభజింత్రుగదభక్తిచే తెలవారన్
    తీరుగనితరుల్ మరి పూై
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  3. జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    కం॥
    ఊరేదైననుగుడిలో
    చేరిభజింత్రుగదభక్తిచే తెలవారన్
    తీరుగనితరుల్ మరి పూ
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  4. తూరుపు తెలవారకనే
    తీరుగ స్నానంబు చేసి తిరునామములన్
    సౌరుగ నుదుటనలది పూ
    “జారులు పూజింతురు తొలిజామున శౌరిన్”

    రిప్లయితొలగించండి
  5. ఆరంభింతురు దినమా
    చార పరాయణత తోడి సతము , సకల సం
    సారపు హితముకొరకుపూ
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్”

    రిప్లయితొలగించండి
  6. జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    కం॥
    ఊరేదైననుగుడిలో
    చేరిభజింత్రుగదభక్తిచే తెలవారన్
    తీరుగనితరుల్ మరి పూ
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    గాదిరాజు మధుసూదన రాజు


    ఉ॥
    భూరమణుల్ గనన్ పగలు ప్రోలుననుండుమహాధికార్లహం
    కారులుమ్రొక్కుచుంద్రుపలుకానుకలిత్తురు కోరికోర్కెలన్
    కోరిహితంబునూరికయి కోవెలఁశుభ్రమొనర్చియూడ్చి పూ
    జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికిఁ బూజ లేదుగా

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  7. కోరిక లను దీ ర్చు మనుచు
    పేరిమి భక్తి వి న మిత పు వేషము తోడన్
    కూరిమి జప తప మున బూ
    జారులు పూజింతురు తొలి జామున శౌరిన్

    రిప్లయితొలగించండి

  8. హారతిపళ్ళెములతో
    ద్వారముచెంతనునిలబడిపాటలతోడన్
    బారులుతీరిననాపూ
    జారుడు పూజింతురు తొలిజామున శౌరిన్

    రిప్లయితొలగించండి
  9. సూరి యుదయించక మునుపె
    బారులుగ దొరకొని గుడికి భక్తులు రాగన్
    వారు వలచు విధముగ పూ
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    రిప్లయితొలగించండి
  10. కోరిన కోర్కెలు తీరగ
    కారణభూతుని కొలుతురు కామితములకై
    చేరగ పరలోకము పూ
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    కోరినకోర్కెలే తమకు కూర్చెడు దేవుని మొక్కకుందురే
    కారణభూతుడే తమకు కామనలీయగ పూజసేయరే
    తూరుపుతెల్లవారకనె తొందరపాటున మేలుకాంచు పూ
    జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికిఁ బూజ లేదుగా

    రిప్లయితొలగించండి
  11. సూరుడు పూర్వాద్రులనే
    చేరక పూర్వమ్మె లోక సేమము కొరకై
    యారాధన సేసెడి పూ
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్.



    సీరుడు ప్రాగ్దిశాద్రులను చేరక పూర్వమె నిద్ర వీడి కం
    జారికి నర్ఘ్యముల్ వదిలి సంభ్రమమందున మందిరమ్మునే
    జేరి యనేకలోచనుని సేవల జేసెడి భూసురుండ్రు పూ
    జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికిఁ బూజ లేదుగా.

    రిప్లయితొలగించండి
  12. తీరును కోరికలుదయపు
    మూరుతమందే యనుకొని మూఢత్వముచే
    బారులుగా నిలబడి గో
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    రిప్లయితొలగించండి
  13. ఉ.

    పౌరులు సుప్రభాతమున భక్తిని వీనుల విందుగా నుతుల్
    చేరగ దేవళంబు వడి జిత్రము బీగము ద్వారముల్ పసన్
    గోరిక దీర్చు దర్శనము, కోవిద పండిత భూసురాది పూ
    *జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికిఁ బూజ లేదుగా!*

    రిప్లయితొలగించండి
  14. కారణ జన్ములు గావుత
    వారలకే దక్కెనిట్టి వరమేమందున్
    కూరిమిన ప్రతిదినము పూ
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    రిప్లయితొలగించండి
  15. తూరుపు తెల్లవారకనె తొందరగా జలకమ్ములాడియున్
    తీరుగ ఫాలభాగమునఁ దీరిచి నామము దేవళంబుకున్
    జేరి పరాత్పరున్ వినుతి సేయుచు మంత్రము లుచ్చరించి పూ
    జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికిఁ బూజ లేదుగా

    రిప్లయితొలగించండి
  16. కం॥ తీరుగ మంత్రము పలుకుచుఁ
    గోరుచు సర్వజన హితముఁ గొలచుచు భక్తిన్
    జేరుచు గర్భగుడినిఁ బూ
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్

    ఉ॥ తీరుగ వేదమంత్రములు దీటుగఁ బల్కుచు భక్తి మీరఁగన్
    బారులు తీరియుండఁగను బ్రార్థన సేయుచు భక్తకోటియున్
    నేరుగఁ జేరి గర్భగుడి నిష్ఠగ నేమము శ్రద్ధ నిల్పి పూ
    జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికి పూజలేదుగా!

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కోరుచు కోర్కెల నెన్నో
    బారులుగా నిలిచినట్టి భక్తుల కొఱకై
    హారతుల నిచ్చుచున్ పూ
    జారులు పూజింతురు తొలిజామున శౌరిన్.

    రిప్లయితొలగించండి