16, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4587

17-11-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సింహముపై వచ్చి శివుఁడు సీతను బట్టెన్”
(లేదా...)
“సింహముపైన వచ్చి వెస సీతనుఁ బట్టె శివుండు వింతగన్”
(తిరుపతి అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)

13 కామెంట్‌లు:

  1. సింహరథ కోరగ వెడలె
    సింహము పైనెక్కి శివుడు; సీతను బట్టెన్
    సింహ బలుడు దశకంఠుడు-
    సంహారము జేయబడెను సమరము నందున్.

    రిప్లయితొలగించండి
  2. సింహాద్రిని దర్శన మిడె
    సింహము పై వచ్చి శివుడు :: సీతను బట్టెన్
    సింహము వలె దశ కం ఠు డు
    సంహా రం బయ్యె దాను సమరము నందున్

    రిప్లయితొలగించండి

  3. సింహధర మహిషు నెవ్విధి
    సంహరమొనరించె? కల్మషగళుం డెవడో?
    సింహళ ధణి కసటు దెలుపు
    సింహముపై వచ్చి , శివుఁడు , సీతను బట్టెన్.


    సంహర మెట్లుజేసె పురషాశిని శాంభవి? నీచకార్యమా
    సింహళ సార్వభౌముడట చేసిన దేమిటి? స్వర్ణ లంకనే
    యంహతిగా నొసంగిన మహాత్ముడెవండు దశాననుండకున్?
    సింహముపైన వచ్చి , వెస సీతనుఁ బట్టె , శివుండు వింతగన్.

    రిప్లయితొలగించండి
  4. సింహపురి నందుగల నర
    సింహముతో రామ కథను జెప్పుమనగనే
    యంహతిన పలికె నిట్లుగ
    "సింహముపై వచ్చి శివుఁడు సీతను బట్టెన్

    రిప్లయితొలగించండి
  5. సంహితపేరుతోనిలిచె సర్కసుకంపెనియందుజంతువుల్
    సింహములుండెసీతయను జింకయువేడుకచేయుచుండెమా
    సింహపురిన్ వినోదమదిచిన్నశివుండొకగారడీడహో
    “సింహముపైన వచ్చి వెస సీతనుఁ బట్టె శివుండు వింతగన్”

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  6. సంహృతులకు సద్గతికై
    సంహర్ష భగీరథుండు సల్పెను తపమున్
    సంహత సతీసమేతుడు
    సింహముపై వచ్చి శివుఁడు సీతను బట్టెన్

    సంహృతమైనపూర్వులను స్వర్గముజేర్చ భగీరథుండు తాఁ
    సంహిత మార్గమున్ గొనుచు శంభువుకై తపమాచరించగా
    సంహతితెల్పి నాకధుని సంసృతిఁ నిల్ప సతీసమేతుడై
    సింహముపైన వచ్చి వెస సీతనుఁ బట్టె శివుండు వింతగన్

    [సీత - గంగ]

    రిప్లయితొలగించండి
  7. సింహరథ మహిషు దునిమెను,
    సంహితముగ తాండవమ్ము సతితో సలిపెన్,
    రంహస్సుగ దశకంఠుఁడు,
    సింహముపై వచ్చి, శివుఁడు, సీతను బట్టెన్

    రిప్లయితొలగించండి
  8. దృంహితమైన సింహరథ ధీరతతో మహిషున్ వధించె తా
    సింహమువంటి రావణుడు చేరెను పంచవటీ తటంబుకున్
    సంహతిఁ గూడి కింకరుల సల్పెను నృత్యము వెండికొండపై
    సింహముపైన వచ్చి వెస సీతనుఁ బట్టె శివుండు వింతగన్

    రిప్లయితొలగించండి
  9. కం॥ సంహరణఁ జేసి రాముఁడు
    సింహళ దేశ ప్రభువునటు సీతను జేరెన్
    రంహునికిది తెలియకననె
    "సింహము పైన వచ్చి శివుఁడు సీతను బట్టెన్"

    ఉ॥ రంహుఁడు తత్తరన్ బడుచు రాగముఁ దీయుచుఁ బల్కెనిట్టులన్
    "సింహము పైన వచ్చి వెస సీతను బట్టె శివుండు వింతగన్"
    సింహళ దేశరాజునిటు సింహము నీశ్వరుఁడంచు మూర్ఖతన్
    సంహరణమ్ముఁ జేయుచును జక్కఁగ రామ చరిత్రనివ్విధిన్

    రంహుడు వేగిరకాడు (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
  10. కందం
    ఓంహర! యోపఁగ గంగను
    సంహతి గలవానివనఁగ సగరుల సుగతిన్
    సంహితమొనరింప వృషభ
    సింహముపై వచ్చి శివుఁడు సీతను బట్టెన్

    ఉత్పలమాల
    ఓంహర! శంకరా! సుగతులొందగ తాతలు గంగ నోపఁగన్
    సంహతినొప్పువాడవని జాలి భగీరధుడార్తి వేడగన్
    సంహితమొందఁజేయ నొగి చాలగ జూటము విప్పి భద్రమన్
    సింహముపైన వచ్చి వెస సీతనుఁ బట్టె శివుండు వింతగన్

    రిప్లయితొలగించండి
  11. సంహరణముచేసె గిరిజ
    సంహారముచేసెరిపుల సంగరసీమన్
    రంహతి తో దైత్యుండా
    .సింహము పై వచ్చి,శివుడు సీతను బట్టెన్

    రిప్లయితొలగించండి