15, నవంబర్ 2023, బుధవారం

దత్తపది - 205

16-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
అసి - కసి - పసి - మసి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
సూర్యోదయ వర్ణనను స్వేచ్ఛాఛందంలో చేయండి.

15 కామెంట్‌లు:

  1. 'పసి'డి వన్నె మెరిసి పోగ ప్రాగ్దిశన 'న
    సి'తమగునచటి మేఘరాశి యి'క సి'గ్గు
    లొలికె నరుణి'మ సి'ద్ధించ తళుకు లీని,
    ఎంత సుందర ముదయ మదెంత హాయి.

    రిప్లయితొలగించండి
  2. వికసిత మగుచు భానుడు వెల్గు లీ నె
    పసిడి వన్నెల రోదసి పరవశించె
    సుమ సిత మ య్యె లోకమ్ము శోభ తోడ
    నసి త మబ్బులు దొలగె గా యంబ రము న

    రిప్లయితొలగించండి
  3. తే. గీ.

    అసిత మేఘ వలయమున హాటకమ్ము
    కసిమసగు సూక్ష్మ జీవుల గర్మసాక్షి
    పసిమి చెట్లకు సైతము పాలకుండు
    తామసిఁ దొలగించు ఖగుడు ధామనిధియె!

    రిప్లయితొలగించండి
  4. అసియాడ నభమున రవి వి
    కసిత కమలబాంధవుండు కదిలెను తానే
    పసిడి వెలుంగులతో తా
    మసినంతము జేసి జగతి మాన్యతనొందన్

    రిప్లయితొలగించండి
  5. అసితమగు మబ్బు నింగిలోనలుము కొనగ
    సవితృడుదయించిన కసిడి సమయమందె
    సమసిపోయెను నెరవుగ, చదలు నందు
    పసిడివన్నెపు వెలుగులు ప్రబలెనపుడు

    రిప్లయితొలగించండి
  6. తామసి గాంచితీరవలె తానొక రూపసి యంచు పక్షులే
    భాముని తోవచింపగ గభస్తియె తా వికసించు మోముతో
    ప్రేమగ జేరరాగ గని వ్రీడనమందుచు చీకువాలనే
    భామయె పార నా యసిత వర్ణము వీడుచు తెల్లవారెనే.

    రిప్లయితొలగించండి
  7. అసితఁపు మేఘసంచయము లాకసమందున గ్రమ్ముకొంచు రా
    కసి గడనమ్మువోలెఁ జన క్రన్నన ప్రాగ్దిశ రంగులీనుచున్
    పసిడి వెలుంగు రేఖలను పన్నుగ జిమ్ముచు విశ్వమందు తా
    మసి కిక వీడుకోలనుచు మర్కుడు తానుదయించె నిమ్ముగన్

    రిప్లయితొలగించండి
  8. కందం
    అసితుని పిత చీకటి ర
    క్కసిఁ దునుమంగ రథియౌచు గమనము నెంచన్
    పసిడి కిరణాయుధుఁడుగ స
    మసి పోయెను లోని దిగులు మర్త్యులకెల్లన్

    రిప్లయితొలగించండి
  9. తామసి తొలగి పోయెను తమ్మికెంపు
    లందముగ వికసించెను హరిహయున్ని
    గాంచి , పసిడి వెలుగునిండె క్షాంతిమీద
    ప్రజలసిగొని మేలుకొనిరి పనులు సేయ

    రిప్లయితొలగించండి
  10. కం॥ అసితము క్రమ్మగ రాత్రిని
    పసిడి కిరణములఁ బ్రభాత భానుఁడు తొలఁగన్
    వసుధను వికసితమగు నిరు
    లు సమసిపోగ జిలుఁగులవెలుగులను బంచన్

    రిప్లయితొలగించండి


  11. అసితుని జనకుండు నగుపించినంతనే
    సమిసి పోవు తమము సత్వరముగ
    పసిడి కాంతి నిండ ప్రజలుపరవశించ
    వికసితమగునెల్ల విరులు భువిని

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అసిత వర్ణము క్రమముగా నంతమగుచు
    ప్రాగ్దిశను వికసించగా ప్రథమ సూర్య
    కిరణము,పసిడి మేఘముల్ పరవశించ
    విశ్వమందున తామసి వెడలిపోయె.

    రిప్లయితొలగించండి


  13. మ॥
    అసితధ్వాంతనివృత్తికైబదులుసాయంబిచ్చె ప్రక్కింటి తా

    పసితూర్పింటవసించుచున్ ద్యుమణి దీపంబున్ మహీదేవికిన్

    లసితక్ష్మాజపరీతహృద్వికసి తోల్లాసంబులేమార్ప తా
    పసికిన్ పశ్చిమకిచ్చెపో భ్రమసి తూర్పమ్మప్పు మార్పున్ గొనెన్

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి