29, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4600

30-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అగ్ని నార్పవచ్చు నగ్నితోడ”
(లేదా...)
“అగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్”

18 కామెంట్‌లు:

  1. ఆ॥వె॥

    వంట లరయజేసి వడ్డించి దీనాళ్కి
    కడుపులందుబాధకల్గించు భయదక్షుత్
    “అగ్ని నార్పవచ్చు నగ్నితోడ”

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ॥వె॥

      వంట లరయజేసి వడ్డించి దీనాళ్కి
      విందుభోజనముల వేడ్కఁజేసి
      కడుపులందుబాధకల్గించు భయదక్షుత్
      “అగ్ని నార్పవచ్చు నగ్నితోడ”

      గాదిరాజు మధుసూదన రాజు

      తొలగించండి
  2. వండ వచ్చు మంచి వంటక ములనెన్నొ
    వేడి జేయ వచ్చు వెన్న నెయ్యి
    తృప్తి గలుగునట్లు దిని కడుపున జఠ
    రాగ్ని నార్పవచ్చు, నగ్నితోడ.

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    వయసు పొంగులొడ్డి వాలె నీ యూర్వశి
    రాజుకొన్న నగ్ని రట్టు కాదె?
    పొగలు రేగు సొగసు తగులనెంచవె? క్రీడి
    యగ్ని నార్పవచ్చు నగ్నితోడ!

    ఉత్పలమాల
    మగ్నము సేసితిన్ మదిని మానవ! యూర్వశి సోయగమ్ము ను
    ద్విగ్నత రేపదే వలపు! తీక్ష్ణపు జ్వాలలు రట్టు కావనన్
    భగ్నమొనర్తువే? తనువు భగ్గునమండుచుఁ గోరె ఫల్గుణా!
    యగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్!

    రిప్లయితొలగించండి
  4. కొంచెమైన బెదరకుండ జలము తోడ
    నగ్ని నార్పవచ్చు ; నగ్నితోడ
    కుంపటి వెలిగించి కూడు వండినయెడ
    నిక్కముగ కడుపును నింపవచ్చు

    రిప్లయితొలగించండి
  5. ఉ.

    అగ్నులనేకముల్ కలవు హావడి కామము క్రోధముల్ మదిన్
    భగ్నము పుంజికస్థలకు పైసరమయ్యెను రావణాఖ్యుచే,
    భుగ్నము బ్రహ్మ లోకమున, బొమ్మను వేడగ శాపమిచ్చెగా
    *అగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్.*

    రిప్లయితొలగించండి

  6. పొద్దు పొడిచె గాదె పొయ్యి రాజేయుము
    క్షుత్తు పెరుగుచుండె కుక్షిలోన
    బాధతీర్చమంటి భామరో నా జఠ
    రాగ్ని నార్పవచ్చు నగ్నితోడ.


    అగ్నిజు దేహకర్త నిటలాక్షుడొసంగిన యా వరమ్ము చే
    భగ్నము జేసె సైంధవుడు పాండవ వీరుల యెత్తులెల్ల ను
    ద్విగ్నము వీడుమో నరుడ వెంబర గూల్చగ చాపమెత్తు శో
    కాగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్.

    (అగ్ని ....బాణము )

    (నీ అగ్నిని బోలిన బాణాలతో దుర్మతి సంధవుని కూల్చి నీ శోకాగ్ని చల్లబడునని కృష్ణుడు అర్జనుని ఓదార్చినట్లుగా నూహించి)

    రిప్లయితొలగించండి
  7. అగ్నివంటి వలపు నంటించి నీవిటు
    మౌనమూన భావ్యమౌనె చెలియ
    వేగ మిమ్ము వచ్చి వెచ్చని కౌగిలి
    నగ్ని నార్పవచ్చు నగ్నితోడ

    రిప్లయితొలగించండి
  8. చిచ్చుబుట్టునుగద చిచ్చరంబిడినచో
    వారుణాస్త్ర మిడిన వానకురియు
    నంపకోలవలన నారెండు సాధ్యమే
    అగ్ని నార్పవచ్చు నగ్నితోడ

    అగ్నికి చిచ్చరమ్మనెడి యస్త్రము యోగ్యము నట్టి యగ్నినే
    భగ్నముసేయగాతలచి బాణము విడ్చుట లోకసిద్ధమే
    యగ్నిని వారుణాస్త్రమున నార్పుటఁ జూపు పురాణగాథలే
    యగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  9. అగ్ని రగుల్కొనన్ హృదయమందున నాశలు రేపి నిర్దయన్
    భగ్నమొనర్ప భావ్యమొకొ భామిని నాదగు ప్రేమ ధామమున్
    లగ్నమయెన్ మనంబు కమలాక్షిరొ వెచ్చని కౌగిలీయుమా
    యగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  10. కుటిల నీతి రగిలి కోరికలు కదిలి
    అగ్నివోలె మనను ఆరగించు
    తగుల బడుక గాచు దయగ తపోఅగ్ని:
    అగ్ని నార్పవచ్చు నగ్నితోడ

    రిప్లయితొలగించండి
  11. దేహ మందు గలదు దివ్యంపు టగ్నియు
    మరణ మైన పిదప మనుజు శవము
    పేర్చి నట్టి చితిని బెట్టియు కాల్చగా
    నగ్ని నార్ప వచ్చు నగ్ని తోడ

    రిప్లయితొలగించండి
  12. అగ్నికి రూపమై మనను ఆగ్రహ మెప్పుడు గాల్చివేయు, ఈ
    అగ్నిని చేతబట్టిపర మార్ధముదూరముసేయరాదిలన్
    అగ్నికి రూపమౌ తపమునార్యులు లెస్సగ నేర్పినారుగా
    అగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  13. ఆ॥ నేను నమ్మనయ్య నీవు నుడివినంత
    నగ్ని నార్పవచ్చు నగ్నితోడ
    ననుచు జలము తోడ నార్పఁగ వచ్చును
    సత్య వాక్కుఁ దెలుప సాధు పురుష

    ఉ॥ అగ్నిని రేచునే యలిగి యాలును గోపముఁ జూపి దూరుచున్
    భగ్నముఁ జేసి మానసము బాధలు వెట్టుచు సత్య రీతిగా
    నగ్నిని నార్పు నగ్ని ప్రియమారఁగఁ బుట్టద కౌగలించఁగా
    నగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన ఉత్పలమాల

      ఉ॥ అగ్నిని రేచునే యలిగి యాలును గోపముఁ జూపి దూరుచున్
      భగ్నముఁ జేసి మానసము బాధలు వెట్టఁగ సత్య రీతి యా
      యగ్నిని నార్పు నగ్ని ప్రియమారఁగఁ బుట్టద కౌగలింతలో
      నగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్

      తొలగించండి
  14. డా బల్లూరి ఉమాదేవి

    శత్రువు,నణచంగసమకట్టిభీముడు
    పోరు సలుపనెంచి భూరి గాను
    రణముచేయ వచ్చె రగిలెడు మదిని ద్వే
    షాగ్నినార్పవచ్చునగ్నితోడ


    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    మంటలు చెలరేగ నింటిలో, నీటితో
    నగ్ని నార్ప వచ్చు; నగ్ని తోడ
    వంట చేయవచ్చు,బంధముల్ ముడివడు
    నగ్ని సాక్షిగా వివాహమందు.

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    మంటలు చెలరేగ నింటిలో, నీటితో
    నగ్ని నార్ప వచ్చు; నగ్ని తోడ
    వంట చేయవచ్చు,బంధముల్ ముడివడు
    నగ్ని సాక్షిగ పరిణయము నందు.

    రిప్లయితొలగించండి