10-11-2023 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్”(లేదా...)“పామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్”
ప్రేమగల తల్లి తనయునిక్షేమము సంతోషమునకుశీఘ్రమ్మున తానేమో తెచ్చెను రబ్బరుపామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్
ప్రేమగల తల్లి తనయునిక్షేమము సంతోషమునకుశీఘ్రమ్మున తానేమేమొ తెచ్చె రబ్బరుపామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్
ఏమా సర్పపు టందము,కోమలమగు చర్మము గని కుమరుడు మురిసెన్,ధీమా తోడన్దెలియకపామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్”
కందంఏమని చెప్పిన శ్రీహరినామముఁ బ్రహ్లాదుడు విడనాడడని భటుల్స్వామిబనుప మెడఁజుట్టగపామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్ఉత్పలమాలఏమని చెప్పినన్ వినక యెంతకు వీడక బాల భక్తుడున్నామ జపమ్మునన్ హరిని నమ్ముచు గొల్వఁగఁ దండ్రి పన్పునన్నీమము దప్పకే భటులు నిర్దయ కంఠము జుట్టినంతటన్బామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్
ప్రేమగ తండ్రొక శిశువును ఆముకొనియు వీపునెత్తి ఆడించంగన్ ఓముగ మరిమరి తనవెన్పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్
సోమేశుకంఠమందారామముగ వెలసిన సర్పరాజము గని, మారాము వదలె స్కందుం,డాపామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్”.
కోమలి బొమ్మల చీరనుకామితము గ దాను దాల్చె కమనీ యము గన్ ప్రేమగ కొమరు o డయ్యె డపామును ముద్దాడి శిశువు పక్కున నవ్వె న్
బామము జూపగ బిడ్డడిబామనుగని నోర్వలేక వానిని తేర్చెన్గోముగ నచటగ ల రజతపామును ముద్దాడి ; శిశువు పక్కున నవ్వెన్
ప్రేమగ నా శివుడు పిలువ స్వామియె శిఖినెక్కి రాగ శాత్రవుడగు వర్షామదమును గని భీతిలు పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్.మోమున మోముపెట్టి ప్రియ పుత్రుని స్కందుని ముద్దులాడగన్ బ్రేమగ బిల్చినంత నహిభృత్తుని జేరగ వచ్చునట్టియాస్వామిని మోయు కేకి గని వాసుకి భీతిల నెమ్మితోడ నాపామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్.
క్రొవ్విడి వెంకట రాజారావు, అమెరికా (క్యాంపు)శైలజ నొడినున్న గుహుడు ఫాలుని మెడలో కదలెడు ఫణి నారయుచున్ వీలుగ గెంతియు తానా పాముని ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్.
క్రొవ్విడి వెంకట రాజారావు, అమెరికా(క్యాంపు) ప్రేమగ కార్తికేయు నతివేడుకతో తన యంకమందునన్ గోముగ శక్తియౌ గిరిజ కూర్చొనజేయగా శంభుకంఠమున్ కోమలికమ్ముగన్ దిరుగు కుండలి గాంచుచు నుద్గమించి యా పాముని ముద్దుబెట్టుకొని పక్కున నవ్వెను బాలుడత్తఱిన్.
హైముని చిత్రపటమ్మునుమామ విపణివీధినుండి మనసిడి కొనగన్సోముని గళమున నిలచినపామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్
హైముని దేవళంబునకు నాత్మజు తోడుతనేగి దంపతుల్క్షేమము కోరి పూజలను సేయగ దేవళ కుడ్యమందునన్సోముని చిత్రలేఖనము చూచి పదంపడి చిత్రమందునన్పామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్
కం॥ ఏమని తెల్పుదు కృష్ణుఁడుగోముగఁ జేసిన మహిమలు గొల్లల యెదుటన్పాము పడగపై నాడుచుపామును ముద్దాడి శిశివు పక్కున నవ్వెన్ఉ॥ ఏమని తెల్పగన్ దగునొ యీతఁడు బాలుఁడ గాడు దైవమేభామల తోడ నాడుచును భాసుర మొప్ప మహాత్మ్యముల్ గనెన్గోముగ నాట్యమాడి ఫణి గొల్లలు గాంచ శిరమ్ముపై నటుల్పామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తరిన్
ఉ.తేమము సర్పరాజు వసుదేవుని పుత్రుని బాలకృష్ణునిన్ గోమలమూర్తిగా మలచి కోమలి సూనునకివ్వ బొమ్మనెన్బ్రేమగ జేతితో నిమిరి పెట్టుచు దండము పారవశ్యమున్ *బామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్.*
ఏమర సుముఖుడు పార్వతి మోమునుగాంచుచుతనకరమునకందినయాకామారియాభరణమౌపామును ముద్దాడి శిశువు ఫక్కున నవ్వెన్సేమముకూర్చ గా ప్రజకు శీఘ్రము గాచనగోపబాలురున్ప్రేమగవెంటనడ్వగను వేడుక తోడను దూకిమడ్వులొశ్యామలవర్ణుడాడుచును చంపగ నెంచుచు పట్టి పుచ్ఛమున్పామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్
ప్రేమగల తల్లి తనయుని
రిప్లయితొలగించండిక్షేమము సంతోషమునకుశీఘ్రమ్మున తా
నేమో తెచ్చెను రబ్బరు
పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్
ప్రేమగల తల్లి తనయుని
రిప్లయితొలగించండిక్షేమము సంతోషమునకుశీఘ్రమ్మున తా
నేమేమొ తెచ్చె రబ్బరు
పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్
ఏమా సర్పపు టందము,
రిప్లయితొలగించండికోమలమగు చర్మము గని కుమరుడు మురిసెన్,
ధీమా తోడన్దెలియక
పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్”
కందం
రిప్లయితొలగించండిఏమని చెప్పిన శ్రీహరి
నామముఁ బ్రహ్లాదుడు విడనాడడని భటుల్
స్వామిబనుప మెడఁజుట్టగ
పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్
ఉత్పలమాల
ఏమని చెప్పినన్ వినక యెంతకు వీడక బాల భక్తుడున్
నామ జపమ్మునన్ హరిని నమ్ముచు గొల్వఁగఁ దండ్రి పన్పునన్
నీమము దప్పకే భటులు నిర్దయ కంఠము జుట్టినంతటన్
బామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్
ప్రేమగ తండ్రొక శిశువును
రిప్లయితొలగించండిఆముకొనియు వీపునెత్తి ఆడించంగన్
ఓముగ మరిమరి తనవె
న్పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్
సోమేశుకంఠమందా
రిప్లయితొలగించండిరామముగ వెలసిన సర్పరాజము గని, మా
రాము వదలె స్కందుం,డా
పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్”.
కోమలి బొమ్మల చీరను
రిప్లయితొలగించండికామితము గ దాను దాల్చె కమనీ యము గన్
ప్రేమగ కొమరు o డయ్యె డ
పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వె న్
బామము జూపగ బిడ్డడి
రిప్లయితొలగించండిబామనుగని నోర్వలేక వానిని తేర్చెన్
గోముగ నచటగ ల రజత
పామును ముద్దాడి ; శిశువు పక్కున నవ్వెన్
రిప్లయితొలగించండిప్రేమగ నా శివుడు పిలువ
స్వామియె శిఖినెక్కి రాగ శాత్రవుడగు వ
ర్షామదమును గని భీతిలు
పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్.
మోమున మోముపెట్టి ప్రియ పుత్రుని స్కందుని ముద్దులాడగన్
బ్రేమగ బిల్చినంత నహిభృత్తుని జేరగ వచ్చునట్టియా
స్వామిని మోయు కేకి గని వాసుకి భీతిల నెమ్మితోడ నా
పామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్.
క్రొవ్విడి వెంకట రాజారావు, అమెరికా (క్యాంపు)
రిప్లయితొలగించండిశైలజ నొడినున్న గుహుడు
ఫాలుని మెడలో కదలెడు ఫణి నారయుచున్
వీలుగ గెంతియు తానా
పాముని ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్.
క్రొవ్విడి వెంకట రాజారావు, అమెరికా(క్యాంపు)
రిప్లయితొలగించండిప్రేమగ కార్తికేయు నతివేడుకతో తన యంకమందునన్
గోముగ శక్తియౌ గిరిజ కూర్చొనజేయగా శంభుకంఠమున్
కోమలికమ్ముగన్ దిరుగు కుండలి గాంచుచు నుద్గమించి యా
పాముని ముద్దుబెట్టుకొని పక్కున నవ్వెను బాలుడత్తఱిన్.
హైముని చిత్రపటమ్మును
రిప్లయితొలగించండిమామ విపణివీధినుండి మనసిడి కొనగన్
సోముని గళమున నిలచిన
పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్
హైముని దేవళంబునకు నాత్మజు తోడుతనేగి దంపతుల్
రిప్లయితొలగించండిక్షేమము కోరి పూజలను సేయగ దేవళ కుడ్యమందునన్
సోముని చిత్రలేఖనము చూచి పదంపడి చిత్రమందునన్
పామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్
కం॥ ఏమని తెల్పుదు కృష్ణుఁడు
రిప్లయితొలగించండిగోముగఁ జేసిన మహిమలు గొల్లల యెదుటన్
పాము పడగపై నాడుచు
పామును ముద్దాడి శిశివు పక్కున నవ్వెన్
ఉ॥ ఏమని తెల్పగన్ దగునొ యీతఁడు బాలుఁడ గాడు దైవమే
భామల తోడ నాడుచును భాసుర మొప్ప మహాత్మ్యముల్ గనెన్
గోముగ నాట్యమాడి ఫణి గొల్లలు గాంచ శిరమ్ముపై నటుల్
పామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తరిన్
ఉ.
రిప్లయితొలగించండితేమము సర్పరాజు వసుదేవుని పుత్రుని బాలకృష్ణునిన్
గోమలమూర్తిగా మలచి కోమలి సూనునకివ్వ బొమ్మనెన్
బ్రేమగ జేతితో నిమిరి పెట్టుచు దండము పారవశ్యమున్
*బామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్.*
ఏమర సుముఖుడు పార్వతి
రిప్లయితొలగించండిమోమునుగాంచుచుతనకరమునకందినయా
కామారియాభరణమౌ
పామును ముద్దాడి శిశువు ఫక్కున నవ్వెన్
సేమముకూర్చ గా ప్రజకు శీఘ్రము గాచనగోపబాలురున్
ప్రేమగవెంటనడ్వగను వేడుక తోడను దూకిమడ్వులొ
శ్యామలవర్ణుడాడుచును చంపగ నెంచుచు పట్టి పుచ్ఛమున్
పామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్