20, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4591

21-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామునిఁ బెండ్లాడెను బలరామానుజయే”
(లేదా...)
“రాముని కేలుఁ బట్టె బలరాముని సోదరి ధర్మపత్నియై”
(ఇచ్ఛాపురం అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)

15 కామెంట్‌లు:

  1. కందం
    ఆ ముని వేషమున నరుఁడు
    భామ సుభద్రకు ప్రియమయి బకవైరి కృపన్
    ప్రేమగ వేదిజ హృదయా
    రామునిఁ బెండ్లాడెను బలరామానుజయే

    ఉత్పలమాల
    ఆ ముని వేషమున్ దొడిగి యర్జునుఁడంది సుభద్ర సేవలన్
    భామకు దగ్గరై వలపు బంచగ దూగుచు శౌరి సత్కృపన్
    గాముని తూపులన్ దొరికి కవ్వడి నొప్పుచు కృష్ణ మానసా
    రాముని కేలుఁ బట్టె బలరాముని సోదరి ధర్మపత్నియై

    రిప్లయితొలగించండి

  2. కోమలి కృష్ణను గెలిచిన
    యా మహనీయుడె కపటపు యతియై రాగా
    ప్రేమించితి ననుచును గద
    రా , మునిఁ బెండ్లాడెను బలరామానుజయే.

    రిప్లయితొలగించండి
  3. భామిని వలచిన కవ్వడి
    తా మారియు జేరె నొకట తాపసి యగుచున్
    ప్రేమగ న య్యె డ హృదయా
    రాముని బెండ్లా డెను బల రామానుజ యే!

    రిప్లయితొలగించండి

  4. ఆ ముని సేవలన్ సలుపు మంచు శుభంబది గూర్చునంచు నా
    భామ సుభద్రతోడ బకవైరి వచింపగ భక్తి మీరగా
    నా ముని గుస్తరించి కడకాతడు ఫల్గుణుడంచెరంగె నౌ
    రా! ముని కేలుఁ బట్టె బలరాముని సోదరి ధర్మపత్నియై.

    రిప్లయితొలగించండి


  5. ఆ ముని సేవలన్ సలుపు మంచు శుభంబది గూర్చునంచు నా
    భామ సుభద్రతోడ బకవైరి వచింపగ భక్తి మీరగా
    నా ముని గుర్తెరంగి కడకా సఖి కవ్వడి, కృష్ణ మానసా
    రాముని కేలుఁ బట్టె బలరాముని సోదరి ధర్మపత్నియై.

    రిప్లయితొలగించండి
  6. భూమిజ స్వయంవరంబున
    రామునిఁ బెండ్లాడెను ; బలరామానుజయే
    నోములు నోచి కిరీటిని
    సేమముగ వివాహమాడె శ్రీకర మొందన్

    రిప్లయితొలగించండి
  7. భామామణి పాంచాలికి
    స్వామియు, ఫల్గుణుడు సవ్య సాచియు పరం
    ధామసఖుడు వల్లభుడభి
    “రామునిఁ బెండ్లాడెను బలరామానుజయే”

    రిప్లయితొలగించండి
  8. కందం:
    తా ముని రూపమ్మున బల
    రాముని యుపవనమున కపిరథుడేతెంచన్
    ప్రేమ మదిని నెక్కొన నౌ
    రా! మునిఁ బెండ్లాడెను బలరామానుజయే

    రిప్లయితొలగించండి
  9. తాఁముని వేషమున తరలె
    కామితమునెఱిగి సుభద్రకై ఫల్గుణుడే
    ప్రేమముతోనా యాత్మా
    రామునిఁ బెండ్లాడెను బలరామానుజయే

    కోమలియౌ సుభద్ర మది కోరెను రూఢిగ సవ్యసాచినే
    యామెను చేరవచ్చెనట నర్జునుడే యతి వేషధారియై
    ప్రేమనెఱింగి నగ్గలిక ప్రీతిఁ జెలంగె నరుండు నంతరా
    రాముని కేలుఁ బట్టె బలరాముని సోదరి ధర్మపత్నియై

    రిప్లయితొలగించండి
  10. కోమలి కైరవలోచని
    మోమున కళ్యాణ తిలకముద్భాసించన్
    ప్రేమతొ కైగొని సుగుణభి
    రామునిఁ బెండ్లాడెను బలరామానుజయే

    రిప్లయితొలగించండి
  11. ఉత్పలమాల:
    భామిని సీలి సోదరినిఁ బార్థుఁడు పెండిలియాడ నర్మిలిన్
    స్వాములవారి రూపమున వచ్చి వనమ్మున తిష్ట వేయ నా
    స్వామికి సేవచేయునెడ సత్యమెరింగి ముదంబునొంది యౌ
    రా! ముని కేలుఁ బట్టె బలరాముని సోదరి ధర్మపత్నియై

    రిప్లయితొలగించండి
  12. కం॥ ప్రేమము మీరఁగ జానకి
    రామునిఁ బెండ్లాడెను, బలరామానుజయే
    నోములు నోచెను విజయుని
    స్వామిగఁ బొందఁగ సతతము భావము మీరన్

    ఉ॥ తా ముని రూపమున్ బడసి దగ్గర చేరఁగ భక్తి నిల్పుచున్
    నేమము తోడ సేవలను నిత్యముఁ జేయుచు ఫల్గుణుండనిన్
    భామ సుభద్ర తెల్సికొనఁ బల్కుచు నీతఁడు బావయేన యౌ
    రా! ముని కేలుఁ బట్టె బలరాముని సోదరి ధర్మపత్నియై

    రిప్లయితొలగించండి
  13. స్వామిగ యరుదెంచియచట
    దామోదరునకుదెలుపుచుతనవాంఛితమున్
    సోమునిబోలు సుగుణాభి
    రామునిఁ బెండ్లాడెను బలరామానుజయే”*

    మోమునచిరునగవెగయగ
    కామితములుతీరుననుచుకవ్వడిరాగా
    ప్రేమగదరిచేరిమనో
    రాముని బెండ్లాడెను బలరామానుజయే

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ప్రేమగ నవనిజ సభలో
    రాముని బెండ్లాడెను; బలరామానుజయే
    ఆ ముని వేషంబందున
    ప్రేమించిన నరుని గాంచి ప్రీతినిబొందెన్.

    రిప్లయితొలగించండి