20-11-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్”(లేదా...)“కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్”(మరికల్ అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)
కందంకోరితి సుబ్రహ్మణ్యునినూరించుము సంతునిచ్చి నొప్పగననుచున్తీరగు సుతునకు మధురాకారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్!ఉత్పలమాలఊరిని మేటి యాస్తిపరులొప్పగ కూతురి పెండ్లిఁ జేయ నోరూరగఁ గూర్చి విందు మధురోహల దేల్చు విభావరిన్ దగన్దీరిచి గాన మాధురులఁ దృప్తిగ కాన్కల గొప్ప మందసాకారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్
ఈరసమొందె ననుచు, మమకారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్గారవము నింపుకొనుచునె , నారయ నాపడతి వాని యమ్మయె గాదా
ఉ.చేరిరి గోపబాలికలు చెల్వము కృష్ణుని రాసలీలలన్గోరుచు స్నేహబంధమును గోమలి రాధయు గ్రీడ సల్పగన్దారలుగా పరస్పరము ధన్యముగా తలచంగ నంగసం*స్కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్.*
నేరక చేసిన తప్పులుకారుణ్యముతోడ సైచి కామాక్షి వెసన్కోరిన నీప్సితములు, మమకారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్
కారముపూడిగ్రామమునకాంచిరిపెద్దలువీధులన్ కళాకారులకుర్రచేష్టలవికారపుదుస్తులసంచరించుటన్చేరిరి కోపతాపములచేతనుమండగనేత్రముల్ నమస్కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్గాదిరాజు మధుసూదనరాజు
కోరక కోరక తానొకకోరిక కోరెనని మగడు కోమలి కొరకై భారమనక తెచ్చి యలంకారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్.కోరిన కోర్కెతీర్చడని కూళుడటంచు నిశాంతనారి యే దూరుచు నేడ్చుచుండ కుముదుండని బంధువు లెల్ల పేర్కొనన్ గోఱడ మందునేగుచు నకుప్యపు హారము తెచ్చి యా యలంకారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్.
ఊరున పాడుబడినగుడితీరిచిదిద్దగఁ దలంచి తిప్పలఁబడినన్వారే శ్రీదేవికలంకారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్ఊరున పాడుబడ్డగుడి యుండగ దానిని తీర్చిదిద్దగన్గోరిక పుట్టె మాకనుచు కొందరు పెద్దలు ముందుకొచ్చి శ్రీకారము చుట్టి పాటుపడి కన్నుల ముందటి మూర్తికే యలంకారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్
నేరములెన్ని సల్పినను నేరక, సద్గురు సాకతమ్ముగన్జేరి సమాశ్రయించు తన శిష్యుల యున్నతి వాంఛ చేయుచున్గారవమొప్ప యోగ్య పథగాముల జేయుచు భవ్యమైన సంస్కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్
కం॥ ఓరిమిఁ గని తోడుగచనభారమనుచు నెంచకుండ భామ నిరతమున్హారము నొసఁగి మగఁడు మమకారము నిడి చల్లఁబఱచెఁ గన్నులనెల్లన్ఉ॥ భారము మేము కొద్దిగను బాధ్యత తోడ వహించెదమ్మనిన్గోరిరి పాఠశాలకొక గొప్ప భవంతిని గ్రామ పెద్దలున్వారల వాంఛ మోదమని పాలకమండిలి యెంచి యొప్పి స్వీకారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లఁగఁ జేసి రెంతయున్
వారిజలోచన భువిజనుసీరపు చాలున కనుగొని శీఘ్రతరముగాకూరిమి సతిచేతికి మమకారమునిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్
భారమ్ము నోర్వలేకనుసారెకు కనులెర్రజేయు సతికిన్ బతి తాచీరెను గొని తెచ్చియు మమకారమునిడి చల్లబరచె గన్నులనెల్లన్
కోరిక దీర్చు మటంచునుమారా మును జేయు దన కు మారుని కిన్ దాతీరగు వంట ల తో మమకారము నిడి చల్లబ ఱ చె కన్నుల నెల్ల న్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. కోరిన నగ తేలేదని దారయు కనులెఱ్ఱ జేయ దడియుచు మగడున్భారమనక తెచ్చెను, మమ కారము నిడి చల్లబఱచెఁ గన్నుల నెల్లన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందం
రిప్లయితొలగించండికోరితి సుబ్రహ్మణ్యుని
నూరించుము సంతునిచ్చి నొప్పగననుచున్
తీరగు సుతునకు మధురా
కారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్!
ఉత్పలమాల
ఊరిని మేటి యాస్తిపరులొప్పగ కూతురి పెండ్లిఁ జేయ నో
రూరగఁ గూర్చి విందు మధురోహల దేల్చు విభావరిన్ దగన్
దీరిచి గాన మాధురులఁ దృప్తిగ కాన్కల గొప్ప మందసా
కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్
ఈరసమొందె ననుచు, మమ
రిప్లయితొలగించండికారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్
గారవము నింపుకొనుచునె ,
నారయ నాపడతి వాని యమ్మయె గాదా
ఉ.
రిప్లయితొలగించండిచేరిరి గోపబాలికలు చెల్వము కృష్ణుని రాసలీలలన్
గోరుచు స్నేహబంధమును గోమలి రాధయు గ్రీడ సల్పగన్
దారలుగా పరస్పరము ధన్యముగా తలచంగ నంగసం
*స్కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్.*
నేరక చేసిన తప్పులు
రిప్లయితొలగించండికారుణ్యముతోడ సైచి కామాక్షి వెసన్
కోరిన నీప్సితములు, మమ
కారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్
కారముపూడిగ్రామమునకాంచిరిపెద్దలువీధులన్ కళా
రిప్లయితొలగించండికారులకుర్రచేష్టలవికారపుదుస్తులసంచరించుటన్
చేరిరి కోపతాపములచేతనుమండగనేత్రముల్ నమ
స్కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్
గాదిరాజు మధుసూదనరాజు
రిప్లయితొలగించండికోరక కోరక తానొక
కోరిక కోరెనని మగడు కోమలి కొరకై
భారమనక తెచ్చి యలం
కారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్.
కోరిన కోర్కెతీర్చడని కూళుడటంచు నిశాంతనారి యే
దూరుచు నేడ్చుచుండ కుముదుండని బంధువు లెల్ల పేర్కొనన్
గోఱడ మందునేగుచు నకుప్యపు హారము తెచ్చి యా యలం
కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్.
ఊరున పాడుబడినగుడి
రిప్లయితొలగించండితీరిచిదిద్దగఁ దలంచి తిప్పలఁబడినన్
వారే శ్రీదేవికలం
కారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్
ఊరున పాడుబడ్డగుడి యుండగ దానిని తీర్చిదిద్దగన్
గోరిక పుట్టె మాకనుచు కొందరు పెద్దలు ముందుకొచ్చి శ్రీ
కారము చుట్టి పాటుపడి కన్నుల ముందటి మూర్తికే యలం
కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్
నేరములెన్ని సల్పినను నేరక, సద్గురు సాకతమ్ముగన్
రిప్లయితొలగించండిజేరి సమాశ్రయించు తన శిష్యుల యున్నతి వాంఛ చేయుచున్
గారవమొప్ప యోగ్య పథగాముల జేయుచు భవ్యమైన సం
స్కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్
కం॥ ఓరిమిఁ గని తోడుగచన
రిప్లయితొలగించండిభారమనుచు నెంచకుండ భామ నిరతమున్
హారము నొసఁగి మగఁడు మమ
కారము నిడి చల్లఁబఱచెఁ గన్నులనెల్లన్
ఉ॥ భారము మేము కొద్దిగను బాధ్యత తోడ వహించెదమ్మనిన్
గోరిరి పాఠశాలకొక గొప్ప భవంతిని గ్రామ పెద్దలున్
వారల వాంఛ మోదమని పాలకమండిలి యెంచి యొప్పి స్వీ
కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లఁగఁ జేసి రెంతయున్
వారిజలోచన భువిజను
రిప్లయితొలగించండిసీరపు చాలున కనుగొని శీఘ్రతరముగా
కూరిమి సతిచేతికి మమ
కారమునిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్
భారమ్ము నోర్వలేకను
రిప్లయితొలగించండిసారెకు కనులెర్రజేయు సతికిన్ బతి తా
చీరెను గొని తెచ్చియు మమ
కారమునిడి చల్లబరచె గన్నులనెల్లన్
కోరిక దీర్చు మటంచును
రిప్లయితొలగించండిమారా మును జేయు దన కు మారుని కిన్ దా
తీరగు వంట ల తో మమ
కారము నిడి చల్లబ ఱ చె కన్నుల నెల్ల న్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కోరిన నగ తేలేదని
దారయు కనులెఱ్ఱ జేయ దడియుచు
మగడున్
భారమనక తెచ్చెను, మమ
కారము నిడి చల్లబఱచెఁ గన్నుల నెల్లన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి