14, నవంబర్ 2023, మంగళవారం

సమస్య - 4586

15-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని”
(లేదా...)
“పువ్వులలోనఁ దీవ్రముగఁ బుట్టిన దగ్ని యెదన్ రగుల్చుచున్”

25 కామెంట్‌లు:

  1. నరకుడు కడతేరు నందమున జరుపు
    పర్వ దినము నందు బగటి పూట
    పిల్లవాడు కోరి వెలిగించ ; కాకర
    పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    ముద్దులొలుకు ఋగ్గ ముద్దాడ బోవగ
    నిత్యమొక్క పూజ నిర్వహించి
    యడ్డు చెప్పి పతిని నాపితే? శయ్యపై
    పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని!

    ఉత్పలమాల
    రవ్వల గాజులన్ మెఱసి లాగితె గుండెను నోపఁ జాలకే
    మువ్వల పాదమున్ దగిలి ముద్దొకటిమ్మని భర్త వేడ చి
    ర్నవ్వున నిత్య పూజలని రావొకొ? తాపము రేగి శయ్యపై
    పువ్వులలోనఁ దీవ్రముగఁ బుట్టిన దగ్ని యెదన్ రగుల్చుచున్!

    రిప్లయితొలగించండి
  4. తరుణి చూపు లందు విరిశరములవియె
    మదిని దాకుచుండి మరులు గొలుప
    తాను దాల్చినట్టి తావులీనెడు మల్లె
    పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని.



    ఎవ్వరి దానవోయి యిట కెవ్వని కోసము జేరినావొ నీ
    నవ్వుల లోన వెన్నెలలు నామది మోహము మోసు లెత్తగా
    జవ్వని! కొప్పులోని సుమ సౌరభ మయ్యది కోర్కె బెంచుచున్
    పువ్వులలోనఁ దీవ్రముగఁ బుట్టిన దగ్ని యెదన్ రగుల్చుచున్.

    రిప్లయితొలగించండి
  5. రవ్వలువిరజిమ్ము రంగుల కాంతులఁ
    జవ్వని గనవచ్చె సంభ్రమముగ
    కాంత రగులజేయు కాకర పూవత్తి
    పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని

    రవ్వల పువ్వులైనవవి రాతిరి కాకరపువ్వువత్తులే
    రవ్వలవెంట రంజనము రమ్యమనోహర కాతిపుంజముల్
    జవ్వనిచెంపపైపడగ చక్కని దృశ్యము నాకు సొంతమై
    పువ్వులలోనఁ దీవ్రముగఁ బుట్టిన దగ్ని యెదన్ రగుల్చుచున్

    రిప్లయితొలగించండి
  6. సుమముకన్న మిగుల సుకుమారమైన నా
    మదిని చిచ్చు రేపి మరలి పోకు
    విరహ మతిశయించి వెతనొంద నీ నవ్వు
    పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని

    రిప్లయితొలగించండి
  7. నవ్విన చాలు నిందుముఖి నా మది జివ్వున సంభ్రమించు నా
    జవ్వని వాలుకంటఁగన చక్కిలిగింతలు పుట్టు మేనునన్
    పువ్వుల కన్న కోమలము పొల్తుక యందము కొప్పులోని యా
    పువ్వులలోనఁ దీవ్రముగఁ బుట్టిన దగ్ని యెదన్ రగుల్చుచున్

    రిప్లయితొలగించండి
  8. పర్వ దినము నందు బాలలు ముదమార
    కాల్చు చుండిరి గద కౌతు క ముగ
    నట్టి వేళ జూడ నద్భు త కాకర
    పువ్వు లందు గనుము పుట్టె నగ్ని

    రిప్లయితొలగించండి
  9. ఆ॥ నవ్వులెన్నొ కనఁగ నయగారములు నన్నె
    నింపి మనసు దోచు నిరత మింతి
    మగఁడు దరికిఁ జేర మరులు గొనుచు సిగ
    పువ్వులందు గనుము పుట్టె నగ్ని

    ఉ॥ నవ్వులు పంచునంచు నెఱనమ్ముచుఁ గోమలి నొక్కదానినిన్
    దివ్వెగ వెల్గు నింపునని దీపపు కాంతిని పెండ్లియాడుచున్
    రవ్వల హార శోభలను రంజిలు మోమును దాకినంతనే
    పువ్వులలోనఁ దీవ్రముగఁ బుట్టిన దగ్ని యెదన్ రగుల్చుచున్

    రిప్లయితొలగించండి
  10. ప్రేమ జంట యొకటి వెళ్ళి పూదోటకు
    సరసమాడుచుండ సంబురమున
    పిల్ల తండ్రి సూచి పిడ్గువలెన్నుర్మె
    పువ్వులందు గనుము పుట్టె నగ్నిi

    రిప్లయితొలగించండి
  11. ఉ.

    నవ్వులు రువ్వుచున్ బడతి నాకము జూపగ బూల పాన్పుపై
    మువ్వలు రాలి జారినవి ముద్దుల వర్షము పెంపుమీఱగన్
    *బువ్వులలోనఁ దీవ్రముగఁ బుట్టిన దగ్ని యెదన్ రగుల్చుచున్*
    జివ్వున లేచి యేరితిని శింజిని భంగము మోజు తీరదే.

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    దివ్వెలు వెలిగించు దీపావళి దినాన
    ఇళ్లముందు చేరి పిల్లలంత
    కాల్చెడు సమయాన కాకర పువ్వొత్తి
    పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని.

    రిప్లయితొలగించండి
  13. దీపములవి యింట దేదీప్యకాంతితో
    వెలుగు చుండ పాప వేడ్కతోడ
    చిచ్చుబుడ్లు తెచ్చి శీఘ్రమె వెలిగింప
    *“పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని”*

    వేట కనుచు వచ్చి వెలదిని మోహించి
    మరలివత్తుననుచుమరచినట్టి
    పతిని పిదప గనిన పడతికన్నులనెడు
    *“పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని”*

    రిప్లయితొలగించండి