1, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4574

2-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్మశ్రువు గడు శోభఁ గూర్చెఁ జక్కని సతికిన్”
(లేదా...)
“శ్మశ్రువు  సుందరంబు గద జక్కని భామ కపోలమందునన్”
(నేమాని లక్ష్మీనరసింహ సోమయాజులు  గారికి ధన్యవాదాలతో...)

14 కామెంట్‌లు:

  1. విశ్రుతముగ నారుద్రకు
    శ్మశ్రువు గడు శోభఁ గూర్చెఁ; జక్కని సతికిన్
    విశ్రుతమైయొప్పదుగద
    శుశ్రూషణ శోభగూర్చు సుమనస్కులకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆశ్రమవాసియైనఋషి కద్భుత రీతి కపోలమందునన్
      విశ్రుత మైనదై తొలరు విజ్ఞతతో గమనించి చూడగా
      శ్మశ్రువు; సుందరంబు గద జక్కని భామ కపోలమందునన్
      మిశ్రిత వర్ణకాంతులిడు మేలగు హాటక భూషణంబులున్

      తొలగించండి
  2. అశ్రువులొల్కగరాదుగ
    మిశ్రంబగుజీవితంబుమీదేయగుగా
    సశ్రేయముశుభకరమగు
    శ్మశ్ర్రువుకడుశోభగూర్చెచక్కనిసతికిన్

    రిప్లయితొలగించండి
  3. అశ్రాంతము దన మగడు
    న్నాశ్రమ వాసంబు సేసి యద్భుత రీతిన్
    సుశ్రమ బెంచిన నిండగు
    శ్మశ్రువు గడు శోభ గూర్చె జక్కని సతికిన్

    రిప్లయితొలగించండి
  4. కం:
    విశ్రాంత వేళ మగడు త
    నశ్రీమతి ముఖమున దిద్దె నగుచును మీస
    మ్మశ్రువు లొలికెను హసమున
    శ్మశ్రువు గడు శోభఁ గూర్చెఁ జక్కని సతికిన్”

    రిప్లయితొలగించండి
  5. శ్మ శ్రువు పురుషుల కందము
    శ్మ శ్రువు పెంచుట సహజము సంఘము నందు న్
    శ్మ శ్రువు రాదు వని త కే
    శ్మ శ్రువు గడు శోభ గూర్చె జక్కని సతికి న్?

    రిప్లయితొలగించండి
  6. ఆశ్రమ మందలి పడతులు
    విశ్రమమున వేసెడి పలు వేషము లందున్
    ఆశ్రిత మగ కైసేతన
    శ్మశ్రువు గడు శోభఁ గూర్చెఁ జక్కని సతికిన్

    రిప్లయితొలగించండి
  7. విశ్రాంతిలేక పనులం
    దశ్రాంతమ్ముగ రసవతి నలసట నొందన్
    పస్రవణమెండి మోమున
    శ్మశ్రువు గడు శోభఁ గూర్చెఁజక్కని సతికిన్

    రిప్లయితొలగించండి

  8. విశ్రుతి గలిగిన యనిలి ని
    రాశ్రయు రాలగు సతికిని యభయమొసగి పా
    పాశ్రయు జేరు తరుణమున
    శ్మశ్రువు గడు శోభఁ గూర్చెఁ జక్కని సతికిన్.



    ఆశ్రయ మిచ్చినట్టి విరటాఖ్యుని పత్ని సహోదరుండు పా
    పాశ్రయుడైన కీచకుని యంతము జేయగ నెంచుచున్ భువిన్
    విశ్రుత మందినట్టి బలభీముడు కాంతగ రూపమెత్తగన్
    శ్మశ్రువు సుందరంబు గద జక్కని భామ కపోలమందునన్.

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. కందం
      ఆశ్రితఁ గోర దురితునకు
      విశ్రమమిడ వలలుఁడాడ వేషము మార్చన్
      శుశ్రూషల మాలిని యనె
      "శ్మశ్రువు గడు శోభఁ గూర్చెఁ జక్కని సతికిన్!"

      ఉత్పలమాల
      ఆశ్రితురాలు మాలిని నక్కునఁ గీచకుఁడెంచ వాడికన్
      విశ్రమమొందగన్ దలచి వేణియతో వలలుండు దీరఁగన్
      మిశ్రిత భావనన్ సతిగ మేలము లాడుచు కృష్ణ యిట్లనెన్,
      శ్మశ్రువు సుందరంబు గద జక్కని భామ కపోలమందునన్!

      తొలగించండి
  10. సుశ్రుత నామధేయ కడు సుందర మాయమ రూపురేఖలున్
    విశ్రుతిఁ గొన్న గొప్పనటి వేదికనెక్కి నటింప నాపెకున్
    విశ్రుతమై దనర్చె మగవేషము మీసముఁ వెట్టి వేయగన్
    శ్మశ్రువు సుందరంబు గద జక్కని భామ కపోలమందునన్

    రిప్లయితొలగించండి
  11. కం॥ విశ్రుతముగఁ బురుషులకన
    శ్మశ్రువు గడు శోభఁ గూర్చెఁ, జక్కని సతికిన్
    మిశ్రిత యాభరణమ్ములు
    విశ్రుత శోభనొదవుఁ గద విహితము నరయన్

    ఉ॥ ఆశ్రమ వాసులన్ గనిరొ యందమటంచును దల్చిరో ధరన్
    శ్మశ్రువుఁ బూరుషుల్ మిగుల శ్రద్ధగ పెంచగఁ దోచెనిట్టులన్
    శ్మశ్రువు సుందరంబు గద, జక్కని భామ కపోలమందునన్
    మిశ్రిత భూషణమ్ములన మేటిగ నొప్పును గాంతులీనుచున్

    రిప్లయితొలగించండి
  12. ఆశ్రమమందునయొజ్జకు
    శుశ్రూషలుచేయుతరినిసుకపోలంబున్
    నాశ్రమకుకారచెమటలు
    శ్మశ్రువుగడుశోభగూర్చెచక్కనిసతికిన్

    రిప్లయితొలగించండి