7, నవంబర్ 2023, మంగళవారం

దత్తపది - 205

8-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
క్రికెట్టు - టెన్నిసు - పోలో - హాకీ
పై పదాలను ప్రయోగిస్తూ
మహాభారతాంశంపై
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. చక్రికెట్టులదెలిపెనుచానకృష్ణ
  కొంటెన్ని సుమంతసాయముకోరెదీన
  తెచ్చెకోకలుపోలోకదేవవరుడు
  సభనహాకీలెఱిగినాడుదేవవరుడు

  రిప్లయితొలగించండి
 2. (కృష్ణ రాయబార మనంతరం సభాసదులతో దుర్యోధనుని అహంకార పూరిత మాటలుగా)

  పాండవులకు బంటెన్ని సుభాషితముల
  పలుకనేమిపో లోకుల వచన మంచు
  కృష్ణు డిచ్చినట్టి సలహా కీడొసంగు
  చక్రి కెట్టుల యోటమి సంభ వించు
  కర్ణుడతడు నాచెంతన గలడు గాదె.

  (ఇచట చక్రి= రారాజు)

  రిప్లయితొలగించండి


 3. తే.గీ:
  ఏల 'పోలో'నికనె, చ'క్రి కెట్టు' లెరుక?
  కష్టము లిచ'టెన్ని సు'మా మీకనుచు లేపి
  యంపె భీముని లక్కగృహమున గాంచ
  తప్పె కుంతి స'హా కీ'డు తనయులకును.

  రిప్లయితొలగించండి
 4. తే. గీ.

  చక్రి కెట్టుల మేవడి సలుపఁ గడిది
  అందుపాటెన్ని సుఖములు నంతరించె
  లోటు సౌభద్రుని గతి, పో! లోకమందు
  అమరె! హా! కీర్తి వరముగ నభిమరమున.

  రిప్లయితొలగించండి
 5. ధర్మరాజు తో నతని సోదరులు---

  చక్రికెటుల సమ్మతమగు : జ్ఞాతి తోడ
  జుదమాడ పో ! లోపము జూపి మనల
  కెరలు చుండు: వా ని సలహా కీలు నెరుగు
  ఓడు టెన్నిసుఖంబుల నుదలనగునొ

  రిప్లయితొలగించండి
 6. (చక్రి)కెట్టులైనను హాని సలుపఁ దలఁచు
  (టెన్ని సు)డుగొల్పు తెరువుల కిరవుగొలుపు
  క్రీడయని దలపకనె (హా! కీ)డు సేయ
  దలఁచె(పో లో)భియై రాజు చలము మీర

  రిప్లయితొలగించండి
 7. శిశు పాలుడు కృష్ణుని నింద జేసిన విధం --
  చక్రి కెట్టుల లభియించె సభను బదవి
  వాని కేల పో లోకాన వాసి యనుచు
  పలికె గద నహా కీ డది పర్వె ననుచు
  పలు వి ధా ల తిట్టె న్ని సు మంత భయము లేక

  రిప్లయితొలగించండి
 8. కృష్ణుడు సంధి కొరకు వెళ్ళినపుడు విదురిని మనస్థితి (మ్రింగ లేక కక్క లేక)

  తే॥ చక్రి కెట్టులఁ దెల్పుదు సంధి పొసఁగ
  దనుచు మాటెన్ని సులభశైలిని పలుకఁగ
  నిచటఁ దప్పు మహాకీడు నీచుల వల
  నయనిఁ దెలిపితిపో లోపమె యగు నాది

  ఇది చాలా కష్టమనిపించిందండి

  రిప్లయితొలగించండి
 9. చ(క్రి కెట్టు) లెరుక వేగ చక్కదిద్దు
  (టెన్ని సు)డుల జిక్కిన పాండవేయులౌర
  తెలిసె(పో లో)కరక్షకు తెరగు నిజము
  ధరుడ(హా కీ)డు రానీడు ధార్మికులకు

  రిప్లయితొలగించండి
 10. ధర్మజునితో శిశుపాలుడు:

  తేటగీతి
  ధర్మజా! చక్రికెట్టుల దగును పూజ?
  కట్టుబాటెన్ని సుమతుల పట్టవలయు
  వాడెపో లోలుడై స్త్రీలఁ గూడు దొంగ!
  కేడనెంచమను సలహా కీడొనర్చు!

  రిప్లయితొలగించండి
 11. సుయోధనుడు కర్ణునితో
  చక్రికెట్టులైన నవజ్ఞ సలుప వలయు
  పోరుటెన్ని సుఖమ్ముల పొందవలయు
  గెలుపెపో లోకములలోన విలువ పెంచు
  ఆహహా కీర్తి సమకూరు ననిని గెలువ

  రిప్లయితొలగించండి

 12. చ"క్రికెట్టు"ల తెలుపంగ సాధ్యమవును
  తెలిసె "పోలో"మది నరసితీరుగాను
  చేయు గో"టెన్ని సు"లభాన చిత్తమందు
  తలచెతాన"హా, కీ"డౌను కూళునకట

  రిప్లయితొలగించండి