3, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4576

4-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె”
(లేదా...)
“జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ”

19 కామెంట్‌లు:


  1. ప్రాణకోటికిలను పలురోగములు జేరు
    మందులేని వెన్నొ యందు గలవు
    జకులమునకు జేర జలభీతి వ్యాధితో
    జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె.

    రిప్లయితొలగించండి
  2. చిట్టి మొక్కనొకటి మట్టిలోపల నాట
    పెరుగు పచ్చ గాను యెరువు నీరు
    కరువు దీర నొసగ, కలుషిత మగువిష
    జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె.

    రిప్లయితొలగించండి

  3. పలువిధ రోగముల్ ముసురు పాళము నందున సాధనమ్ములే
    ఫలతము నివ్వలేని పలు వ్యాధులలో జల భీతి వ్యాధి జా
    గిలమునకంటు రోగమది కీడది జాతికి నట్టి వేళలో
    జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ.

    రిప్లయితొలగించండి
  4. సరసులోనినీరు చవిగొన నెంచిన
    యక్షుడడుగు ప్రశ్న తక్షణంబు
    ప్రశ్నకు బదులిడని ప్రాణి యకట!
    జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సలిలము గ్రోలగావలెను చప్పున దప్పిక తీర్చనెంచినన్
      మలినము లేని కృత్స్నమును మాత్రమె పానముచేయగావలెన్
      కలుషము కాలకూటమయి క్షత్రపు రూపును మార్చివేయ నా
      జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ

      తొలగించండి
  5. పశువు మేత కొరకు పరికించు చుండగ
    దారి కిరువయిపుల దనరు వాటి
    పూవులను గనగనె ముచ్చట పడుచు హి
    జ్జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె

    రిప్లయితొలగించండి
  6. కరుకుటెండలోన గల్గినదాహర్తి
    జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె
    దరుసులేక దోచు ధనదాహ పరునకు
    సంపదెంతయున్న చాలబోదు

    రిప్లయితొలగించండి
  7. మేత మేయు చున్న మేకకు దాహమ్ము
    గలుగ గానె గాంచె కొలను నొకటి
    వేగ వెడలి తాను విషము గలిసి నట్టి
    జలము గ్రోలి నంత జచ్చు నది యె

    రిప్లయితొలగించండి
  8. జలమన జీవరాసులకు సర్వము ప్రాణము నిల్పు పేత్వమా
    జలమును వీడి చేప మనజాలదుగా క్షణమైన భూమిపై
    జలమున మున్గి మానవుడు జంకున తత్తరపాటు నొందుచున్
    జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ

    రిప్లయితొలగించండి
  9. ఆ॥ వెల్లివిరిసె నేఁడు వివిధ పరిశ్రమల్
    వాటి నీటివలన మేటి నీటి
    వనరులు చెడిపోయి పాషాణమాయెనా
    జలముఁ గ్రోలినంత చచ్చు నదియె

    చం॥ సలిలము శుద్ధమైనపుడు చక్కన త్రాగుట కన్ని ప్రాణులున్
    మలినము గాఁగ నీరు విషమై చను, నేఁడు పరిశ్రమాదులున్
    బులుమఁగఁ ద్రాగు తోయమునఁ బూర్ణముగా మలినమ్ములిట్లు నా
    జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ!

    Perhaps a necessary evil of modern day (మా బెంగళూరులో చెఱువులన్ని కలుషితమేనండి)

    రిప్లయితొలగించండి
  10. చం.

    చెలువము స్నానమాచరణ సిద్ధిని బుద్ధిని స్వాస్థ్యమిచ్చెడిన్
    గలయగ పెంట, క్రుళ్లినవి, కాంచుచు వాహినిలో విగాహమే
    బులుపు, శిరస్సుపై మురికి, మోమున వ్యాపనమయ్యె క్ష్వేడమౌ
    *జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ.*

    రిప్లయితొలగించండి
  11. దోమ బారి నుండి దొలగంగ జేయఁగ
    మందుఁజల్ల రంగు మారి నీరు
    కలుషితంబు నగుచు గరళమై కనగనా
    జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె

    రిప్లయితొలగించండి
  12. ఆటవెలది
    పంచభూతమయము నంచితముగ సృష్టి
    జలమునందు పుట్టు జ్వాలయనఁగ
    గాలి యూతమగుచు క్రమ్మి యావిరియౌచు
    జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె

    చంపకమాల
    వెలసెను పంచభూతములు విశ్వము నందున గూడినన్నిటన్
    జలమున పుట్టి జ్వాలయన సర్వము భక్షణ జేయగల్గెడున్
    జ్వలనము గాలి యూతముగ బగ్గున మండుచు నావిరౌచు నా
    జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా! యది దాని తత్త్వమౌ!

    రిప్లయితొలగించండి
  13. తెలివగు ప్రాణులంబనుచు తేలిక మాటల దేలియాడుచున్
    తలపక వైపరీత్యముల వ్యర్థములన్నియు సాగరంబునన్
    కలుపగ కాలకూటముగ మారెనెరుంగని మత్స్యమయ్యయో
    జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (సవరించిన పూరణ)
      తెలివిగ యంత్రముల్ నరులు దెచ్చి పరిశ్రమ లూలుకొల్పినన్
      తలపక వైపరీత్యముల, వ్యర్థములన్నియు సాగరంబునన్
      కలుపగ, కాలకూటముగ మారెనెరుంగని మత్స్యమయ్యయో
      జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ

      తొలగించండి
  14. జలమున దాగియుండునది జాలరి జాలముఁ చిక్కనట్టిదిన్
    జలధిన పుట్టినట్టిదిది స్వాదముజిహ్వకు నిచ్చునద్దియున్
    గలదిది వంటలన్నిటను కానగరాక గుణమ్ము జూపుచున్
    జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ

    రిప్లయితొలగించండి
  15. జలము కాదు జనుల జర్జరుల నొనర్చు
    కాలకూట విషము కలుష మయము
    యేనుగైన గాని పీనుగై తీరును
    జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె

    రిప్లయితొలగించండి