5, నవంబర్ 2023, ఆదివారం

సమస్య - 4578

6-11-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిష్టులకు ధూర్తచర్యయె శ్రేష్ఠమగును”
(లేదా...)
“చెల్లును ధూర్తవర్తనము శిష్టులకున్ సభలందు శ్రేష్ఠమై”

14 కామెంట్‌లు:

 1. రాజకీయములందున రాజనీతి
  ప్రస్ఫుటించును నేతల వర్తనమున
  విచ్చలవిడి తెగువచూపు భృత్యగణము
  శిష్టులకు ధూర్తచర్యయె శ్రేష్ఠమగును

  కల్లలు చెప్పుచుంద్రు గద కత్తులు దూయుచు ధూర్తనేతలే
  కొల్లరియొద్దనున్న మరి కొందరు వ్యక్తులు పాలెకాపులై
  చెల్లనిమాటలన్ చెవులు చిల్లులు పుచ్చగ వ్యాప్తిచేయరే
  చెల్లును ధూర్తవర్తనము శిష్టులకున్ సభలందు శ్రేష్ఠమై

  రిప్లయితొలగించండి
 2. తేటగీతి
  ద్వార పాలకుల్ శాపాన వైరులగుచు
  తిరిగి శ్రీహరిఁ జేరెడు వరము నంద
  పొల్లు పోనట్టి నడతలఁ బూర్వజన్మ
  శిష్టులకు ధూర్తచర్యయె శ్రేష్ఠమగును

  ఉత్పలమాల
  అల్లన ద్వారపాలకులు నాఱడి శాపమునొంది వైరులై
  యుల్లము నొప్పకున్న పరమోన్నతుఁ జేరెడు జన్మలెత్తఁగన్
  పొల్లొనఁ గూరదన్ నడత పుష్కరనాభుని ముందు జూపినన్
  జెల్లును ధూర్తవర్తనము శిష్టులకున్ సభలందు శ్రేష్ఠమై!

  రిప్లయితొలగించండి
 3. తప్పు జేయుచుండెడి వారి దారిమార్చ
  నేమి జేసినప్పటికిని యిమ్మెయగును
  నష్టమొసగెడి కార్యము నడపబోవు
  శిష్టులకు ధూర్తచర్యయె శ్రేష్ఠమగును

  రిప్లయితొలగించండి
 4. ఉ.

  ముల్లును బోలు వాక్యములు మూర్ఖుల వోలె వచింప రుక్మియున్
  బెల్లుఁ గళింగరాజు, నగి, బెట్టున నా బలరాముఁ బ్రబ్బెడిన్
  *జెల్లును ధూర్తవర్తనము శిష్టులకున్ సభలందు శ్రేష్ఠమై*
  ఘొల్లున నేడ్చి చచ్చిరట గొట్టగ రోకలితో విదర్భలో.

  రిప్లయితొలగించండి

 5. చక్రము భువలో క్రుంగిన సమయ మందు
  నాయుధమునుసంధించుట యక్రమమన
  ధర్మము నిలుప నొకపుడు ధరణని గన
  శిష్టులకు ధూర్తచర్యయె శ్రేష్ఠమగును.  మల్లెల బోలు స్వచ్ఛమగు మానస ముండిన సద్గుణాత్ముడం
  చెల్లెడ గారవించబడి హెచ్చుగ లోకము గీర్తి నందగా
  నుల్లము నందు కోరిక మహోన్నత మున్ నెలకోన్న నెవ్విధిన్
  చెల్లును ధూర్తవర్తనము, శిష్టులకున్ సభలందు శ్రేష్ఠమై.

  రిప్లయితొలగించండి
 6. నిండు సభ యందు కృష్ణుని ని ష్టు రముగ
  దూషణ o బుల నొనరించె దుష్టు డ గుచు
  నట్టి. వానిని గాంచియు నని రి. కపట
  శి ష్టు ల కు. దూర్త చర్య యె శ్రే ష్ట మగును

  రిప్లయితొలగించండి
 7. క్రూర జంతువునొకదాని కూర్మితోడ
  సంశ్రయమునివ్వ మానునే సహజగుణము
  కూళ క్షుళ్ళక కుత్సిత క్షుద్రగుణ వి
  శిష్టులకు ధూర్తచర్యయె శ్రేష్ఠమగును

  రిప్లయితొలగించండి
 8. తే॥ శుక్రనీతి చెల్లునెపుడు వక్ర బుద్ధి
  గాదు సక్రమమే యది గనఁగ నేఁడు
  శిష్టులకు ధూర్తచర్యయె శ్రేష్ఠమగును
  సర్వ జనహితముఁ బడయ సత్యముగను

  ఉ॥ కల్లల నాడుచున్ ఘనులు గాంచఁగ మోసము లెన్నియో యిటుల్
  చల్లఁగ రాజకీయమున సర్వ జనాళిని మభ్యపెట్టుచున్
  ముల్లును ముల్లుతోఁ దొలచ మోదమె యెంచఁగ శుక్ర నీతియున్
  జెల్లును ధూర్తవర్తనము శిష్టులకున్ సభలందు శ్రేష్ఠమై

  రిప్లయితొలగించండి


 9. మురహరుని కథలు వినిన మోదమగును
  *శిష్టులకు;ధూర్తచర్యయె శ్రేష్టు మగును*
  దుష్ట బుద్ధితో తిరిగెడు దుష్టుల కిల
  శిక్షవేయవలయుజాగుచేయకుండ.

  ముల్లులవంటిమాటలనుమూర్ఖతతోసతమాడశిక్షలున్
  *“చెల్లును ధూర్తవర్తనము, శిష్టులకున్ సభలందు శ్రేష్ఠమై”*
  నెల్లరు మెచ్చు రీతిగను నిమ్ముగ నొప్పును గారవించినన్
  నెల్లరు సంతసించు చును నెమ్మిని చూపుచునుందురెప్పుడున్.

  రిప్లయితొలగించండి
 10. అల్లన యబ్ధిదాటి హరి యావలి తీరము డాసి లంకలో
  మెల్లన సీతజాడఁ గని మిక్కిలి మోదము గూర్చె మాతకున్
  పల్లటమొంద రక్కసులు వాలముఁ గాల్చఁగ గాల్చె లంకనున్
  చెల్లును ధూర్తవర్తనము శిష్టులకున్ సభలందు శ్రేష్ఠమై

  రిప్లయితొలగించండి
 11. రామకార్యము నెరవేర్చ లాఘవముగ
  జలధి లంఘించి మారుతి జానకిఁగని
  రాము సేమము నెరిగించి లంకఁ గాల్చె
  శిష్టులకు ధూర్తచర్యయె శ్రేష్ఠమగును

  రిప్లయితొలగించండి

 12. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  బుధుల ప్రవచనములిడును పూర్తి తృప్తి
  శిష్టులకు; ధూర్త చర్యయె శ్రేష్ఠ మగును
  ధూర్త లక్షణముల తోడ దూరుచుండి
  దుష్ట బుద్ధిని వర్తించు దుష్టులకును.

  రిప్లయితొలగించండి