30, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4601

1-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్”
(లేదా...)
“కలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్”

20 కామెంట్‌లు:

  1. అలరించె మధుర కవితల
    చలచిత్రము లందున సరసమ్మగు రీతిన్
    విలువలు చెడిపోవుటచే
    కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్”

    రిప్లయితొలగించండి
  2. నెలకొల్పెనుతాన్ బ్లా
    గులనంతర్జాలమందు కొల్లగ పద్య
    మ్ములు పలు కవితల్ వ్రాసెను
    కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  3. కులములనుచు లోకుల కల
    కలమును త్యజియించి , కనె సుకవిగ యశమ్మున్
    యీలోకమంత మానవ
    కులమొకటె యనుచు గవితలు గూర్మిగ వ్రాయన్

    రిప్లయితొలగించండి
  4. కం॥ సులభమగు శైలినిఁ బడసి
    సలలిత కావ్యములు వ్రాసి చాలనిఁ దోచన్
    వలచుచు సమాజ సేవను
    గలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్

    చం॥ సలలిత కావ్యరాజములు సర్వులు నర్థముఁ గాంచు శైలితోఁ
    బలుకులఁ దేనియల్ బొదవి పాటవ మొప్పఁగ వ్రాసి చాలనిన్
    వలచి సమాజ సేవనము వార్ధకమందు చరించఁ బ్రీతిగన్
    గలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్

    రిప్లయితొలగించండి
  5. కలనైన తెలుగు భాషను
    బలముగ ప్రేమించవాడు పఠియించికడున్
    కలమును జేకొని వ్రాసి స
    కలమును త్యజియించి, గనె సుకవి
    యశమ్మున్

    రిప్లయితొలగించండి
  6. అలరారు కైతలల్లుచు
    విలసిత రాజాశ్రయమున విక్రీడితుఁడై
    తలచియశాశ్వతములని స
    కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్

    రిప్లయితొలగించండి
  7. కందం
    పిలువఁగ రైతింటికరిగి
    పలు పద్యములల్ల మురిసి పరవశమున కా
    న్కల తోడ నిడఁగఁ దండుల
    కలమును, త్యజియించి కనె సుకవిగ యశమ్మున్!

    చంపకమాల
    పిలువఁగ రైతు సోదరుడు, వీనుల విందొనరించి చంపక
    మ్ముల గణుతించి పద్యసుధ ముచ్చట బంచగ మెచ్చి వారు కా
    న్కలనిడి మేటి ధాన్యసిరిఁ గావడి గట్టుచు నందఁ జేయఁగన్
    గలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్!

    రిప్లయితొలగించండి

  8. పలువిధ శాస్త్రము లెరుగు బు
    ధిలుడాతడు సాటిలేని ధీరుండనుచున్
    బలువురు మెచ్చ వధానిగ
    కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్.



    వలదిక కాగితమ్ములును వ్రాయగ ఘంటమదేల యంచు తాన్
    దలపుల లోని భావముల ధాటిగ పద్యపు రూపమందునన్
    పలువురు మెచ్చురీతిని సభాంతరమందున నాలపించుచున్
    కలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్.

    రిప్లయితొలగించండి
  9. చం.

    సులువుగ నేర్వ వ్యాకరణ సూత్రము శ్రేష్ఠ నిఘంటువుల్ శ్రమన్
    విలవిలలాడి యొజ్జఁ గని ప్రేమగ భక్తిగ శిష్యుడయ్యె, నే
    *కలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్*
    గలిగె వధానిగా యశము గమ్యముఁ జేరెను శ్రద్ధఁ జూపగన్.

    .......
    ఏకలము = అసహాయము.

    రిప్లయితొలగించండి
  10. “కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్”
    (లేదా...)
    “కలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్”

    కం॥
    నెలకొల్పెనుతాన్ బ్లా
    గులనంతర్జాలమందు కొల్లగ పద్య
    మ్ములు పలు కవితల్ వ్రాసెను
    కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్

    గాదిరాజు మధుసూదన రాజు

    చం॥
    చెలగెనుదిగ్గజంబనవిశిష్టకవిత్వవిధానపుష్టిచే
    నిలిచెనుమేటియౌచుగణనీయరసాంచితభావవృష్టిచే
    తలపఁఘనుండటంచునవధానమునందునుతింపనాతడిన్

    కలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  11. కలకూజిత సన్నిభమౌ
    గళమును సవరించి యాశు కవితలుచదువన్
    చెలఁగిరి యభిమానులు, తన
    కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్

    రిప్లయితొలగించండి
  12. సలలితముగ నవ కవితలఁ
    నలవోకగ వ్రాయనెంచి యద్భుత రీతిన్
    చెలువఁపు సెల్ఫోనును గొని
    కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్

    రిప్లయితొలగించండి
  13. తలమానికమైన కవికి
    తలపొగరేనని తలచిరి తత్కాలములో
    నలవోకగ నాతడు మొ
    క్కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్

    [మొక్కలము - గర్వము]

    కలమును పట్టకుండునట కమ్మని కావ్యము వెల్వరించగా
    తలచిన పద్య గద్యములఁ దానువచింపగ శిష్యులెల్లవే
    ళల లిఖియింత్రు భద్రముగ లౌకికులేగని మెచ్చురీతిగా
    కలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్

    రిప్లయితొలగించండి
  14. తలపున జనించు కథతో
    విలసిత కావ్యమ్ము గాగ వెలసిన బిద పన్
    గలిగిన విరక్తి వలనన్
    కలమును త్యజించి కనె సుకవిగ యశ మ్ము న్

    రిప్లయితొలగించండి
  15. కలమును కాగితమ్ములను కైతలకైనుపయుక్తమొందఁ నా
    కులమగు గంటమున్ విడచి కూరిమినుండిరి నాటి సత్కవుల్
    కలవరపాటులేకిపుడు కంప్యుటరమ్మనునమ్మి వేడ్కతో
    కలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్

    రిప్లయితొలగించండి
  16. తలపునమెదలిన సుందర
    సులలితభావనలనెల్లసులువుగదెల్పె
    న్నలవోకగపాడుచుతన
    *"కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్”


    రిప్లయితొలగించండి