16, జనవరి 2024, మంగళవారం

దత్తపది - 206

17-1-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
కాక - తాత - నాన - మామ
పై పదాలతో రామాయణార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

35 కామెంట్‌లు:

  1. రామునుసీతగాకనుమరాజసమొప్పిన జంటనీభువిన్
    నీమముతాతరించెదరు నేరిచినామమునుచ్చరించినన్
    ధామముచేరువౌనునటనానగచిత్తమురామునందునన్
    వేమరుభావమామనసువేగమనిల్పుమువిష్ణువాతడే

    రిప్లయితొలగించండి
  2. హనుమ లంకను గాల్చిన విధము విభీషణుడు రావణునకు దెలుపుచూ....

    కందం
    కాక రగిలించి నిప్పిడ
    తోక కెగసి యప్పుతాతఁ దూకొని లంకన్
    దూకి నిరుపమానాన, వి
    లోకించి రమామణిఁ గుజ, రొప్పుచు గాల్చెన్

    రిప్లయితొలగించండి


  3. *(బంగరు జింకను కోరిన సీతను వారిస్తూ ముందు శ్రీరాముడు పలికిన మాటలుగా.....)*

    కాంచుమా మనోహరమంచు గాలిమెకము
    గోరగ తగునా నళినాక్షి గోర మిందు
    దాగినను దాగియుండు సీతా తగదిట
    స్వర్ణ మృగము మోసము కాక సత్యమగునె.

    రిప్లయితొలగించండి
  4. కుశలవులు తల్లితో

    వశ యడుగు 'నాన' మాలిన వరమును విని
    'తాత' హెచ్చుగ శోకించి తాల్మి వీడి
    మరణ మొందుట వినినంత 'మామ' నసుల
    'కాక' పుట్టును కద యని కవలలనిరి

    రిప్లయితొలగించండి
  5. హనుమ కాకలు దీరిన నసుర తతుల
    తా తరిమి కొట్టె లంకలో దర్ప మలర
    నాన మే లేక తోకకు ననలమిడ గ
    కాల్చె మామక గృహ మని కనలె నొకడు

    రిప్లయితొలగించండి
  6. కంది వారి బ్లాగు సమస్యాపూరణము శంకరాభరణమున ఐదే పూరణలా? వాట్ ఎ పిటీ! ఏమైనారు కవీశ్వరులిచట!


    ఓమాతా ! తల్కమునకు
    మామాటగ తరలమనుచు మనుజేంద్రుండే
    నీమమిడిరి నా నమ్మిక,
    వేమార్లును కోరుగాక వెడలెద నెపుడున్



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది వా రింకా రాసినవే చూడ లేదు.

      తొలగించండి
    2. బాగుంది. కాకుంటే 'మామ' తప్పింది.
      కవీశ్వరులకేం... ఎందరో ఉన్నారు. శంకరాభరణంలో పూరణ పద్యాల సంఖ్య తగ్గడానికి నేను కారకుడను. కొంత కాలం క్రితం పనుల ఒత్తిడి, అనారోగ్యం, ప్రయాణాలు తదితర కారణాల వల్ల మిత్రుల పద్యాలపై స్పందించలేకపోయాను. ఈమధ్య స్పందించబోతే ఏదో సాంకేతిక కారణం వల్ల ఆటకం వస్తున్నది. ఎవరైనా పద్యాన్ని పోస్ట్ చేసినప్పుడు స్పందనను ఆశిస్తారు. కొంతకాలంగా నా స్పందనలు లేకపోయే సరికి ఉత్సాహం తగ్గిన కవులు పూరణలు చేయడం మానుకున్నట్టున్నారు. ఈరోజే ఆ ఆటకం తొలగిపోయింది. ఇక నుండి తప్పకుండా ఎప్పటికప్పుడు నా సమీక్షలు పోస్ట్ చేస్తూ ఉంటాను.

      తొలగించండి
  7. సుగ్రీవుఁడు శ్రీరామునితో:

    కాఁకవెలుంగు వంశ తిలకా! భరతాగ్రజ! రామచంద్ర! నా
    సేకము దీర్చి వాలిఁ వధ చేసిన నీ ఘన తాతనమ్మునున్
    నీకరుణార్ద్ర వీక్షణము నిత్యము మా మనమందు నెక్కొనన్
    వీఁక ధరాత్మజన్ వెదకి వేదన దీర్చెద నానతిమ్మికన్

    తాతనము=వ్యక్తిత్వము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'ఘనతాతనమ్ము' ?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారము. ఘన తాతనము అంటే ఘనమైన వ్యక్తిత్వం అని నా భావనమండి. పొసగకపోతే నీదగు తాతనమ్మును అని మార్చుకొంటానండి. 🙏

      తొలగించండి
  8. కైకేయి వరములు కోరిన పిదప కట్టలు తెగుతున్న దశరథుని శోకము కైకను నిందించుట

    ఉ॥ కాకలుతీరి కాటికిని కాలును జాచిన వృద్ధునిన్ ననున్
    శోకము నందు ముంచితివి చూడవ మామన సెంత నొచ్చెనో
    చేకొని యట్లు తాతరుణి సీతను రాముఁడు దూరమైనచో
    నాకిఁక జీవమేల సఖి నానను వీడితి వీవు కోర్కెలన్

    నాన సిగ్గు నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'తాన్ + తరుణి = తాఁ దరుణి' అవుతుంది.

      తొలగించండి
    2. ధన్యవాదములండి. పూరణ తరువాత అర్థమైనది. మార్చలేక పోయినానండి

      తొలగించండి
    3. ఉ॥ కాకలుతీరి కాటికిని కాలును జాచిన వృద్ధునిన్ ననున్
      శోకము నందు ముంచితివి చూడవ మామన సెంత నొచ్చెనో
      తాకెను దుఃఖ సాగరము తాతగ మారు వయస్సు పైఁబడన్
      నాకిఁక జీవమేల సఖి నానను వీడితి వీవు కోర్కెలన్

      చిన్న మార్పు చేసి సవరించాను. కాని పెద్దగా నచ్చలేదండి. సాగరము తరువాత ద్రుతము రాదని నమ్ముతున్నానండి

      తొలగించండి
  9. కాక-తాత-నాన-మామ
    శా:సీతా!తగ్గుము,ఘోర మైన వనికిన్ స్త్రీ లేల,నీ తండ్రి జా
    మాతన్ నింద నొనర్ప జేయకు సుమా!మర్యాద పాటించి నా
    మాతన్,దండ్రిని జూడ జాలు,నదె ధర్మంబౌను,కైకా కర
    మ్మే తప్పించుట రాజ్య భారము వరమ్మే,దక్కు నానంద మే.
    (దత్త పదాలు అన్యార్థం లో ఉపయోగించ బడినాయి. )

    రిప్లయితొలగించండి
  10. వితతము కాకమ్మేఁపఁగ
    సత తాతత సద్గుణ నిధి సచ్చారిత్రం
    బతి రత భామా మణినిన్
    సతి నా నర వరుఁడు వాయసపుఁ గను గాల్చెన్

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. సవరణతో....

      కేకఁ వెట్ట మారీచుడు కాక పుట్ట
      సీత తాతనము మిగుల చిక్కులపడి
      సాయపడమని తానాన తిచ్చి పంపె
      తరలుమా మఱది యనుచు త్వరితగతిని

      తొలగించండి
  12. కౌశి'కా! క'నుఁగొనఁ బసికందితండు
    వర్షపా'తాత'ప దనుజ బాధలు గల
    కాననములఁ బంపుదు'నా? న'యాన నిపుడు
    'మామ'కీన పుత్రు నడుగ మానుమయ్య!

    రిప్లయితొలగించండి
  13. ఎందు*కాక*లతయుమీకు నేగుచిపుడె
    వాయుగమ*నాన*తెచ్చునుపావమాని
    యౌషధమునమ్ము*మామ*దిన్ హరిణమట్లు
    *తాత*డయకవచ్చనిజాంబవంతుడచట

    రిప్లయితొలగించండి