24, జనవరి 2024, బుధవారం

సమస్య - 4655

25-1-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దోమను మనువాడి కరి ముద్దుల నొసంగె”
(లేదా...)
“దోమను బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరం బహో”
(కవిశ్రీ సత్తిబాబు గారికి ధన్యవాదాలతో...)

27 కామెంట్‌లు:

 1. సరస, సంగీత నాట్యాన సంగ మించి
  కపటమెంచనిభోగంపు కన్య చిన్న
  యమ్మనువివాహమాడెగారాయలపుడు
  దోమనుమనువాడికరిముద్దులనొసంగె

  రిప్లయితొలగించండి
 2. తేటగీతి
  వనవిహారము నెంచియు తనను గూడ
  కన్నె యేనుగు తా మందగమనమందు
  బండజారి పాదము పాన పడఁగ కాలిఁ
  దోమను, మనువాడి కరి ముద్దుల నొసంగె!


  ఉత్పలమాల
  ఆమనివేళలో జలకమాడియు జంట విహారమెంచఁగన్
  బ్రేమగ యా వనాన, శిల వేగమె పాదము పైన దొర్లగన్
  భామిని యాడ యేనుగు చివాలున తొండము జాపి కాలినిన్
  దోమను, బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరం బహో!

  రిప్లయితొలగించండి

 3. అర్థమన్నది లేనట్టి యాంగ్ల చిత్ర
  ము గని తికమక పడిరంట యుర్వి జనులు
  దవములో జంతువులె పాత్ర ధారు లందు
  దోమను మనువాడి కరి ముద్దుల నొసంగె.


  పాములు తీక్ష్ణతుండములు భార్గవమాదిగ జంతు జాలమే
  భూమికలైన చిత్రమది మోజుగ బాలుర కోసమంచు నో
  ధీమతి యైన దర్శకుడు తీసిన కల్పిత గాథయందునన్
  దోమను బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరం బహో.

  రిప్లయితొలగించండి
 4. అతులమగు సుకుమారి యా యంబుజాక్షి
  యాతడొక బండ మోటువాడామె పైన
  మోజుపడి వెంటపడి రోజు రోజు కడకు
  దోమను మనువాడి కరి ముద్దుల నొసంగె

  రిప్లయితొలగించండి

 5. పెంటి మశకము పలు గ్రుడ్లుపెట్టెను మగ
  దోమను మనువాడి ; కరి ముద్దుల నొసంగె
  దుహితలకు పెరిమగ తన తుండతోడ
  పుట్టుకలు వేరె , జీవన పోడిమొకటె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   'తుండతోడ' ముప్రత్యయం లేకుండా ప్రయోగించరాదు కదా! 'పోడిమి + ఒకటె' అన్నపుడు సంధి లేదు.

   తొలగించండి
 6. -

  కుట్టినన్ తప్పదా డ్యెంగు ! కోరి వెన్క
  పడుచు ఝుంకారముల తోడు పాటపాడు
  దోమను మనువాడి కరి ముద్దుల నొసంగె
  కుంజరుడు జొచ్చెనా దోమకుత్తుకనదె!


  రిప్లయితొలగించండి
 7. దోమ యొకటి కరి చెవిలో దూరి రొదను
  సేయ తాళ గ లేకను సేమ మరసి
  దోమను మను వాడి కరి ముద్దుల నొసంగె
  దాని నంతము జేసెను దయను వీడి

  రిప్లయితొలగించండి
 8. -

  ఆమని కోయిలక్కొ? తన దాత్మకు స్నేహితురాలొ? ఝుంకృతిన్
  దామన సందు లేపె సుడులన్ ముదమారగ నుగ్గడింపగా
  ప్రేమయె కొల్లగొట్టె హృది; పేర్మిని చూపుచు చిన్ని ప్రాణియౌ
  దోమను బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరంబహో!


  జిలే బియర్స్ :)

  రిప్లయితొలగించండి
 9. భామిని సౌకుమార్యమును వన్నెలుచిన్నెలు గాంచి యర్మిలిన్
  భీమునివోలె కండలను పెంచిన యేనుఁగు సాటివాడు తా
  నామెను జేరి నెమ్మనమునందలి యాదట దెల్పి మేకొనన్
  దోమను బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరం బహో

  రిప్లయితొలగించండి
 10. సామజమున్ బోలు బలిమి
  ధీమంతునిసొంతమనుచు తిలకించినదై
  ప్రేమను చూపగ దుర్బల
  దోమను మనువాడి కరి ముద్దుల నొసంగె

  సామజమే కదాయనుచు సర్వులు మెత్తురు వాని శక్తినే
  భామిని చేరవచ్చెనట వానిని భర్తగ పొంద నిచ్చతో
  దోమను బోలుచుండు నట తొయ్యలి ప్రాణము నెంచి చూడగా
  దోమను బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరం బహో

  రిప్లయితొలగించండి
 11. తే॥ చక్రవర్తిగా ఘనకీర్తి జనుల క్షేమ
  మరసి పొందిన నచ్చిన యతివ యనుచుఁ
  బల్లె పడుచును మనువాడఁ బదుగు రనిరి
  దోమను మనువాడి కరిముద్దుల నొసంగె

  ఉ॥ భూమిని యేలు రాజతఁడు బుద్ధిని నిల్పి జనాళి క్షేమమున్
  నేమము తోడఁ గాంచుచును నిత్యము బాసట యౌచు సాగుచున్
  బ్రేమగఁ బల్లె కన్యకను బెండిలి యాడఁగఁ బల్కిరెల్లరున్
  దోమను బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరంబహో

  రిప్లయితొలగించండి
 12. తే.గీ:కరిణి తన పైన బ్రేమను గలిగి యుండ
  దాని జత గోరి, మావటీ డాన తీయ
  తుండమును జాపి తనువెల్ల నిండు ప్రేమ
  దోమను మను వాడి కరి ముద్దుల నొసంగె
  (మగ ఏనుగు మీద ఒక ఆడ ఏనుగుకి ప్రేమ కలిగింది.మరి పెళ్లి అంటే మావటీడు దాన్ని ఒప్పుకోవటమే. ప్రేమ+తోమను=ప్రేమ దోమను.సరళాదేశం)

  రిప్లయితొలగించండి
 13. ఉ:దోమ చికాకు వెట్ట ,తన తొండమునన్ విదిలించుచుండ నా
  దోమయు తన్ను వీడకయు,తోడగు హస్తిని వచ్చి చంప నా
  దోమను ,బెండ్లి యాడి కను దోయిని ముద్దిడె కుంజర మ్మహో
  ప్రేమను పొందనీక జడిపించెడు మావటివాని భీతి చేన్.
  (ఒక దోమ తనని చికాకు పెడుతుంటే ఒక ఆడ ఏనుగు ఆ దోమని చంపింది.మగ ఏనుగు కృతజ్ఞతతో ఆ ఆడ ఏనుగుని కంటి చూపుతోనే పెళ్లి చేసుకొని ముద్దు పెట్టుకుంది.ప్రేమ సాగనివ్వని మావటి వాడి భయం తో.)

  రిప్లయితొలగించండి
 14. దైవ లీలల నెన్నంగఁ దరమె నరుల
  కౌర! కాకులు దూఱని ఘోర కాన
  నమ్ము నందొక్క మద కుంజరమ్ము చంపి
  దోమను మనువాడి కరి ముద్దుల నొసంగె


  ధామము కొండ సాను వట దాన జలమ్ము స్రవించు నిత్యమున్
  సామజ రాజు చుట్టు నిభ సంఘము తిర్గుచు నుండు రక్తినిం
  బ్రేమ సెలంగ డాయఁగఁ గరేణువు నత్తఱి నెమ్మిఁ దోలి పె
  న్దోమను బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరం బహో

  రిప్లయితొలగించండి

 15. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  నాతి యొక్కతె దోమగా నాటకమున
  పాత్ర ధరియించ,సామజ పాత్ర నొకడు
  వేయ, నిరువురి మధ్యను ప్రేమ తొడగ
  దోమను మనువాడి కరి ముద్దులనొసగెను.

  రిప్లయితొలగించండి