ఉంకు అనగా సమ్మతి ఎగురు అర్థాలున్నాయండి. కాని మనము తెలుగులో ఎప్పుడు అన్యదేశ్యమైనా ఓటు అనే పలుకుతున్నామండి. ఉంకు ఎన్ను ఇలాంటి పదాలు ప్రాచుర్యంలో లేవుమరి. అదే కన్నడలో అచ్చు కన్నడ పదము మత ఉంది ఓటుకు. మత ఎక్కువగనే వాడుతారు. మతనీడు (cast vote) మతదారరు (voters) మతదారర పట్టి (voters’ list) ఇలాగ. మత అంటే మతము (కన్నడలో డుమువులు వాడకము అరుదు) కూడ ఉందండి కన్నడ దల్లి. అభిమత లో అభి తొలగించి మత అన్నారేమో ఓటుకు. ఆంధ్రభారతి నిఘంటువులో చాలా పదాలకు చివరలో కన్నడ తమిళు పదాలిస్తారండి. కానీ ఉంకు కివ్వలేదు మరి. ఓటుకు అచ్చ తెలుగు పదమున్నదా అని విజ్ఞులే తెలపాలండి.
వంచనవారణయగుగా
రిప్లయితొలగించండిమంచికివోటేసిన, క్షతిక్రమమ్మునమనకే
యుంచిన మంత్రిని ద్రోహిగ
త్రెంచునుశాంతినిసుఖమును తెంపరియగుచున్
ద్రోహిని
రిప్లయితొలగించండివంచన బుద్ధిని గల్గియు
రిప్లయితొలగించండిమంచిగ నటియించి ప్రియపు మాటల బలుకు న్
ముంచెడు వాడని తెలియక
మంచికి వో టిడిన క్షతి గ్ర మమ్ము గ మనకౌ
మంచియె జరుగును దప్పక
రిప్లయితొలగించండిమంచికి యోటిడిన, క్షతి క్రమంబున జరుగున్
కొంచపు గుణమున్ గల్గియు
వంచించెడు నేతకిడిన వాస్తవముసుమీ.
కందం
రిప్లయితొలగించండికొంచెపుబుద్ధిని ఘనుడై
మించిన స్వార్థాన నిల్చి మేలెంతుననన్
వంచకుని నెలవనుచుఁ దా
మంచికి, వోటిడిన క్షతి గ్రమమ్ముగ మనకౌ!
ఉత్పలమాల
కొంచెపు బుద్ధిలో ఘనుఁడు క్రూరమనస్కుడు దోచ సర్వమున్
మించిన స్వార్థమై నిలిచి మేలొనఁగూర్తనినమ్మఁ బల్కగన్
వంచకుడున్బ్రలోభముల పాలొనరించుచుఁ దూట్లువైచుచున్
మంచికి, వోటు వేసినఁ గ్రమమ్ముగ దేశము నాశమయ్యెడిన్
పంచెద నేనేయందురు
రిప్లయితొలగించండికొంచెమయిన సిగ్గులేని కొందరు నేతల్
వంచకులకు మృగ్యంబౌ
మంచికి వోటిడిన క్షతి గ్రమమ్ముగ మనకౌ
పంచిన చాలుమీకనుచు వంచక నేతలు వోట్లుపొందగా
మంచికిమారుపేరయిన మాన్యుల యెన్నిక సాధ్యమెట్లగున్
వంచకనేతలన్ విడక పౌరులు విజ్ఞులు నేడు మృగ్యమౌ
మంచికి వోటు వేసినఁ గ్రమమ్ముగ దేశము నాశమయ్యెడిన్
రిప్లయితొలగించండివంచన జేసి పదవినా
శించెడు నాయకుల నెపుడు ఛీయనగ దగున్
క్రించులలో చోటుండదు
మంచికి, వోటిడిన క్షతి గ్రమమ్ముగ మనకౌ.
పంచుచు విత్తమున్ మరియు వారుణి నెన్నిక లందు గెల్వ గు
ప్పించుచు శుష్కవాక్కులను పీఠము నెక్కదలంచు నేతలే
వంచకులీ భువిన్ నిజము వారి మనస్సున స్థానముండదే
మంచికి, వోటు వేసినఁ గ్రమమ్ముగ దేశము నాశమయ్యెడిన్.
-
రిప్లయితొలగించండికొంచెంబైనను మేలగు
మంచికి వోటిడిన; క్షతి గ్రమమ్ముగ మనకౌ
ద్రుంచగ సరాగముల వా
దించుచు చేజారనీయ ధీమతి! హక్కున్!
ఎంచుకొనమంచు దెలుపగ
రిప్లయితొలగించండిమంచికి వోటిడిన క్షతి గ్రమమ్ముగ మనకౌ
నంచెలుగ పదవిని మరగి ,
కొంచెము కొంచెముగ నదియె కుదుపగ మారున్
రిప్లయితొలగించండిఎంచినమేలగుజగతికి
మంచికివోటిడిన,క్షతి క్రమమ్మున మనకౌ
ముంచెడిమతితో సతతము
వంచన చేయుమనసున్నవారినె నమ్మన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొంచెపు వారే ప్రభులై
రిప్లయితొలగించండిఎంచకనే మంచి చెడులు యేలును రాజ్యం
వంచనమున పంచిన కా
మంచికి వోటిడిన క్షతి గ్రమమ్ముగ మనకౌ
నాయకులు పంచే డబ్బు ( కామంచిగడ్డి ) తిని ఓటేస్తే.....అనే భావంలో
-
రిప్లయితొలగించండిఅమరునభివృద్ధి యేను మ
నము "మంచికి వోటు వేసినఁ; గ్రమమ్ముగ దే
శము నాశమయ్యె డిం"గరు
లమై మనము తొత్తులై వెలకు బోవంగన్
Very nice
తొలగించండి-
రిప్లయితొలగించండిబాంచను కాలు మొక్కెదను" పాదపు సేవల జేయ నాయకుల్
వంచన చేయు వారలయి పంచగ భిక్షపు పాత్ర, పూసకా
మంచికి వోటు వేసినఁ గ్రమమ్ముగ దేశము నాశమయ్యెడిన్
ద్రుంచుడి బాని సత్వమును దోపిడి దొంగల పాఱనొత్తుడీ!
జిలే బుల్స్
వంచనచేసి సంపదల వావిరిగా గడియించు నిచ్చతో
రిప్లయితొలగించండికుంచిత బుద్ధిశాలురగు కూళలు గద్దెలనెక్కి పేదకున్
పంచుచు తాయిలమ్ములను పాలన చేయుదురట్టి పూజ్యమౌ
మంచికి వోటు వేసినఁ గ్రమమ్ముగ దేశము నాశమయ్యెడిన్
వంచకులగు నేతలు తమ
రిప్లయితొలగించండికుంచితమగు బుద్ధి జూపి కూడగబెట్టన్
మించిన సంపద రిక్తఁపు
మంచికి వోటిడిన క్షతి గ్రమమ్ముగ మనకౌ
కం॥ పెంచెదరు దేశ సంపద
రిప్లయితొలగించండిమంచికి వోటిడిన, క్షతి గ్రమమ్ముగ మనకౌ
యెంచకను గుణగణములను
వంచన నేర్చిన ఘనులకు వరమిడి యెన్నన్
ఉ॥ పెంచఁగ దేశ సంపదను బెంచఁగ దేశ జనాళి క్షేమమున్
వంచన మోసముల్ గనక పాటుపడంగను వృద్ధిఁ జెందదా
మంచికి వోటు వేసినఁ గ్రమమ్ముగ, దేశము నాశమయ్యెడిన్
గొంచెము బుద్ధి నిల్పకను గూళల నెన్నఁగ మంచివారనిన్
కం:మంచి యని యింటి పేరున
రిప్లయితొలగించండినుంచుకొనగ జాలు నేమి?యోచింపక ,కీ
డెంచక,మాలతి శంకర
మంచికి వో టిడిన క్షతి క్రమమ్ముగ మన కౌ.
(అభ్యర్థి పేరు మాలతి శంకరమంచి.ఇలాంటి ఇంటి పేరు ఉంది.)
ఉ:మంచి ప్రణాళికల్ కనక,మద్యము,మాంసము,సొమ్ము దక్కుటే
రిప్లయితొలగించండియెంచి, యధర్మ మార్గముల నెంతయు దేశము దోచు వార ,లూ
హించని ప్రేమ తోడ బులిపించెడు పల్కుల బల్క, మాటలన్
మంచికి వోటు వేసిన గ్రమమ్ముగ దేశము నాశ మయ్యెడిన్
లంచముదేశమున్విడిపలాయనమంత్రముచిత్తగించుగా
రిప్లయితొలగించండిమంచికివోటువేసిన, గ్ర, మమ్మునదేశము నాశమయ్యెడిన్
వంచనసేయువారలకు,బాధ్యత నిచ్చిన భావ్యమెట్లగున్
కంచెనుచేనుమేయుకలికాలమునీయదికానరేజనుల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమంచియె జరుగును ననిశము
రిప్లయితొలగించండిమంచికి వోటిడిన, క్షతి గ్రమమ్ముగ మనకౌ
మంచిని కాదని చెడునిడు
వంచకులకు నోటువేయ బ్రదుకులు భరమౌ
వోటన్యదేశ్యము. ఉంకు (సమ్మతి) దేశ్యపదము.
రిప్లయితొలగించండివంచకు లుందురు చెంతను
బొంచి సతమ్మును భృశమ్ము పొగడుచు నిన్నున్
వంచనకే, దూరం బయి
మంచికి, నుంకిడిన క్షతి క్రమమ్ముగ మనకౌ
ముంచుచు మంచి మాటలను మోహము నందు సతమ్ము నిల్పుచున్
వంచన సేయు వారలను బంచన నుంచిన విస్వసించి నీ
వెంచి మనమ్ము నందు నిజమే యని యక్కట కృత్రిమంపు టా
మంచికి నుం కొసంగిన గ్రమమ్ముగ దేశము నాశ మయ్యెడిన్
మంచికి వోటు వేసినఁ గ్రమమ్ముగ దేశము నాశమయ్యెడిన్
రిప్లయితొలగించండివంచకు లైనవారిటులఁ బల్కుదు రెప్పుడు వారిమాటలన్
మంచిగ మానసంబునను మన్నన చేయక నెల్లవేళలన్
మంచినె నమ్ముచుండుచును మాన్యత రీతిని మెల్గుటొప్పగున్
ఉంకు అనగా సమ్మతి ఎగురు అర్థాలున్నాయండి. కాని మనము తెలుగులో ఎప్పుడు అన్యదేశ్యమైనా ఓటు అనే పలుకుతున్నామండి. ఉంకు ఎన్ను ఇలాంటి పదాలు ప్రాచుర్యంలో లేవుమరి. అదే కన్నడలో అచ్చు కన్నడ పదము మత ఉంది ఓటుకు. మత ఎక్కువగనే వాడుతారు. మతనీడు (cast vote) మతదారరు (voters) మతదారర పట్టి (voters’ list) ఇలాగ. మత అంటే మతము (కన్నడలో డుమువులు వాడకము అరుదు) కూడ ఉందండి కన్నడ దల్లి. అభిమత లో అభి తొలగించి మత అన్నారేమో ఓటుకు. ఆంధ్రభారతి నిఘంటువులో చాలా పదాలకు చివరలో కన్నడ తమిళు పదాలిస్తారండి. కానీ ఉంకు కివ్వలేదు మరి. ఓటుకు అచ్చ తెలుగు పదమున్నదా అని విజ్ఞులే తెలపాలండి.
రిప్లయితొలగించండిఉంకు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
తొలగించండిదే. అ.క్రి .
ఎగురు.
"గీ. నీరముంచిన సొరకాయయెగసినట్లు, పేరుకొనివైచు తెల్లటి చీరవోలె, నుంకుచెండు విధంబున నుత్తరించు, తములపాకు నిక్కెడుక్రియ దాఁటెనిఱ్ఱి." ఉ, హరి. ౪, ఆ.
వి.
సమ్మతి.
"క. ఎక్కువకులంబు నతనికి, నిక్కపుటాలైనదాని నీచకులుండుం, కెక్కక బలిమిం గవిసినఁ, దక్కొని చంపుటయ రాజధర్మంబెందున్." విజ్ఞా. ప్రా, కాం. (చూ. ఉంకుటుంగరము.)
ఇంకా చాల నిఘంటువులలో నీ యచ్చ తెనుఁగు పద మున్నదండి గమ,నింపుఁడు. ఎంపిక కూడ వాడ నగును.
తొలగించండిక్రియగా "ఎన్ను వాడవచ్చును.
ఎన్నిక కూడ వాడ వచ్చును.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
ఇంచుక మేలే చేతురు
మంచికి వోటిడిన; క్షతిఁ గ్రమమ్ముగ మనకౌ
మించిన స్వార్ధము తోడను
వంచన చేయు తలపు గల వారల వలనన్.