22, జనవరి 2024, సోమవారం

సమస్య - 4653

23-1-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో”
(లేదా...)
“చినదానిన్ వరియించి వచ్చె ననుచున్ జేపట్టె వృద్ధుం డహో”

43 కామెంట్‌లు:


  1. కనిపించినసాక్ష్యముతో
    వినిపించిన తీర్పుగదిసి వీడు తమసున్
    పనిగొనిసంస్కృతివడిగా
    చినదానిని వృద్ధుడెలమిఁజేపట్టెనహో

    రిప్లయితొలగించండి
  2. మునుపటి దివసము నందున
    తనపయిగల పెరిమతోడ దౌహి త్రి గనన్
    తనదగు నస్యపు బదరికమును దా
    చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో”

    రిప్లయితొలగించండి
  3. కందం
    గుణవంతుండని సహజీ
    వనమున్ విశ్వస్త యెంచి పండు వయసునన్
    గని యొంటరివాడని, మె
    చ్చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో!


    మత్తేభవిక్రీడితము
    తనరన్ జాలక తోడులేని గతి వార్థక్యాన నేకాకులై
    జనులందున్ సహజీవనంపు తలపుల్ సాకారమౌచుండఁగన్
    పునరుత్తేజము నొందఁగన్ ముసలియై మోదింప విశ్వస్త మె
    చ్చినదానిన్ వరియించి వచ్చెననుచున్ జేపట్టె వృద్ధుం డహో!

    రిప్లయితొలగించండి
  4. ఘనుడగు నాయక శిష్టుఁడు
    తనదరి చేరిన వనితను తానలరించెన్
    దనజీవిత చరిత లిఖిం
    చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఘనుడౌనాయక మాసటీడు తననేకాంతంబునన్ జేరఁ వే
      చిన దానిన్ దనయాత్మ గాథ నుడువన్ జేయూత నందింప వ
      చ్చిన భామే తనకున్ సపర్యలిడనా సీమాటినే మెచ్చి మె
      చ్చినదానిన్ వరియించి వచ్చె ననుచున్ జేపట్టె వృద్ధుం డహో

      తొలగించండి
  5. కనుచూపు ఆనకున్నను
    మునుపటివలె అవయవములు ముక్కొనకున్నన్
    ఎనలేని కాంక్షచేతను
    చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'చూపు + ఆనకున్న' అన్నపుడు సంధి నిత్యం. "కనుచూపె యానకున్నను" అనండి.

      తొలగించండి
  6. మన సెరిగి నడచు కొన గల
    వినయ విధేయత లు గలిగి విద్యా వతి యై
    తనను వల చిన ది యగు న
    చ్చి న దానిన్ వృద్ధు డెలమి జే పట్టె నహో

    రిప్లయితొలగించండి

  7. ఘనసారము లభియించిన
    ననుకూలము సేద్యమంచు నాశ్మంతమునన్
    మనుమడు నూతిని త్రవ్విం
    చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో.


    జనకుండాతడు బద్ధకస్థుడనుచున్ సంజీవమున్ బెట్టకన్
    దనయుండాలికి దాసుడై విడువ సంతాసించు వృద్ధవ్రతిన్
    గని పౌత్రుండపుడాస్తి పత్రములనే కారుణ్య మందప్పగిం
    చిన , దానిన్ వరియించి వచ్చె ననుచున్ జేపట్టె వృద్ధుం డహో.

    రిప్లయితొలగించండి
  8. కనిపెంచిన పిల్లలు ముది
    మిన గానక కన్నడించ మిడిమేలమునన్
    తన తోడుకు మగడు గతిం
    చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో

    రిప్లయితొలగించండి
  9. ఇందులో సమస్య యెక్కడుంది ? :)


    అనుకోకుండా కలిసిరి
    వనమ్మున నొకరినొకండ్రు పరవశమున ద్రే
    లెను మది గుండెలెగిసిపడె
    చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో!


    జిలే బుల్స్ :)


    రిప్లయితొలగించండి
  10. -

    అనుకోలేదిరువుండ్రు మాలిని మనోల్లాసమ్ములో నాతడే
    మునకల్ వేసి వయస్యుడాయె యెదయేమోచేయగా జవ్వనిన్
    తనువూగెన్ మది తూగుచున్ పొలుపులో తానాడె సయ్యాటగా
    చినదానిన్ వరియించి వచ్చె ననుచున్ జేపట్టె వృద్ధుం డహో



    జిలే బుల్స్ :)


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ పద్యాన్ని చూస్తే మన ప్రభాకర శాస్త్రి గారే గుర్తుకు వచ్చారు. వారేమో అరోగ్యం సహకరించక పద్యాలు వ్రాయడం మానుకున్నారు.
      బాగుంది మీ పూరణ.
      మొదటి పాదంలో యతి తప్పింది.

      తొలగించండి
    2. ప్రొఫెసర్ గారు మళ్ళీ కుదురాటకు వచ్చి వ్రాయటం మొదలెడితే ఆరోగ్యం గట్రా అన్నీ వాటికవే కుదురు కుంటాయని
      వారికి నా మాటగా చెప్పగలరు

      తొలగించండి
  11. చిననాడే ప్రేమించిన
    చినదానిన్ విధివశాన చేరగలేకన్
    కనఁగా మలిసంధ్యను న
    చ్చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో

    రిప్లయితొలగించండి
  12. చిననాటన్ చిగురించె నామె యెడలన్ చిత్రంబుగా నెమ్మి దా
    చెను తానాపెకు నెన్నడున్ దెలుపకన్ చేతంబు నందర్మిలిన్
    కనుచుండన్ గతియించె కాలమకటా కాలాంతరంబందు న
    చ్చినదానిన్ వరియించి వచ్చె ననుచున్ జేపట్టె వృద్ధుం డహో

    రిప్లయితొలగించండి
  13. కం॥ మనుజున కొకతోడు ముసలి
    తనమున ముఖ్యము తెలుపఁగఁ దఁలపఁగ నిలలో
    కన పతి నెడఁబాసిన యొక
    చినదానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో!

    మ॥ మనఁగన్ వృద్ధుని కొక్క తోడు నిలలో మాధుర్య మొప్పారఁగన్
    జనఁగన్ మోదము నింపఁ గావలయు నిస్సారంబుఁ గాదప్పుడే
    గనఁగన్ జీవితమందు సత్యము సతిన్ గాక్షించి తానట్లు న
    చ్చినదానిన్ వరించి వచ్చెననుచున్ జేపట్టె వృద్ధుం డహో

    రిప్లయితొలగించండి
  14. కం:తన కొడుకును,కోడలు పో
    యిన బాధను మ్రింగి,వారిదే రూపమ్మౌ
    తన మనుమరాలె యగు నీ
    చిన దానిని వృద్ధు డెలమి జేపట్టె నహో

    రిప్లయితొలగించండి
  15. మ:తన వా రెవ్వరు లేక వారసులు గా ,తా బొందు పింఛన్ కు వ
    చ్చిన దానిన్,కడు మెచ్చు దాని,తననే సేవించగా నిచ్చగిం
    చినదానిన్,పరువమ్ము పోవుట మదిన్ శృంగార మన్ రంధి చ
    చ్చినదానిన్ వరియించి వచ్చె ననుచున్ జేపట్టె వృద్ధుం డహో

    రిప్లయితొలగించండి
  16. మనుగడ నీయఁగఁదనువల
    చినదానినివృద్ధుఁడెలమిఁ జేపట్టెనహో
    మనమున నాలో చింపఁగఁ
    దనదరినే మం చియగును దప్పక యెపుడున్

    రిప్లయితొలగించండి
  17. 3)మ:తన రాజ్యప్రభ మెచ్చు దాని,తన యందమ్మిప్పుడున్ దల్చి మె
    చ్చిన దానిన్,తన గాథ వ్రాయు ప్రతినన్ జేకొన్న దానిన్,దలం
    చిన దానిన్ గ్రహియింపగా మగనినే చెళ్లంచు పోద్రోసి వ
    చ్చిన దానిన్ వరియించి వచ్చె ననుచున్ జేపట్టె వృద్ధుం డహో!

    రిప్లయితొలగించండి
  18. వనితకుఁ దో డది యవసర
    మని యెంచి యెడంద వీడి యనుమానంబే
    మనసారఁ గదిసి తన్వల
    చిన దానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో


    వనితా రత్నము లుందు రింపుగను గాపాడంగఁ గాకున్న నిం
    కను నాశం బొనరింప నాగ్రహమునం గక్షా విలగ్నాత్మలై
    తనరం జేయఁగ నెంచి యాత్మ కథ సత్కారమ్మునం దన్ను జూ
    చిన దానిన్ వరియించి వచ్చె ననుచుం జేపట్టె వృద్ధుం డ హో

    రిప్లయితొలగించండి
  19. మ.

    ఘన రూపమ్మున మాండకర్ణి ముని సంగాతమ్ములో నచ్చరల్
    తన సౌందర్యముఁ బంచభార్యలుగఁ జింతావేశ్మమున్ బంక్తి వ
    *చ్చినదానిన్ వరియించి వచ్చె ననుచున్ జేపట్టె వృద్ధుం డహో*
    మనసుంచంగఁ దటాకమున్ జరిపె భామా శోభనమ్ముల్ రహిన్.

    రిప్లయితొలగించండి
  20. డా బల్లూరి ఉమాదేవి

    పినవయసున ప్రేమించియు
    మనసుననేదాచుకొనుచు మసలినవానిన్
    వినయముతోచేరగ వల
    చిన దానినివృద్ధుడెలమి జేపట్టె నహో

    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    తన సతియే మరణించగ
    మనువాడగనెంచి యొక్క మహిళను విధవన్
    తన వయసున్న, తనను మె
    చ్చినదానిన్ వృద్ధు డెలమిఁ జేపట్టెనహో!

    రిప్లయితొలగించండి
  22. వినయమ్మున్ పనులన్నియున్ సలుపుచున్, ప్రేమమ్ముతో జూచుచున్
    మనమందెట్టి కలంక మేర్పడక, సమ్మానమ్ముతో బంధులన్
    కనుఁ గొంచున్, వసనమ్మునన్ మనుచు సాంగత్యమ్ముతో, చేర వ
    చ్చిన దానిన్ వరియించి వచ్చె ననుచుం జేపట్టె వృద్ధుం డహో

    రిప్లయితొలగించండి