20, జనవరి 2024, శనివారం

సమస్య - 4651

21-1-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శస్త్రము విడినట్టి జోదు చంపెఁ బలువురన్”
(లేదా...)
“శస్త్రము వీడి యోధుఁ డొక సంగరమందునఁ జంపె వేవురన్”

14 కామెంట్‌లు:

 1. దస్త్రముపై వ్రాసెడి తన
  శస్త్రము విడినట్టి జోదు , చంపెఁ బలువురన్
  వస్త్రముతో మశకములను ,
  శాస్త్రులు పెండ్లాము జూచి సంతస మొందెన్

  రిప్లయితొలగించండి
 2. కందం
  నిస్త్రాణుడయ్యెఁ గవ్వడి
  విస్తృత రణభూమి మోహవివశత! గీతా
  శాస్త్రప్రేరణఁ దొలుతన్
  శస్త్రము విడినట్టి జోదు చంపెఁ బలువురన్

  ఉత్పలమాల
  నిస్త్రప మన్నదే మరచి నేర్పరి ఫల్గుణుఁడైన వారలన్
  విస్తృత యుద్ధభూమిఁగని వింతగ మోహము నావరింపగన్
  శాస్త్రపరీవృతమ్ము హరి స్పష్టము సేసిన గీతఁ దొల్తఁ దా
  శస్త్రము వీడి యోధుఁ డొక సంగరమందునఁ జంపె వేవురన్

  రిప్లయితొలగించండి
 3. వస్త్రముగజచర్మంబును
  నిస్తాణంబునుగనకనునేర్చెనుతపమున్
  దస్త్రములయమునుకాగా
  శస్త్రమువిడ, ినట్టిజోదుచంపెపలువురన్

  రిప్లయితొలగించండి
 4. అస్త్రముపట్టలేడు, నడయాడునుకఱ్ఱతొ బోసినవ్వులన్
  వస్త్రము పంచె కట్టు, కనువారికిగ్రుచ్చును చూపుతూపులన్
  శాస్త్రమునందుపారగుడు, సత్యమహింసలెదారిజూపగా
  శస్త్రమువీడియోధుడొకసంగరమందునజంపెవేవురన్

  రిప్లయితొలగించండి

 5. శాస్త్రమెఱంగిన మల్లకు
  డస్త్రము లవియేల విగ్రహమున పిడియె ది
  వ్యాస్త్రమటంచు పలికి తా
  శస్త్రము విడినట్టి జోదు చంపెఁ బలువురన్.  అస్త్రము లేలరా కనగ నద్భుత గుప్పిలి చాలు నాకు ది
  వ్యాస్త్రమటంచు దస్యులని నస్త్రము ముక్కలు సేయనేమి రా
  శాస్త్రమెఱంగినట్టి బలశాలి జవంబున ఛిద్రమైన యా
  శస్త్రము వీడి యోధుఁ డొక సంగరమందునఁ జంపె వేవురన్.

  రిప్లయితొలగించండి

 6. అస్త్రము తోడ బంధువుల నంతము జేయగ లేనటంచు ది
  వ్యాస్త్రమునున్ త్యజించిన సుభద్రమనోహరు డైన ఫల్గుణుం
  డస్త్రమె చక్రమై చెలగు హంసుడు గీత వచించు పూర్వమున్
  శస్త్రము వీడి, యోధుఁ డొక సంగరమందునఁ జంపె వేవురన్.

  రిప్లయితొలగించండి
 7. నిస్త్రాణముతో గూలుచు
  శస్త్రము విడినట్టి జోదు చంపెఁ బలువురన్
  శాస్త్ర విదులు తెలిపిరి యైం
  ద్రాస్త్రముచేఁ గుంభకర్ణ దానవుడనుచున్

  అస్త్రము కంటిచూపయిన నంబురుహాక్షులఁ గాంచవోయి సూ
  నాస్త్రుని సాయకంబులగు నంబుజలోచన లోచనమ్ములే
  శస్త్రము వీడి యోధుఁ డొక సంగరమందునఁ జంపె వేవురన్
  శాస్త్ర విహస్తులందురట చంపిన యోధుడు కుంభకర్ణుడే

  రిప్లయితొలగించండి
 8. శాస్త్రము నేర్పిన గురువగు
  శస్త్రము విడి నట్టి జోదు చంపె :: పలువురిన్
  శ స్త్ర ముల తో డ గూల్చియు
  నిస్త్రా ణ ము లేని నరుడు నిక్కె విజయు డై

  రిప్లయితొలగించండి
 9. అస్త్రములన్ గదించి తన యాప్తులనెల్లర సంగరమ్మునన్
  శస్త్రములన్ వధించుటన శస్తముకాదని తీవ్ర వేదనన్
  శస్త్రము వీడి, యోధుఁ డొక సంగరమందునఁ జంపె వేవురన్
  శాస్త్రము దెల్పి శౌరి మది సాంత్వన గూర్చఁగ బాప మోహమున్

  రిప్లయితొలగించండి
 10. అస్త్రమ్ముల గదియించగ
  నిస్త్రాణమునొంద, శౌరి నిజభక్తునకున్
  శాస్త్రమునుద్బోధింపఁగ
  శస్త్రము విడినట్టి జోదు చంపెఁ బలువురన్

  రిప్లయితొలగించండి
 11. కం॥ శస్త్రము లేకయె యుద్ధము
  శాస్త్రముఁ జదువకయె జ్ఞాన సముపార్జనయున్
  నిస్త్రాణమై చను నెచట
  శస్త్రమువిడినట్టి జోదు చంపెఁ బలువురన్

  ఉ॥ అస్త్రము వీడి యుద్ధమున నందరిఁ జంపుట సాధ్యమెట్లగున్
  శాస్త్రము రాక బోధనలఁ జక్కఁగఁ జేయుటఁ గాంచఁ జాలమే
  దస్త్రము లేక వ్రాయుటయుఁ దథ్యము గాదయ తెల్పుమెచ్చటన్
  శస్త్రము వీడి యోధుఁ డొక సంగరమందునఁ జంపె వేవురన్

  రిప్లయితొలగించండి
 12. శాస్త్ర నిచయ నైపుణ్యుఁడు
  నిస్త్రింశము నూని చెలఁగ నెమ్మి పరమ ది
  వ్యాస్త్రప్రభా సుయోజిత
  శస్త్రము విడి నట్టి జోదు చంపెఁ బలువురన్


  వస్త్ర చయమ్ముఁ జుట్టి ఘన వాలము చుట్టును నిప్పు పెట్టఁగా
  శాస్త్ర విరుద్ధ మెన్నగను జయ్యనఁ గాల్చి గృహాలి నెల్ల నా
  యస్త్ర భయైక వర్జితుఁడు నంజని పట్టియె తిర్గి లంకలో
  శస్త్రము వీడి యోధుఁ డొక సంగర మందునఁ జంపె వేవురన్

  రిప్లయితొలగించండి
 13. అస్త్రముతోడకౌరవుల నంతముచేసెద నంచువచ్చితా
  నస్త్రముజారుచున్నదనినచ్యుతుతోడనుపల్క క్రీడి గీ
  తాస్త్రముతోడశౌరియటతావివరించినయంతనేవడిన్
  శ్శస్త్రము వీడియోధుడొకసంగరమందునజంపెవేవురన్  రిప్లయితొలగించండి
 14. ఉ.

  శస్త్రము స్థూలకాయముగ సమ్మతి మ్రింగుచు గోతిమూకలన్
  *శస్త్రము వీడి యోధుఁ డొక సంగరమందునఁ జంపె వేవురన్*
  శస్త్రము రామబాణము విశారణ రాక్షస వీర దేహమున్
  అస్త్రములౌ ప్రయోగమున నంతము జేసెను కుంభకర్ణునిన్.

  రిప్లయితొలగించండి