8, జనవరి 2024, సోమవారం

సమస్య - 4640

9-1-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సఖ్యముఁ జేయంగఁ దగును శండునితోడన్”
(లేదా...)
“సఖ్యముఁ జేయఁగాఁ దగును శండునితోడ సుపుత్రలబ్ధికై”

25 కామెంట్‌లు:

  1. ముఖ్యమునయ్యెనారికిని మూడునుముళ్లను బంధమీయిలన్
    వ్యాఖ్యనుజేయనేమిటికియానముసాగెగ బ్రహ్మరాతతో
    ఆఖ్యకునాథుడాతఁడునునాగతిధర్మమునెంచిరార్యులున్
    సఖ్యముఁజేయగానగునుశండునితోడ సుప్రీం లబ్ధికై

    రిప్లయితొలగించండి
  2. ముఖ్యముజీవులహరణము
    ఆఖ్యకుతానేశివుడును నయ్యోకనరే
    వ్యాఖ్యకులొంగడుగాదే
    సఖ్యముజేయంగనగును శండునితోడన్

    రిప్లయితొలగించండి

  3. విఖ్యాతుడు వృద్ధుడు భీ
    ష్మాఖ్యుండస్త్రముల విడుట మనకదియె గదా
    ముఖ్యంబెదురుగ నిలుపగ
    సఖ్యముఁ జేయంగఁ దగును శండునితోడన్.


    విఖ్యుడు గాని వల్లభుడు పీఠగుడైన సమాజమందు ప్రా
    ముఖ్యత లేకపోయినను పుత్రుల గోరు పడంతి వానితతో
    సఖ్యముఁ జేయఁగాఁ దగును , శండునితోడ సుపుత్రలబ్ధికై
    సౌఖ్యము దక్కునంచననసత్యము వ్యర్థ ప్రయత్న మయ్యదే.

    రిప్లయితొలగించండి
  4. ముఖ్యముగ దరుణులు తమ స
    మాఖ్యన నివసించు చుండు మానవులందున్
    సంఖ్య పెరగకూడదనిన
    సఖ్యముఁ జేయంగఁ దగును శండునితోడన్

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. వ్యాఖ్యలనేకరకమ్ములు
    ముఖ్యులు పల్కిన వినదగు ముచ్చటగొల్పున్
    విఖ్యుడనెనిటుల శఠుడై
    'సఖ్యముఁ జేయంగఁ దగును శండునితోడన్'

    వ్యాఖ్యలనేకరీతులుగ పామరులెల్లరు చేయుచుందురే
    విఖ్యుడు సంభ్రమించెనట విజ్ఞత లోపము వల్ల మూర్ఖుడై
    లేఖ్యము నిశ్చయమ్మనుచు లేకితనంబున పల్కెనిట్టులన్
    'సఖ్యముఁ జేయఁగాఁ దగును శండునితోడ సుపుత్రలబ్ధికై'

    రిప్లయితొలగించండి
  7. ప్రఖ్యాతి ని పొందిన నా
    ముఖ్యని భీష్ముని పలుకులు ముదమున వినుచున్
    వ్యాఖ్య లు సేయక మీరలు
    సఖ్యము జేయంగ దగును శండుని తోడన్

    రిప్లయితొలగించండి
  8. సఖ్యమొనర్పగానెలమి సారసలోచన సుందరాంగితో,
    సౌఖ్యముఁగోరి జవ్వనులు సాదరమొప్పగ కోడెకాండ్రతో
    సఖ్యముఁ జేయఁగాఁ దగును, శండునితోడ సుపుత్రలబ్ధికై
    సఖ్యముఁ జేయజూతురె సుచక్షువులౌ మనుజాళి యెన్నడున్ ?

    రిప్లయితొలగించండి
  9. సౌఖ్యము నొందఁగ పురుషుని
    సఖ్యముఁ జేయంగఁ దగును, శండునితోడన్
    సఖ్యతఁ గోరదు మానిని
    విఖ్యాతుండైన మగని ప్రేముడిఁ గోరున్

    రిప్లయితొలగించండి
  10. కం॥ ముఖ్యము వైద్యున కర్హత
    సఖ్యముఁ జేయంగఁ దగును శండునితోడన్
    విఖ్యాత వైద్యుఁడైనను
    సఖ్యత గల కాపురమున సంతుఁ గననిచో

    ఉ॥ సఖ్యత తోడఁ గాపురముఁ జక్కఁగ సాగిన సంతు లేనిచో
    ముఖ్యము వైద్య సూచనలఁ బొందుట తప్పక శండుఁడైనఁ బ్రా
    ముఖ్యముఁ గన్న జీవదుఁడు మోదము మీరగ సంప్రదించవో
    సఖ్యముఁ జేయగాఁ దగును శండుని తోడ సుపుత్ర లబ్ధికై

    రెండు పద్యములకు ఒకే భావము వచ్చుటకు ప్రయత్నించానండి. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  11. ప్రఖ్యాతుడు శుక్రుని ప్ర
    త్యాఖ్యాతము నొందకుండ తామెలఁగుటయే
    ముఖ్యము గావున కచునకు
    సఖ్యముఁ జేయంగఁ దగును శండునితోడన్

    ప్రత్యాఖ్యాతము : నిరాకృతము

    మృత సంజీవని విద్య నేర్చుకొనుటకు శుక్రుని ఆశ్రమము చేరిన బృహస్పతి కుమారుడు కచుడు శుక్రాచార్యుని పుత్రుడు శండునితో మైత్రి చేసిన భావంలో .

    రిప్లయితొలగించండి
  12. ఇచ్చిన పాదంలో "శండుడు" సరియైనదా "షండుడు" సరియైనదా ? లేదా రెండిటికీ బేధం లేదా ?
    బ్రౌన్ నిఘంటువు లో "షండుడు" మాత్రమే ఉన్నది.

    (షండుడు = A eunuch, an impotent man. ఖొజ్జావాడు, పేడి)

    ఈ ప్రశ్న అడిగిన నాఅజ్ఞానాన్ని/సాహసాన్ని మన్నిస్తారని ఆశిస్తూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంధ్రభారతి నిఘంటువులో శండుడు సరియైన పదముగాను షండుడు సండుడు పండుడు రూపాంతరములు గాను ఇచ్చారండి. టీకా నపుంసకుడు అని ఉంది. నాకు తెలియక మొదట చూసాను.

      తొలగించండి
  13. కందం
    ముఖ్యమనంగ బృహన్నల
    సఖ్యత నుత్తరుని కనిని సాదియనగ ప్రా
    ముఖ్యత నెఱిఁగి రథమ్మువ
    సఖ్యముఁ జేయంగఁ దగును శండునితోడన్

    ఉత్పలమాల
    ముఖ్యుమనంగ 'పుంసవనమున్' దగఁ కోరెడు వారికెంచి, ప్రా
    ముఖ్యమెఱింగి మూలికల పొందెడు నేర్పున కీర్తికెక్క, వై
    ముఖ్యము వీడి పత్నిఁగొని ముచ్చట దీరఁగ మందుకోసమై
    సఖ్యముఁ జేయఁగాఁ దగును శండునితోడ సుపుత్రలబ్ధికై!

    రిప్లయితొలగించండి
  14. ముఖ్యు లగువా రి తోడనె
    సఖ్యముఁ జేయంగఁ దగును, శండునితోడన్
    సఖ్యముఁజేయుట మానిన
    విఖ్యాతగనుండవచ్చుఁ బృధ్వినినెపుడున్

    రిప్లయితొలగించండి
  15. ఆఖ్యానము లెన్ని వినము
    ముఖ్య పురాణమ్ము లందుఁ బూరుషు లందున్
    విఖ్యాతులు పేడు లగుట
    సఖ్యముఁ జేయంగఁ దగును శండుని తోడన్


    సౌఖ్యము వొందు నర్జునుఁడు చారు బృహన్నల నామ కాప్రమే
    యాఖ్య విరాట రాడ్వర నిజాత్మజ కొజ్జగ నొప్ప భావినిన్
    ముఖ్య ధనుర్ధ రైక వృషభుండు సుభద్రకు శంక యేలనో
    సఖ్యముఁ జేయఁగాఁ దగును శండుని తోడ సుపుత్ర లబ్ధికై

    రిప్లయితొలగించండి
  16. సఖ్యముఁ జేయఁగాఁ దగును శండునితోడ సుపుత్రలబ్ధికై
    సఖ్యముఁజేయగా వలదు శండుని తోడను నెట్టి వేళలన్
    సఖ్యత తోడనున్ మగని సౌఖ్యముఁ జూచిన, దప్పకుండగా
    వ్యాఖ్యకు తావులేని సుతుఁడాయత రీతిని నుద్భవించునే

    రిప్లయితొలగించండి
  17. ముఖ్యము‌ ధైర్యము‌ గెలుపుకు‌
    విఖ్యాతంబగు‌బృహణ్ణ‌ వీరుడుగనుకన్‌
    ప్రఖ్యాతజయమునెంచగ‌
    సఖ్యముఁ జేయంగఁ దగును శండునితోడన్.

    రిప్లయితొలగించండి
  18. ఉ.

    ఆఖ్య బృహన్నలంచు హరి యర్జునునిన్, వనవాస పూర్తిలో,
    సౌఖ్యము ధిక్కరించె, రతి సల్పక నూర్వశి,..మత్స్య రాజుకున్
    *సఖ్యముఁ జేయఁగాఁ దగును శండునితోడ,.. సుపుత్రలబ్ధికై*
    ముఖ్యము కామకేళి జత మోహమునందున మున్గి తేలగన్.

    రిప్లయితొలగించండి
  19. సఖ్యత యొక్కటె యిలలో
    ముఖ్యమటంచునుతలచుచుముందుకు సాగన్
    సౌఖ్యముకలుగును గావున
    *"సఖ్యముఁ జేయంగఁ దగును శండునితోడన్”*


    సఖ్యమెముఖ్యమంచుమదిచక్కగదల్చుచుసాగుచున్నచో
    *“సఖ్యముఁ జేయఁగాఁ దగును శండునితోడ, సుపుత్రలబ్ధికై”*
    సౌఖ్యముకూడుగానినిలసంతునుకల్గగబోదుదానికై
    ముఖ్యముగానుదంపతులుముందుగ వెజ్జునికల్వ మేలగున్

    రిప్లయితొలగించండి