12, జనవరి 2024, శుక్రవారం

సమస్య - 4644

13-1-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరమతు లగుదురు పరులకున్ దాన మిడన్”
(లేదా...)
“క్రూరమతుల్ గదా పరులకున్ దమ సంపదలిచ్చువారిలన్”

19 కామెంట్‌లు:


 1. వారించెడధర్మపరులె
  యౌరసులుగ గలిగినట్టి యబ్బడు తా కం
  ఠేరుల నాదుకొనుటలో
  క్రూరమతు లగుదురు పరులకున్ దాన మిడన్.

  రిప్లయితొలగించండి
 2. దారనిడుమనగ నర్హత
  నారయకుండ తననడుగు నతనిని వేగన్
  చేరువ దీసిన యెడల న
  క్రూరమతు లగుదురు పరులకున్ దాన మిడన్

  రిప్లయితొలగించండి
 3. వారు దయావిహీనులును స్వార్థ మనస్కు లధర్మ వర్తనుం
  డ్రౌరసులా ప్రజాపతి సహాయము చేయుట కిచ్చగింపకన్
  మోఱకులై తకట్టెడు కుపుత్రుల యందున నట్టి తండ్రులే
  క్రూరమతుల్ గదా పరులకున్ దమ సంపదలిచ్చువారిలన్.

  రిప్లయితొలగించండి
 4. కందం
  వారిజ నేత్రుని దయతోఁ
  గూరిన సంపదలఁ బంచి కుందెడు వారిన్
  జేరగ దీసెదరన న
  క్రూరమతు లగుదురు పరులకున్ దాన మిడన్!

  ఉత్పలమాల
  వారిజ నేత్రునిన్ దలఁచి భాగ్యములందితిమంచుఁ బ్రీతితోఁ
  గూరిన సంపదల్ వెతలఁ గుందెడు వారికిఁ బంచి పెట్టుచున్
  జేరఁగ దీసి యాదుకొని జీవితమిచ్చెడు వారలన్న న
  క్రూరమతుల్ గదా పరులకున్ దమ సంపదలిచ్చువారిలన్!

  రిప్లయితొలగించండి
 5. కారుణ్యముగాదు పరమ
  ఘోరము యాచింపచేయ కూనల చేతన్
  వారలను ప్రోత్సహించెడి
  క్రూరమతు లగుదురు పరులకున్ దాన మిడన్

  రిప్లయితొలగించండి
 6. పేరును సముపార్జింపగ
  భూరి విరాళముల నొసగు పుణ్యచరితులే
  వారసులకు మరచినచో
  క్రూరమతు లగుదురు పరులకున్ దాన మిడన్

  దారుణమైన క్లేశముల ధాటికి దానము కోరువారికిన్
  జేరువఁ నిల్చి సాయపడు చిత్తము లేని జనుల్ వికారులున్
  గ్రూరమతుల్ గదా; పరులకున్ దమ సంపదలిచ్చువారిలన్
  భూరికి సాటివత్తురట పుణ్యము మిక్కుటమైన మీదటన్

  రిప్లయితొలగించండి
 7. నే రము లొనరిం చు జనులు
  క్రూ ర మతు లగు దు రు ::పరులకున్ దాన మిడ న్
  ధారు ణి లో దాత యగుచు
  మేరయ లే నట్టి ఘనత మెండుగబొందున్

  రిప్లయితొలగించండి
 8. కం॥ కారుణ్య మూర్తులు జనుల
  భారము బాధలను గాంచి ప్రతిస్పందనతో
  వారికి యూఁతయొసఁగు న
  క్రూరమతులగుదురు పరులకున్ దాన మిడన్

  ఉ॥ ధారుణి లోన సంపదలు దాచఁగ దోచఁగ మోసగించుచున్
  జోరుల వోలె కూర్చఁగను జూచుచుఁ జాగుచు నుండు వారలే
  క్రూరమతుల్ గదా, పరులకున్ దమ సంపదలిచ్చు వారిలన్
  గారణ జన్ములే భువినిఁ గాంచఁగఁ జాలము మిక్కుటమ్ముగన్

  రిప్లయితొలగించండి
 9. దారిద్ర్యమ్మున సొక్కుచు
  భారముగా జీవనమున బరఁగెడువేళన్
  బోరాముల బాపఁగ న
  క్రూరమతు లగుదురు పరులకున్ దాన మిడన్

  రిప్లయితొలగించండి
 10. దారుణ లేమిడిన్ బ్రతుకు తట్టములందున సొక్కు వేళలన్
  చేరగబిల్చి సాంత్వనము చేకురజేయుచు నాదరమ్మునన్
  భారముదీర్చ పైకొనెడు పావనమూర్తులు సచ్చరిత్రుల
  క్రూరమతుల్ గదా పరులకున్ దమ సంపదలిచ్చువారిలన్

  రిప్లయితొలగించండి
 11. కం:భారతదేశపు భూమిని
  తేరగ నాక్రమణ జేయ,దృష్టి బరుపరే
  వారియెడ సహన మేలయ?
  క్రూరమతు లగుదురు పరులకున్ దాన మిడన్

  రిప్లయితొలగించండి
 12. తీరగుసంపదలున్నను
  క్రూరమతులగుదురు పరులకున్ దానమిడన్
  నోరిమియించుకలేకయు
  నోరారగతిట్టుచుంద్రునుర్వినిలోభుల్

  రిప్లయితొలగించండి
 13. కూరిమి వీడుచున్ మదిని కొందరు ద్రవ్యము పైన నాశతో
  చేరి నటించుచున్ మమత చేయుచు నుందురు కాని కార్యముల్
  *“క్రూరమతుల్ గదా, పరులకున్ దమ సంపద లిచ్చు వారిలన్”*
  కోరక లాభమున్ మదిని కోరుదు రన్యుల క్షేమమెప్పుడున్

  రిప్లయితొలగించండి
 14. బారుల మునిగిన వారలు
  క్రూరమతు లగుదురు, పరులకున్ దాన మిడన్
  గరి వరదుని జేరుదురట
  గురువులు వేచెప్పుచుండ్రు గొప్పగ పుడమిన్

  రిప్లయితొలగించండి
 15. ఉ:నూరుల,వేల దానముల నొవ్వక నేను సహించి యుంటి మీ
  రూరున గొప్ప కీర్తి గల యుత్తము లంచు భవిష్య చింత తో
  ధారల బోయ మాని యిక తగ్గుడు , బిడ్డల కేమి లేనిచో
  క్రూరమతుల్ కదా పరులకున్ దమ సంపద లిచ్చు వా రిలన్
  (బిడ్డల కేమీ మిగలకండా పరులకి దానధర్మాలు చెయ్యటం క్రూరత్వం అని ఒక భార్య భర్త తో తన వేదన తెలుపుతోంది.)

  రిప్లయితొలగించండి
 16. కారుణ్య మడర విగతా
  హారుల నారయ జనులకు నత్యధికముగన్
  ధారుణి సద్యో విగత
  క్రూరమతు లగుదురు పరులకున్ దాన మిడన్


  ఘోరత రాపరాధములు కుత్సిత బుద్ధి నొనర్చు వారిలో
  మూరునె సద్దయా గుణము ముచ్చట కైనను గొంచె మైననుం
  గ్రూరులు గారు దాన మిడు గొప్ప మనస్కులు నిక్క మెంచ న
  క్రూరమతుల్ గదా పరులకుం దమ సంపద లిచ్చు వారిలన్

  రిప్లయితొలగించండి

 17. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  ఘోరమగు నేరములతో
  క్రూరమతు లగుదురు;పరులకున్ దానమిడన్
  భారముగాను తలంచక
  దారిని చూప నితరులకు ధార్మికుడగుగా!

  రిప్లయితొలగించండి
 18. ఉ.

  నేరము బుండరీక కృత నిశ్చయ కామము దేవదాసికై
  తీరుగ జూదమున్ గుణనిధిన్ రతి మోహము లాశ్రయించెడిన్
  *క్రూరమతుల్ గదా పరులకున్ దమ సంపదలిచ్చువారిలన్*
  భారము తల్లిదండ్రులకు, భార్యకు, దుర్జన బంధువుల్ విధిన్.

  రిప్లయితొలగించండి