9, జనవరి 2024, మంగళవారం

సమస్య - 4641

10-1-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిర్దాక్షిణ్యహృదయులఁట నీరజనేత్రల్”
(లేదా...)
“నిర్దాక్షిణ్యమనస్కులౌదురు గదా నీరేజపత్రేక్షణల్”

23 కామెంట్‌లు:

  1. హార్దికుశంతను నంతట
    మార్దవమించుకయులేనిమానినికాగా
    నిర్దేశించెగ గంగయు
    నిర్దాక్షిణ్యహృదయలటనీరజనేత్రల్

    రిప్లయితొలగించండి
  2. నిర్ధారించెనురాముడాటవిని తానిక్కంపుభావంబుతో
    నిర్దేశించెనుసీతవద్దనుచు రానీయకుండా ప్రేమాస్పదన్
    మార్దంబంతయులేనిజానకియు తామారాడె కాఠిన్యయై
    నిర్దాక్షిణ్యమనస్కులౌదురుగదా నీరేజపత్రేక్షణల్

    రిప్లయితొలగించండి

  3. మార్దవ మూర్తులగుచు సౌ
    హార్దము చూపెడు పడతులె యహితుల పైనన్
    నిర్దయ చూపెదరు గదా
    నిర్దాక్షిణ్యహృదయులఁట నీరజనేత్రల్.


    సర్దాకోసము దేశమెల్ల దిరుగన్ సంకల్పమున్ జేయ సౌ
    హార్దమ్మున్ విడి నాదుమాటలను తానాలింపకన్ ద్రోసె నా
    యర్దాంగిన్ బ్రతిమాలుచున్ విసిగి నాయత్నమున్ మానితిన్
    నిర్దాక్షిణ్యమనస్కులౌదురు గదా నీరేజపత్రేక్షణల్.

    రిప్లయితొలగించండి
  4. మార్దవముగ పతి భార్యను
    మర్దన శిరముకు సలుపగ మరిమరి యడుగన్
    నిర్దయురాలై విడువగ
    నిర్దాక్షిణ్యహృదయులఁట నీరజనేత్రల్

    రిప్లయితొలగించండి
  5. సర్దారులు మగవారిని
    జర్దాకిళ్లీల వలెనె చకచక నమిలే
    మార్దవ మెరుగని వారలు
    నిర్దాక్షిణ్యహృదయులఁట నీరజనేత్రల్

    రిప్లయితొలగించండి
  6. అర్ధాంగులు గృహమందున
    మార్దవ మూర్తులనుచుంద్రు మన్నన కొరకే!
    నిర్ధారించిరి విజ్ఞులు
    నిర్దాక్షిణ్యహృదయులఁట నీరజనేత్రల్

    అర్ధాంగుల్ గృహసీమలో మిగుల నిత్యానంద మూలంబులా?
    నిర్దాక్షిణ్య మనస్కులౌదురు గదా నీరేజ పత్రేక్షణల్
    నిర్ధారింపగ వచ్చునంద్రు కనినన్ నిష్పక్షపాతంబుగా
    శార్దూలంబులకున్ సమానులుగదా శాంతమ్ము లోపించినన్

    రిప్లయితొలగించండి
  7. మార్దవ మూర్తులుమగువలు
    నిర్దయ తమ చిత్త మందు నెల కొనదు గదా
    సర్దాగా పలుక తగునె
    నిర్దా క్షి ణ్య హృద యు లట నీరజ నేత్రల్?

    రిప్లయితొలగించండి
  8. నిర్ధనుఁడను లోకువతో
    వ్యర్ధునిగా నెంచదగున వలచిన వానిన్
    సర్దుకుపో నేరరుగా
    నిర్దాక్షిణ్యహృదయులఁట నీరజనేత్రల్

    రిప్లయితొలగించండి
  9. కం॥ హార్దముఁ గాంచఁగ మగువలు
    సర్దాఁ బడుటయు సహజము సరసముఁ గనఁగన్
    మార్దవము మాయ మలుగఁగ
    నిర్దాక్షిణ్య హృదయులఁట నీరజ నేత్రల్

    శా॥ సర్దాలన్ గని తీర్చినంత వరకున్ సఖ్యంబు సాధ్యంబు సౌ
    హార్దమ్మున్ గను భార్య కోర్కెలను నీవాలించఁగా లేనిచో
    హార్దమ్మున్ జనుఁ గోపతాపములతో నాడించి జాడించదా
    నిర్దాక్షిణ్య మనస్కులౌదురు గదా నీరేజ పత్రేక్షణల్

    రిప్లయితొలగించండి
  10. కం:దుర్దృష్టుల యెడల మహిష
    మర్దను లగుదు రట స్త్రీలు మానధనులు గా
    మార్దవమును విడనాడెడు
    నిర్దాక్షిణ్యహృదయు లట నీరజనేత్రల్

    రిప్లయితొలగించండి
  11. కందం
    మార్దవమున మనమలర క
    పర్దిని సేవించ గలిగి పాపులసురులన్
    మర్దింపగ నవదుర్గలు
    నిర్దాక్షిణ్యహృదయులఁట! నీరజనేత్రల్!!

    శార్దూలవిక్రీడితము
    హార్ధమ్మొప్పఁగ మార్దవాన శివుడున్ హ్లాదింప సేవించి, యా
    దుర్దన్ భక్తగణమ్ములే శరణనన్ దుర్గల్ విజృంభించుచున్
    మర్దింపన్ వెనుకాడఁబోవురనగన్ మన్నింపకే దుష్టులన్
    నిర్దాక్షిణ్యమనస్కులౌదురు గదా! నీరేజపత్రేక్షణల్! !

    రిప్లయితొలగించండి
  12. నిర్దోషంబుగ నాత్మశుద్ధిగదురన్ నిత్యంబు నైర్మల్య సౌ
    హార్దమ్మున్ ప్రకటించు నిర్ధనుల నత్యాకారమున్ సల్పుచున్
    స్పర్ధన్ బూనుదు రంబుజాక్షులు నిరాసక్తిన్ ప్రదర్శించుచున్
    నిర్దాక్షిణ్యమనస్కులౌదురు గదా నీరేజపత్రేక్షణల్

    రిప్లయితొలగించండి
  13. శా:నిర్దేశించగ తల్లిదండ్రు లితడే నీ భర్త యంచున్,సదా
    స్వర్దానోపమతృప్తి నిచ్చెదరు సద్భామామణుల్,తుంటరుల్
    దుర్దృష్టిన్ బచరింప థూ యని కడున్ దూషించి పో ద్రోలుచున్
    నిర్దాక్షిణ్యమనస్కు లౌదురు కదా నీరేజపత్రేక్షణల్
    (స్వః+దానమ్ము=స్వర్దానము=స్వర్గాన్ని అందించటం.)

    రిప్లయితొలగించండి
  14. నిర్దాక్షిణ్యమనస్కులౌదురు గదా నీరేజపత్రేక్షణల్
    నిర్దాక్షిణ్యము తోడ నట్లును
    డువన్ నేరంబుగాదే సఖా!
    నిర్డాక్షిణ్యపు రీతి తోడన నేరంబుఁ జేకొందువే?
    హార్దంబొప్పగ సంచరింతురు సుమా హ్లాదింపఁగాఁదగున్

    రిప్లయితొలగించండి
  15. నిర్దయు లనదగు వారలు
    నిర్దయులై పలుకు చుండ్రు నిరతము పృధ్విన్
    హార్దతుల నిటుల భావ్యమె?
    నిర్దాక్షిణ్యహృదయులఁట నీరజనేత్రల్

    రిప్లయితొలగించండి
  16. కర్దమ మందుం గాలిడి
    దుర్దశ వడయంగ నేల దూఱఁగ నేలన్
    నిర్దయఁ బురుషుల నిట్లని
    "నిర్దాక్షిణ్య హృదయు లఁట" నీరజ నేత్రల్!


    దోర్దండద్వయ సత్త్వ దర్పితు లసంతుష్టుల్ దురుద్దేశులున్
    వార్దుశ్శీలు రసత్య భాషణులు దుర్వారాగ్రహావేశులున్
    దుర్దాంతుల్ మగవారు నిక్కముగ నిర్దోషమ్ము లే మీ గిరల్
    నిర్దాక్షిణ్య మనస్కు లౌదురు గదా నీరేజ పత్రేక్షణల్!

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. ఒక్క విశేషము గమనార్హము:
      సమస్యా పాదము లందున్న “ నిర్దాక్షిణ్య హృదయులు, మనస్కులు రెండును మహద్వాచకములె. నీరజ నేత్రల్, నీరేజపత్రేక్షణల్ రెండు స్త్రీవాచకములు గాన నా విశేషణములు వీని కన్వయింపవు.
      నా పూరణమున నవి పురుషులకు విశేషణములుగాఁ గూర్పఁబడినవి.

      తొలగించండి