8-1-2024 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్”(లేదా...)“అంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై”(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)
అడ్డుగనజ్ఞానంబునచెడ్డగతానుండుగదర చేతనలేకన్గడ్డనుగట్టిన మనసునగ్రుడ్డి, చెవిటి కుంపటియై నరుడు జన్మించున్
మీ పూరణ బాగున్నది
చెడ్డ పనులు చేయుచు తానడ్డఁపు దారుల చరించు నధముడు భువిలోనెడ్డెఁడు మరుజన్మములోగ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడుజన్మించున్
అడ్డము బెట్టుక పదవులగడ్డిని మేయంగ తగునె గర్హ్యమ్మది యాచెడ్డపనుల ఫలితమ్మున గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్
బావుంది
చక్కని పూరణ
🙏 రామరాజు గారు, గురువు గారు.
జిడ్డును గలిగిన నెత్తుటిగడ్డయె జనని ప్రసవించు కాలము నందున్ బిడ్డడు, కాంచగ ధరణిని గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్.అంధమె మాతృగర్భమది యండముగా నటజేరి పిండమై బంధము లెల్ల గూర్చుకుని బాహ్య ప్రపంచము జేరు నత్తరిన్ బంధుర రూపమున్న పసిపాప యశక్తుడె కాదె యెంచగానంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై.
మీ రెండు పూరణలు బాగున్నవి
చెడ్డను జేయుచు పరులకునడ్డముగా మనుచు సతము నావే శము తో గొడ్డు గ నుండె డి వాడేగ్రుడ్డి చెవిటి కుంటియై నరుడు జన్మించు న్
పొందుగ నందలమ్ముపయి బోవుచు కన్పడు నాడుబిడ్ఢలన్దందడిపెట్టుచున్ ధనమదంబున దుస్సహమైన రీతి నిర్బంధమొనర్చి నిర్దయగ బాములపెట్టగ వచ్చు జన్మలోనంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
బంధముజన్మలందుగనిపారముజూడకమాయ గ్రమ్మగాపందగరాముజాడగనపాదములాడకకుంటివాడునైరంధినిగల్గులౌకికమురాగలముప్పువినంగజాలడేఅంధుడుపంగువున్బధిరుడైమనుజుండుజనించుభూమిపై
ధన్యవాదములండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గ్రుడ్డిగ పాలన జేయుచుజడ్డల వినకుండి , యెదురు జనుల పదముపై,దుడ్డుజరచ మరు జన్మనగ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్
కందంఅడ్డక చెడుఁజూచి, వినన్జెడ్డ తలంపుల్, నిగుడఁగ నేరపు నడతందెడ్డిగ, మరుజన్మంబునగ్రుడ్డి, చెవిటి, కుంటియై, నరుఁడు జన్మించున్ఉత్పలమాలబంధుర శక్తితో చెడును బాపగ చూడక కళ్లు మూయ, నిర్బంధము సేయరెవ్వరని రంజిలి సాగగ దుష్టవర్తనన్,రంధిత ధూర్త భాషణవినంగ నహో! మరుజన్మమందుఁ దానంధుడు, పంగువున్, బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి
🙏ధన్యోస్మి గురుదేవా🙏
కం॥ చెడ్డగ దేశాధిపతులుగ్రుడ్డిగ నణ్వాస్త్రములను గూర్చుకొని యటుల్దొడ్డ జగడమున వాడఁగగ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్ఉ॥ సంధినిఁ జేయకుండఁగను సైయని యుద్ధముఁ జేయఁబూనిన్రంధిని వీడకుండఁగను రాజిలఁ జేయుచు దుర్మదాంధులైబంధన లేక వాడ నణుబాంబులఁ బర్యవసాన మిద్దియేనంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనియించు భూమిపై
ఇది వంద శాతము నిజమండి.
కందము రెండవ పాదములో అజాగ్రత్త వలన సంధి దోషమైనది. సవరించిన పాదము:గ్రుడ్డిగ నణ్వస్త్రములను గూర్చుకొని యటుల్క్షమించాలి
కం:అడ్డక నణుయుద్ధమ్ములనెడ్డె మనగ తెడ్డె మనుచు నెగబడి చేయన్బిడ్డల జన్మలు మసియౌగ్రుడ్డి,చెవిటి,కుంటి యై నరుడు జన్మించున్
మంచి పూరణ
ఉ:బంధువు సుంత బాగు పడ వానిని చూచుచు నేడ్చినంతటన్మంథర వోలె సజ్జనుల మార్గము లందున ముండ్లు వేసినన్ బంధువు మంచి జెప్పినను వానిని జుల్కన జేసి వాగగా నంథుడు ,పంగువున్, బధిరుడై మనుజుండు జనించు భూమి పై(క్రమాలంకారం- చూచి ఏడ్చినందుకు గ్రుడ్డి వాడిగా,మార్గాన్ని పాడు చేసినందుకు కుంటి వాడిగా,మంచి విననందుకు చెవిటి వాడిగా జన్మిస్తాడు.ఏ ఇంద్రియం చేసిన పాపానికి ఆ ఇంద్రియం పని చెయ్యదు అని.)
అడ్డపు దారుల వెంబడి యడ్డముగాఁ దోచుకొనుచు హర్మ్యము లెన్నో దొడ్డతనంబున గట్టిన గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్
దొడ్డగను స్థితప్రజ్ఞుండొడ్డోలగ మందు నుండ నుత్తమ రీతిం జెడ్డం గన విన నొనరుప గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్ సింధు గభీర చిత్తుఁడును స్వీయ కృతాఖిల పుణ్యహీనమేసంధిలఁగన్ ఋణాను గత జన్మ పరంపర లందు బల్మినిన్ బంధితుఁడై పురాకృత వివర్ధిత పాప ధురం ధరార్థమై యంధుఁడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి
ఉ.నంద కుమారుతో నిధివనంబున రాధిక రాసలీలలోసుందర నృత్యముల్ కనగఁ జొచ్చు మనుష్యుడు చిమ్మ చీకటిన్*అంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై*పొందు ననేక కష్టములు,.. భుక్తికిఁ గృష్ణ కటాక్షమే విధిన్.
బంధుర మైనపుట్టుకను బావనరీతిని దాఁదలంచకన్ బంధము లన్నియున్వదలి బారుల వెంబడి తిర్గు చున్నచో నంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపైబంధము లన్నిటిన్ మదిని బాగుగ హత్తిలఁ జూడగావలెన్
అంగ వికలాంగులను సతమప్రియమునగనుచు వెక్కిరించెడువాడు కర్మ ఫలముగలుగు మరుజన్మమందున గచ్చితముకుగ్రుడ్డి చెవిటి కుంటియై నరుడు జన్మించున్
సమస్యా పాదం కందం
చెడ్డజనులతోతిరుగుచునడ్డమయినయట్టిపనుల ననవరతంబున్కడ్డాయముగాచేసినగ్రుడ్డి చెవిటి కుంటియై నరుడు జన్మించున్బంధము లన్నియున్ మరచి బంధుజనమ్ములకెగ్గుచేయుచున్రంధినిచేయుచున్సతమురంగులుమార్చెడు దుష్టుడంత్యమున్సింధువునందుమున్గుచిరుచెట్టువలెన్మరుజన్మయందునన్*“అంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై”*
అడ్డుగనజ్ఞానంబున
రిప్లయితొలగించండిచెడ్డగతానుండుగదర చేతనలేకన్
గడ్డనుగట్టిన మనసున
గ్రుడ్డి, చెవిటి కుంపటియై నరుడు జన్మించున్
మీ పూరణ బాగున్నది
తొలగించండిచెడ్డ పనులు చేయుచు తా
రిప్లయితొలగించండినడ్డఁపు దారుల చరించు నధముడు భువిలో
నెడ్డెఁడు మరుజన్మములో
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడుజన్మించున్
మీ పూరణ బాగున్నది
తొలగించండిఅడ్డము బెట్టుక పదవుల
రిప్లయితొలగించండిగడ్డిని మేయంగ తగునె గర్హ్యమ్మది యా
చెడ్డపనుల ఫలితమ్మున
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్
బావుంది
తొలగించండిచక్కని పూరణ
తొలగించండి🙏 రామరాజు గారు, గురువు గారు.
తొలగించండిజిడ్డును గలిగిన నెత్తుటి
రిప్లయితొలగించండిగడ్డయె జనని ప్రసవించు కాలము నందున్
బిడ్డడు, కాంచగ ధరణిని
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్.
అంధమె మాతృగర్భమది యండముగా నటజేరి పిండమై
బంధము లెల్ల గూర్చుకుని బాహ్య ప్రపంచము జేరు నత్తరిన్
బంధుర రూపమున్న పసిపాప యశక్తుడె కాదె యెంచగా
నంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై.
మీ రెండు పూరణలు బాగున్నవి
తొలగించండిచెడ్డను జేయుచు పరులకు
రిప్లయితొలగించండినడ్డముగా మనుచు సతము నావే శము తో గొడ్డు గ నుండె డి వాడే
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుడు జన్మించు న్
మీ పూరణ బాగున్నది
తొలగించండిపొందుగ నందలమ్ముపయి బోవుచు కన్పడు నాడుబిడ్ఢలన్
రిప్లయితొలగించండిదందడిపెట్టుచున్ ధనమదంబున దుస్సహమైన రీతి ని
ర్బంధమొనర్చి నిర్దయగ బాములపెట్టగ వచ్చు జన్మలో
నంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండిబంధముజన్మలందుగనిపారముజూడకమాయ గ్రమ్మగా
రిప్లయితొలగించండిపందగరాముజాడగనపాదములాడకకుంటివాడునై
రంధినిగల్గులౌకికమురాగలముప్పువినంగజాలడే
అంధుడుపంగువున్బధిరుడైమనుజుండుజనించుభూమిపై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండిధన్యవాదములండి
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగ్రుడ్డిగ పాలన జేయుచు
రిప్లయితొలగించండిజడ్డల వినకుండి , యెదురు జనుల పదముపై,
దుడ్డుజరచ మరు జన్మన
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్
మీ పూరణ బాగున్నది
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅడ్డక చెడుఁజూచి, వినన్
జెడ్డ తలంపుల్, నిగుడఁగ నేరపు నడతం
దెడ్డిగ, మరుజన్మంబున
గ్రుడ్డి, చెవిటి, కుంటియై, నరుఁడు జన్మించున్
ఉత్పలమాల
బంధుర శక్తితో చెడును బాపగ చూడక కళ్లు మూయ, ని
ర్బంధము సేయరెవ్వరని రంజిలి సాగగ దుష్టవర్తనన్,
రంధిత ధూర్త భాషణవినంగ నహో! మరుజన్మమందుఁ దా
నంధుడు, పంగువున్, బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండికం॥ చెడ్డగ దేశాధిపతులు
రిప్లయితొలగించండిగ్రుడ్డిగ నణ్వాస్త్రములను గూర్చుకొని యటుల్
దొడ్డ జగడమున వాడఁగ
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్
ఉ॥ సంధినిఁ జేయకుండఁగను సైయని యుద్ధముఁ జేయఁబూనిన్
రంధిని వీడకుండఁగను రాజిలఁ జేయుచు దుర్మదాంధులై
బంధన లేక వాడ నణుబాంబులఁ బర్యవసాన మిద్దియే
నంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనియించు భూమిపై
ఇది వంద శాతము నిజమండి.
తొలగించండికందము రెండవ పాదములో అజాగ్రత్త వలన సంధి దోషమైనది. సవరించిన పాదము:
తొలగించండిగ్రుడ్డిగ నణ్వస్త్రములను గూర్చుకొని యటుల్
క్షమించాలి
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి
తొలగించండికం:అడ్డక నణుయుద్ధమ్ముల
రిప్లయితొలగించండినెడ్డె మనగ తెడ్డె మనుచు నెగబడి చేయన్
బిడ్డల జన్మలు మసియౌ
గ్రుడ్డి,చెవిటి,కుంటి యై నరుడు జన్మించున్
మంచి పూరణ
తొలగించండిఉ:బంధువు సుంత బాగు పడ వానిని చూచుచు నేడ్చినంతటన్
రిప్లయితొలగించండిమంథర వోలె సజ్జనుల మార్గము లందున ముండ్లు వేసినన్
బంధువు మంచి జెప్పినను వానిని జుల్కన జేసి వాగగా
నంథుడు ,పంగువున్, బధిరుడై మనుజుండు జనించు భూమి పై
(క్రమాలంకారం- చూచి ఏడ్చినందుకు గ్రుడ్డి వాడిగా,మార్గాన్ని పాడు చేసినందుకు కుంటి వాడిగా,మంచి విననందుకు చెవిటి వాడిగా జన్మిస్తాడు.ఏ ఇంద్రియం చేసిన పాపానికి ఆ ఇంద్రియం పని చెయ్యదు అని.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండిఅడ్డపు దారుల వెంబడి
రిప్లయితొలగించండియడ్డముగాఁ దోచుకొనుచు హర్మ్యము లెన్నో
దొడ్డతనంబున గట్టిన
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్
మీ పూరణ బాగున్నది
తొలగించండిదొడ్డగను స్థితప్రజ్ఞుం
రిప్లయితొలగించండిడొడ్డోలగ మందు నుండ నుత్తమ రీతిం
జెడ్డం గన విన నొనరుప
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్
సింధు గభీర చిత్తుఁడును స్వీయ కృతాఖిల పుణ్యహీనమే
సంధిలఁగన్ ఋణాను గత జన్మ పరంపర లందు బల్మినిన్
బంధితుఁడై పురాకృత వివర్ధిత పాప ధురం ధరార్థమై
యంధుఁడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి
తొలగించండిఉ.
రిప్లయితొలగించండినంద కుమారుతో నిధివనంబున రాధిక రాసలీలలో
సుందర నృత్యముల్ కనగఁ జొచ్చు మనుష్యుడు చిమ్మ చీకటిన్
*అంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై*
పొందు ననేక కష్టములు,.. భుక్తికిఁ గృష్ణ కటాక్షమే విధిన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండిబంధుర మైనపుట్టుకను బావనరీతిని దాఁదలంచకన్
రిప్లయితొలగించండిబంధము లన్నియున్వదలి బారుల వెంబడి తిర్గు చున్నచో
నంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై
బంధము లన్నిటిన్ మదిని బాగుగ హత్తిలఁ జూడగావలెన్
మీ పూరణ బాగున్నది
తొలగించండి
రిప్లయితొలగించండిఅంగ వికలాంగులను సతమప్రియమున
గనుచు వెక్కిరించెడువాడు కర్మ ఫలము
గలుగు మరుజన్మమందున గచ్చితముకు
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుడు జన్మించున్
సమస్యా పాదం కందం
తొలగించండి
రిప్లయితొలగించండిచెడ్డజనులతోతిరుగుచు
నడ్డమయినయట్టిపనుల ననవరతంబున్
కడ్డాయముగాచేసిన
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుడు జన్మించున్
బంధము లన్నియున్ మరచి బంధుజనమ్ములకెగ్గుచేయుచున్
రంధినిచేయుచున్సతమురంగులుమార్చెడు దుష్టుడంత్యమున్
సింధువునందుమున్గుచిరుచెట్టువలెన్మరుజన్మయందునన్
*“అంధుడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై”*