28, జనవరి 2024, ఆదివారం

సమస్య - 4659

29-1-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా”
(లేదా...)
“చేపల బేరసారములఁ జేసెడి తావున శాంతి లభ్యమౌ”

40 కామెంట్‌లు:

  1. తోపగనీకనుసభలో
    ఆపగలేనిదిములుకునునట్లౌపలుకున్
    చూపగశాసనసభ్యులు
    చేపలయంగడినిశాంతిచేకూరుగదా

    రిప్లయితొలగించండి
  2. కాపుకు క్షుత్తు కలుగగనె
    నాపుకొనగ నలవి కాక నలమటపడగన్
    దాపున కనిపించెడు యా
    చేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా

    రిప్లయితొలగించండి
  3. చూపుచుకాఠిన్యంబుమధుసూదనుదోడ్కొనివీథిద్రిప్పగా
    తాపమునాపలేకవనితామణిసత్యయువేడెనంతటన్
    తాపసివశ్యునిన్గనుచుదారిని పౌరులు గుంపుగూడిరే

    చేపలబేరసారములఁజేసెడితావునశాంతిలభ్యమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి

      తొలగించండి
    2. పొరపాటైనది, క్షమించగలరు
      సవరణ తో
      చూపుచుకార్యమందుమధుసూదనుదోడ్కొనివీథిద్రిప్పగా
      తాపమునాపలేనివనితామణిసత్యయుగాసిజెందెగా
      తాపసివశ్యునిన్గనుచుదారిని పౌరులు గుంపుగూడిరే
      చేపలబేరసారములజేసెడితావునశాంతిలభ్యమౌ

      తొలగించండి
  4. బాపురె! యుచితపు పంపిని
    యాపురి జనులెల్ల గనియు నచ్చోటను వా
    రాపని ధ్వనిగని చేరిన
    చేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా

    రిప్లయితొలగించండి

  5. *(కూతురు శాంతి తప్పిపోయినదని బాధపడు వానితోనతని మిత్రుని మాటలు )*


    కోపముతో తిట్టగ పసి
    పాపయె తా పారెనంచు వగచుట మేలా?
    యాపగ దాపున బోయల
    చేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా.



    కోపము తోడతిట్టగనె కూతురు భీతిలి పారెనంచు నీ
    వా పసి దానికోసమయి యాక్రమమేల తితిక్షజూపి సం
    తాపము వీడి సాగరిగ దాపున కేగుచు బోయలెల్లరుల్
    చేపల బేరసారములఁ జేసెడి తావున శాంతి లభ్యమౌ.

    రిప్లయితొలగించండి
  6. మాపటి వేళను మధువును
    దాపున బారునను ద్రాగి దర హాస ము తో
    దీపమును జూచి వెడలగ
    చేపల యo గడిని శాంతి చేకూరు గదా!

    రిప్లయితొలగించండి
  7. మాపొరుగున వసియించెడు
    గోపాలుడుగారియింట గొడవలు వలముల్
    దాపున నుండుట కన్నను
    చేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా

    రిప్లయితొలగించండి
  8. వ్యాపారమ్మునకు ప్రభుత
    చేపలయంగళులఁ దెఱచు చింతన విడువన్
    దాపుల నెలకొనియుండిన
    చేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోపము ద్వేషభావమును కుత్సిత బుద్ధియు తొంగిచూడగా
      శాపమువెట్టుచుంద్రు మన శాసన సభ్యులు నేటి నేతలున్
      చేపల బేరసారములఁ జేసెడి తావున శాంతి లభ్యమౌ
      నా పగలంతమైనయెడ నాయక ముఖ్యుల తీరుమారునా

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు

      తొలగించండి
  9. ఉత్పలమాల:
    మాపొరుగింటి యందు గల మాధవరావుకు వాని పత్నికిన్
    గోపము మెండు యొండొరులు గోప్యము నెంచక నెల్ల వేళలం
    దాపక వాగ్వివాదముల నల్లరి చేయుదు రింటికన్ననా
    చేపల బేరసారములఁ జేసెడి తావున శాంతి లభ్యమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు
      మెండు+ఒండొరులు అన్నపుడు యడాగమం రాదు

      తొలగించండి
    2. 'కోపమపారమొండొరులు' అని మార్చుకుంటానండి 🙏

      తొలగించండి
  10. లోభియైన పతితో సతి:

    కందం
    చూపుల కోడిని జూచుచు
    సాపడెదవు చప్పిడైన! చాపవు చేతిన్
    వేపుడడిగి చేపలు కొన!
    చేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా!

    ఉత్పలమాల
    కాపురమందునేననఁగ కాలిడి నప్పటి నుండి లోభివై
    చూపులు కోడిపై నిలిపి జుర్రెదె చప్పిడి మాంసమంచహో!
    వేపుడు నెంచి చేపలకు విత్తమొసంగవు! కూడు మెక్కుమా!
    చేపల బేరసారములఁ జేసెడి తావున! శాంతి లభ్యమౌ!!

    (అహనాపెళ్లంట! చిత్రములో లోభియైన కోట శ్రీనివాసరావు పాత్ర)

    రిప్లయితొలగించండి
  11. కం॥ చేపలన యిష్టము సతికి
    కోపముఁ గనదు కబళమునఁ గొరమీనున్నన్
    బ్రాపుగ నెపుడును భర్తకు
    చేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా

    ఉ॥ చేపలు భోజనమ్మునను జేరఁగ మోదమటంచుఁ దెల్పఁగా
    నాపఁగఁ గోపతాపముల నాతని కెప్పుడు భార్య బాధ్యతై
    దాపున యున్న యంగడికి తప్పక నిత్యముఁ జేరు చున్నచో
    చేపల బేరసారములు చేసెడి తావున శాంతి లభ్యమౌ

    దక్షిణాది వారు తూర్పు భారతావని వారిని వివాహమాడిన ఈ స్థితి రావచ్చండి. అందుకే ఆడ మగ ఇద్దరికీ అన్వయించాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు
      కందంలో.. చేపలన నిష్టము.. అనండి
      వృత్తంలో బాధ్యత+ఐ అన్నపుడు సంధి లేదు. దాపున నున్న అనండి

      తొలగించండి
  12. కం:చేపల బేరము వదలుక
    బాపన వారింటి పెండ్లి పప్పన్నపు మో
    జై పోతి, తిండి యిపుడా?
    చేపల యంగడిని శాంతి చేకూరు కదా
    (బ్రాహ్మణకుటుంబాలలో భోజనాలు ఆలస్య మని ప్రతీతి.)

    రిప్లయితొలగించండి
  13. ఉ:చేపల బేరమున్ సలిపి, చేరితి, గెల్చితి రాజకీయమం,
    "దే పదవిన్ గ్రహింతు" వన నిట్లు వచించితి,మత్స్యశాఖ నే
    లోపము లేక జూతు ,నను లోగడ నమ్మిన వారి మంత్రి నై
    చేపల బేరసారముల జేసెడి తావున శాంతి లభ్యమౌ"
    (చేపల బేరం చేసిన వెనుకబడిన కులం వ్యక్తి రాజకీయాలలో నెగ్గాడు.తమ పరిశ్రమని,తన వారిని ఆదుకోటానికి మత్స్యశాఖా మంత్రి పదవే కావా లన్నాడు.)

    రిప్లయితొలగించండి
  14. కోపము కలిగిన దంపతు
    లాపగలుంఱేయిగూడ యాపని పోరున్
    బాపుట కష్టము గావున
    చేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా

    రిప్లయితొలగించండి
  15. ఉ.

    కాపులు బీదవారలయి కష్టము దున్నగ క్షేత్రమందునన్
    దీపగు వంటకంబులను తిండిని నొందక మూర్ఖ పాలనన్
    గోపముతో సముద్ర తటి గొందరు వెల్వడి మాటలాడెడిన్
    *జేపల బేరసారములఁ జేసెడి తావున శాంతి లభ్యమౌ!*

    రిప్లయితొలగించండి
  16. తాప మొసంగెడు తర్కము
    లాప కిటులఁ జాగు చుండ ననవరతమ్ముం
    జూపఱుల కిచట కన్నను
    జేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా


    పాప యొకర్తె యేఁగె నని వంతను జెందఁగ నేల శాంతికై
    యోపిక తోడ మార్గణము నుత్తమ రీతి నొనర్ప నొప్పునే
    చేపల కూర యన్న మఱి చెప్ప నశక్యపు టిష్ట మౌఁ గదా
    చేపల బేరసారములఁ జేసెడి తావున శాంతి లభ్యమౌ

    రిప్లయితొలగించండి
  17. కోపము నొందు దంపతులు క్రుద్ధత తోడను బోరుసల్పగా
    నాపగలుంమిక్కిలిగ నార్చుచు ఱొంపుచు గీము నంతయున్
    గంపుగ మార,యచ్చటను గాపుర ముండుట కంటెను వేఱు చోట యా
    చేపల బేరసారములఁ జేసెడి తావున శాంతి లభ్యమౌ”

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    వేపుకు తిను నర్ధాంగియు
    నాపక కోర్కెలను తెలుపు నధికపు సంతున్
    ఓపగ లేక పలికెనిటు
    చేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా!

    రిప్లయితొలగించండి