26, జనవరి 2024, శుక్రవారం

సమస్య - 4657

27-1-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవిత వ్రాయని కవి పురస్కారమందు”
(లేదా...)
“కవితల్ వ్రాయఁగలేని వానికె పురస్కారంబు దక్కున్ గదా”

(హైదరాబాదులో నేను 'పోకూరి కాశీపతి' పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)

29 కామెంట్‌లు:

  1. -

    కవిత వ్రాయని కవిపురస్కారమందు
    నా! జిలేబి యత్నము చేయ న్యాయమగును
    మేలు పట్టుగల్గును భాష మీద కష్ట
    పడిన వారికి ఫలితము వాసి వాసి


    రిప్లయితొలగించండి

  2. కూళుడు విసురు కాసుల కోసమంచు
    వాని నింద్రుడు చంద్రుడు భాను తేజు
    డంచు పొగుడుచు వ్రాసెడి యధమమైన
    కవిత వ్రాయని కవి పురస్కారమందు.

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    అల్లి కవనము కైవల్యమందుకొనఁగ
    పోతనార్యునివలెనెంచి పూనికఁ గొని
    చక్కని కృతులఁగూర్చి నిస్సారమైన
    కవిత వ్రాయని కవి పురస్కారమందు


    మత్తేభవిక్రీడితము
    కవనమ్మే తనకందినట్టి వరమై గైవల్యమందించునన్
    ధ్రువసంకల్పము పోతనార్యుమదిలో రూఢించి నట్లెంచియున్
    సవనమ్మంచు రచించిమేటి కృతులన్సాధించి, నిస్సారమౌ
    కవితల్ వ్రాయఁగలేని వానికె పురస్కారంబు దక్కున్ గదా!

    రిప్లయితొలగించండి

  4. అవనీజానిని జేరి సంతతము తానందించు ద్రవ్యమ్ముకై
    శివతుల్యుండవు గట్లసూడవనుచున్ శ్రేష్ఠుండ వీవంచు నీ
    భువికే మూలము నీవటంచు కడు జీమూండ్రంపు భావమ్ముతో
    కవితల్ వ్రాయగ లేని వానికె పురష్కారంబు దక్కున్ గదా.

    రిప్లయితొలగించండి
  5. ప్రస్తుతపు కాలమందున వ్రాయుచున్న
    కవులు వెలసిరి యెందరో కాని జనులు
    మెచ్చ నటువంటి దుర్నీతి తుచ్చమైన
    కవిత వ్రాయని కవి పురస్కారమందు

    రిప్లయితొలగించండి
  6. గొప్ప కీర్తిగల కవులు కూడినట్టి
    తావునందు ప్రాసయతుల తప్పులున్న
    కవిత వ్రాయని కవి పురస్కారమందు
    కొనునట్లుగ కొనసాగ కోరుకొందు

    రిప్లయితొలగించండి
  7. పదవి లో నున్న నేతల ప్ర స్తు తించి
    మన్నన లు బొంది వారిని మభ్య పెట్టి
    కవిత వ్రాయని కవి పుర స్కార మందు
    కోర డట్టి ది సత్కవి క్రూర మనుచు

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. అవధానమ్మను ప్రక్రియన్ గవులు వ్రాయంగా వశంబౌనటే
      కవి యాప్రశ్నల కైతలెల్ల మదలో కానించి వేగాన త
      త్కవనవ్రాతము నప్పగించు ఘన ధీకాంతాస్వరూపుల్ మహిన్
      *కవితల్ వ్రాయఁగలేని వానికె పురస్కారంబు దక్కున్ గదా*

      తొలగించండి
  9. పోడిమిగల రచనలను ప్రోత్సహించ
    నిత్తురిట పురస్కారముల్ నెమ్మితోడ
    కవిత వ్రాయని కవి పురస్కారమందు
    కున్న యెడల దానివిలువ సున్నయౌను

    కవితల్ యోగ్యతలేనివైననెడ పురస్కారంబులందించునా
    కవితల్ నవ్య రసాన్వితంబులగు సత్కావ్యంబులై నిల్చినన్
    నవనీతంబుని మెచ్చుకొంద్రు రసహీనంబైనవౌ క్షుద్రమౌ
    కవితల్ వ్రాయఁగలేని వానికె పురస్కారంబు దక్కున్ గదా

    రిప్లయితొలగించండి
  10. కవులన్ తీరిచిదిద్ది పద్యరచనల్ గావించి లోపంబులన్
    వివరించున్ సరిజూచుకొమ్మనుచు నా విద్వన్మణిన్ మద్గురున్
    కవి ధుర్యుండని గౌరవించుటయె సంస్కారమ్ము వైయర్థ్యమౌ
    కవితల్ వ్రాయఁగలేని వానికె పురస్కారంబు దక్కున్ గదా

    రిప్లయితొలగించండి
  11. కవితలల్లుచు వ్రాయుచు కావ్యములను
    నిత్యమదియొక క్రతువుగా నెరపునట్టి
    సుకవియే మాననీయుడు శుష్కమైన
    కవిత వ్రాయని కవి పురస్కారమందు

    రిప్లయితొలగించండి
  12. తే॥ కవిత లల్లుట సుకృతము కలుగఁ బోదు
    సర్వులకు ఘన కవితల సార మరసి
    తనిచి మురియు విబుధులున్నఁ గన నెటులను
    కవిత వ్రాయని కవి పురస్కారమందు

    మ॥ కవితా మాధురిఁ బంచి పోతన పురస్కారంబు నాశించెనా
    కవితా పాటవ సౌరభమ్ముఁ గను సంస్కారంబు సద్భాగ్యమే!
    కవితల్ వ్రాయఁగలేని వానికె పురస్కారంబు దక్కున్ గదా
    భువిలో యన్నను దప్పు సత్కవులనే పూజింతురీ ధాత్రిలో

    మీరు శ్రీ పోకూరి కాశీపతి గారి పురస్కార మందుకున్న సందర్భంగా శుభాభినందనలండి

    రిప్లయితొలగించండి
  13. దుష్ట జనములఁ గీర్తించు దుష్ట మైన
    కవిత వ్రాయని కవి పురస్కారమందు
    కవిత జనులకు ప్రేరణ కల్గి యుండి
    శాంతి, సౌఖ్యము నిడవలె సర్వులకును

    రిప్లయితొలగించండి
  14. స్వీయ పాండిత్య గరిమ విశేషమునకు
    లోక విఖ్యాత పండిత లోక పరమ
    మాన్య కావ్య సంచయ సద్విమర్శవాది
    కవిత వ్రాయని కవి పురస్కార మందు


    రవి వంశోద్భవ రామ భక్తునకునాహ్లాదమ్ము సేకూర్పఁగా
    ధ్రువ తారా సదృశమ్ము శాశ్వత యశో ధుర్యమ్ము నిత్యమ్ము స
    త్కవియౌ బమ్మెర పోతరాజునకు భక్తత్రాణ పద్మాక్షు స
    త్కవితల్ వ్రాయఁగ, లేనివానికె, పురస్కారంబు దక్కున్ గదా

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    మంచి కవితల నల్లుచు మానవులకు
    ప్రేరణ కలుగ జేసెడు విధముగాను
    సత్కవులు మెచ్చుకొనగ నిస్సారమైన
    కవిత వ్రాయని కవి పురస్కారమందు.

    రిప్లయితొలగించండి
  16. ధనమదొకటున్న చాలును ధరణి యందు
    నడ్డ దారిన నడచుచు నంతులేని
    పేరు పడయచు సతతము విస్తృతమగు
    కవిత వ్రాయని కవి పురస్కార మందు.

    రిప్లయితొలగించండి