5, జనవరి 2024, శుక్రవారం

సమస్య - 4637

6-1-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యోగి గాని నాయకుఁడగు యోగ్యుఁ డేల”
(లేదా...)
“యోగులు గాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలఁగన్”
(క్రొవ్విడి వేంకట రాజారావు గారికి ధన్యవాదాలతో...)

31 కామెంట్‌లు:

  1. వేఁగనె తాత్వికుండునట ప్లేటొయనంగనువాడు విజ్ఞుడై
    భోగియుకానివాడుగద పుణ్యవిశేషుడు రాజ్యమేలగన్

    త్యాగముసేయువాడునిక చాలడునాధునికంపురాజుగా
    యోగియుకానినాయకులె యోగ్యులు భారత భూమినేలగన్

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    యోగి గాని నాయకుఁడగు యోగ్యుఁ డేల?
    కనక యున్నంతలో తృప్తి మనక గుహల
    వదలి వైరాగ్యభావనల్ కదను ద్రొక్కి
    ప్రజల బ్రతుకులు నభివృద్ధి పథమునడుప

    ఉత్పలమాల
    సాగుచునున్నతిన్ బ్రజల సౌఖ్యమె గమ్యమటన్న దృష్టిమై
    వేగ పురోగమించి నభివృద్ధి పథమ్మున నిల్పదేశమున్
    మూగగ ముక్కనోరులను మూసి జపాల విరాగ భావనన్
    యోగులు గాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలఁగన్

    రిప్లయితొలగించండి
  3. మూగ జనావళిన్ పరమ మూర్ఖులనెంచుచు నేటి నాయకుల్
    ఆగని మందు ధారలును అంబరమంటెడు ఆశచూపుచున్
    బాగుగ డబ్బు పంచుటయె భారత భూమిన పాడిగావుతన్
    యోగులు గాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలఁగన్

    రిప్లయితొలగించండి
  4. జనుల హృదయాల వెలిగించి జ్ఞాన దీప్తి
    న్యాయ మార్గము ధర్మము నాచరించి
    ఫలము గోరక కర్మించు పరమ కర్మ
    యోగి గాని నాయకుఁడగు యోగ్యుఁ డేల ?

    రిప్లయితొలగించండి
  5. ప్రజలచే నెన్నుకొనబడు ప్రతినిదుండు
    దనదు సంపాదననుబెంచు తలపెకాని
    పరగ నిస్వార్థుడయి తన ప్రజలకునుప
    యేగి గాని నాయకుడగుయోగ్యుడేల?

    రిప్లయితొలగించండి

  6. జాగృత మ్మించుకయు లేని జనులు చూడ
    యోటుకు ధనమిచ్చినవాడె మేటి యనుచు
    దుర్మతులభజనలు చేయు మర్మమేమి?
    యోగి గాని నాయకుఁడగు , యోగ్యుఁ డేల?


    జాగృతిలేని లోకులకు జాస్తిగా మద్యము పైకమిచ్చుచున్
    భోగము మీద మోజుగల మూర్ఖులు జేరిరి రాజకీయమే
    మేగలగా దలంచిగద, మేలును గూర్చని నీచులా
    సదు
    ద్యోగులు గాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలఁగన్.

    రిప్లయితొలగించండి
  7. రాగ ద్వేష రహితుడే స్మరణముజేయ
    యోగి గాని ; నాయకుఁడగు యోగ్యుఁ డేల
    జాగు సలుపు ? తన జనుల సాగుబడియు,
    బాగు కీడుల నెంచుచు భరణమిడును

    రిప్లయితొలగించండి
  8. ధర్మ పాలన సాగించు దక్షు డగుచు
    ప్రజల మెప్పును బడయుచు పరగు చుండు
    పార దర్శకు డై వెల్గు పరమ రాజ
    యోగి గాని నాయకు డగు యోగ్యు డేల?

    రిప్లయితొలగించండి
  9. త్యాగమె జీవితమ్ముగ సదా జనపాలన చేయు నాయకుల్
    యోగులువారు యోగ్యవరులున్నతి గోరుదు రెల్లవారికిన్
    భోగములందు రక్తియును భుక్తియె ధ్యేయముగా దలంచు ను
    ద్యోగులు గాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలఁగన్

    రిప్లయితొలగించండి
  10. త్యాగ నిరతియు సజ్జనోద్ధారణమ్ము
    ధ్యేయముగ పాలనము జేయు ధీరవరుడు
    నేల నేలగ నెమ్మియౌ నియతిలేని
    యోగి గాని నాయకుఁడగు యోగ్యుఁ డేల

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:యోగి ఆదిత్య నాథుడు యువకునిగనె
    యోగి యయ్యెను,సత్కీర్తి నొంది నట్టి
    యోగి కాని, నాయకు డగు యోగ్యు డేల
    యోగిగనె యుండు? నొక కర్మ యోగి యయ్యె

    రిప్లయితొలగించండి
  12. ఉ:యోగిగ,జ్ఞాన మార్గమున నుండ దలంచు నృసింహ రావుకున్
    యోగ మదెట్లు కల్గెనొ! అనూహ్యపు రీతి బ్రథానమంత్రియౌ
    యోగము దక్కె,కర్మపర యోగము మే లని,స్వాత్మశాంతి కై
    యోగులు కాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలగన్

    రిప్లయితొలగించండి
  13. తే॥యోగియై జనుల హితపు యోచన నిడి
    ధీరుఁడై జన సౌఖ్యము దిటవు తోడ
    నరయుచు చనెడి గుణశీలి యధిపుఁడన
    యోగి గాని నాయకుఁడగు యోగ్యుఁ డేల

    ఉ॥ భోగము భాగ్య మందునను ముచ్చటఁ గాంచక మానవాళికిన్
    బాగుగ మేలు సేయఁగను బాధ్యత టంచును దల్చి సర్వదా
    సాగుచు నుండు పాలకుఁడు చక్కని ధీరుడుఁ గాకఁ దప్పునా
    యోగులు గాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలఁగన్

    ఈరోజు రెండు సమస్యల నడుమ వ్యత్యాసము కనిపించిందండి.
    మొదట తే॥ సమస్య యోగి గాని నాయకుఁడగు యోగ్యుఁ డిల అనుకున్నానండి

    రిప్లయితొలగించండి
  14. తే.గీ:అతడు కులవిద్య కరిణీకమైన యొక ని
    యోగి, కాని నాయకుడగు యోగ్యు డేల
    కులపు వృత్తికి బద్ధుడౌ? గురుతరమగు
    బ్రతిభ జూపుచు నేలె నీ భారతమును.
    (పి వి గారు నియోగి బ్రాహ్మణుడు.వారినే తెలంగాణా లో కరణాలు అని అంటారు.కరిణీకం అనేది వృత్తి కానీ కులానికే ఆ పేరు వచ్చింది.)

    రిప్లయితొలగించండి
  15. ఉ.

    రోగముగా గణించగను రూకలు పక్షములందు హీనమై
    భాగములెంచుచున్ బదవి వర్ణము వంశము లక్ష్యపెట్టెడిన్
    జాగుఁ దృతీయ ముఖ్యజన సాతిగ రాష్ట్రము దక్క దుర్దశన్
    *యోగులు గాని నాయకులె యోగ్యులు భారతభూమి నేలఁగన్.*

    రిప్లయితొలగించండి
  16. నిరతి లేని నరుండు మౌని యగు నేల
    ప్రేమి గాని వాఁ డగును వివేకి యేల
    చదువ నట్టి జనుఁ డగును జ్ఞాని యేల
    యోగి గాని నాయకుఁ డగు యోగ్యుఁ డేల


    త్యాగ మెఱుంగు వారు నిజ ధర్మము నేరిన యట్టి వారలున్
    భోగులు కాని వారు మఱి బొంకులు పల్కని యట్టి వారు వై
    రాగులు కాని వారును బ్రలాప రతాత్ములు ద్వేష పూరి తో
    ద్యోగులు గాని నాయకులె యోగ్యులు భారత భూమి నేలఁగన్

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    స్వార్ధ మిసుమంత లేక ప్రజలకు మేలు
    చేయు భావనల్ మనమున చిందులాడ పక్షపాత ధోరణులను ప్రక్కన నిడు
    యోగి గాని నాయకుడగు యోగ్యుడేల.

    రిప్లయితొలగించండి