31, జనవరి 2024, బుధవారం

సమస్య - 4662

1-2-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దోసిటం బట్టి సంద్రమున్ దోడవచ్చు”
(లేదా...)
“దోసిటఁ బట్టి సంద్రమును దోడఁగవచ్చు నటన్న సత్యమే”

31 కామెంట్‌లు:

 1. బొందితోడనె నాకము బొలయవచ్చు
  అధ్వగుని యర చేతితో నాపవచ్చు
  దోసిటం బట్టి సంద్రమున్ దోడవచ్చు
  స్వప్నమందేపని నయిన చలుప వచ్చు

  రిప్లయితొలగించండి
 2. చిన్నిపిచ్చుకజేర్చుగా చితుకునొకట
  కట్టెగూడునుతానుగా కలలు పండ్రెండు
  సాధనంబునకర్మంబుశాంతినిచ్చు
  దోసిటన్బట్టిసంద్రమున్ దోడవచ్చు

  రిప్లయితొలగించండి

 3. గరికతోడ శత్రువుతల నరక వచ్చు
  శశిని భూతలమునకు దించగను వచ్చు
  దోసిటం బట్టి సంద్రమున్ దోడవచ్చు
  కాని మార్చంగలేమిల కరటి మదిని.

  రిప్లయితొలగించండి
 4. వాసిగగొల్లభామలునువైనముతోడుత వెన్నఁజిల్కుచున్
  చేసిరియోగసాధనను చేలమువట్టగ చిన్ని కృష్ణుడున్
  ఆసిరివల్లభుండునహనావిధివశ్యుడునయ్యెగోలకున్
  దోసిలిబట్టిసంద్రమున్ దోడగవచ్చునటన్నసత్యమే

  రిప్లయితొలగించండి
 5. తేటగీతి
  అన్నదాతకు సంకటమంచు వేడ
  నెండలిట్లున్న రాదె కాసింతవాన?
  దప్పి తీరఁగ లోకమ్ము దరికిఁ జేరి
  దోసిటం బట్టి సంద్రమున్ దోడవచ్చు!

  ఉత్పలమాల
  ఆసలు దీర నాట్లిడుచు నార్తిగ రైతులు నన్నదాతలున్
  జేసిన పూజలున్ దలఁచి చిన్కులు రాల్చడె వానదేవుడున్
  వాసిగ లోకులెల్లరును పర్గులు వెట్టుచు దప్పి తీరఁగన్
  దోసిటఁ బట్టి సంద్రమును దోడఁగవచ్చు నటన్న సత్యమే!

  రిప్లయితొలగించండి
 6. జలము సృష్టి o చ వచ్చును శిలల యందు
  చేదు నెంతైన మ్రింగుట జేయ వచ్చు
  దోసిటన్ బట్టి సంద్రమున్ దో డ వచ్చు
  దుష్టు మార్చుట నిల లోన గష్ట మౌను

  రిప్లయితొలగించండి
 7. దోసిటం బట్టి సంద్రమున్ దోడవచ్చు
  ఆకసమునున్న చుక్కల నంద వచ్చు
  తొడరి తపమున సద్గతి బడయ వచ్చు
  నెలత చిత్తము నెవ్వండు యెరుగగలడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఎవ్వండు + ఎరుగ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ".. నెవడైన నెరుగగలడె" అనండి.

   తొలగించండి
 8. తే.గీ. ll
  నలుపుఁ దొలఁగించ సాధ్యమౌ నెలుక తోలు
  కుక్కతోక వంకరను పోగొట్టవచ్చు
  దోసిటం బట్టి సంద్రమున్ దోడవచ్చు
  ఖలుని సుజనునిగా మార్చ నలువ వశమె?

  రిప్లయితొలగించండి

 9. సుద్దులెన్నియొ చెప్పుచున్ బుద్ధి లేని
  శఠుని మదిని మార్చుటదియె సాధ్యమైన
  జగతిని యసాధ్య మేలేదు సాధకుండు
  దోసిటం బట్టి సంద్రమున్ దోడవచ్చు

  రిప్లయితొలగించండి
 10. శాసకు డైన యర్థపతి జాలిని చూపుచు స్వార్థచిత్తుడై
  మోసము చేసి లాభముల బొందెడు నీచుడు గట్టివాని సం
  వాసము మార్చగను వచ్చను మాటయె నిక్కమైనచో
  దోసిటఁ బట్టి సంద్రమును దోడఁగవచ్చు నటన్న సత్యమే.

  రిప్లయితొలగించండి

 11. కఠిన పాషాణ చిత్తము కల్గియున్న
  ముదిత కౌగిటఁ బంధించి మురియ వచ్చు
  సకియ హృదయము వలపుల సంద్రమైన
  దోసిటం బట్టి సంద్రమున్ దోడవచ్చు

  కాసుల కుంభకోణములఁ గన్గొన నేతల నేర్పు తెల్లమౌ
  చేసిరి పాపకృత్యములు చీకటి మాటున మిక్కుటంబుగా
  మేసినగడ్డితో నెనసి మేడలు మిద్దెలు కట్టసాధ్యమే
  దోసిటఁ బట్టి సంద్రమును దోడఁగవచ్చు నటన్న సత్యమే

  రిప్లయితొలగించండి
 12. ఉత్పలమాల:
  గాసిలి మూషికంపు మసిఁ గ్రన్నన మాపఁగ సాధ్యమౌను సం
  వాసముగూడ చేయనగు బాళిగ సింగముతో వనంబునన్
  దోసిటఁ బట్టి సంద్రమును దోడఁగవచ్చు నటన్న సత్యమే
  వాసిగ దుర్విదగ్ధునొక వంద్యునిగా తొరలింప శక్యమే!

  రిప్లయితొలగించండి
 13. తే॥ నిత్య సాధనా ఫలముగ సత్య మయ్య
  యిలన సాధ్యమనెడి పద మేది కనము
  శాస్త్ర విజ్ఞత నొకనాఁడు చక్కఁ గాను
  దోసిటం బట్టి సంద్రమున్ దోడవచ్చు

  ఉ॥ మోసముఁ జేయు మానవుల బుద్ధిని మార్చుట సాధ్యమైనచో
  ప్రాసయె లేని వృత్తమును బాటవ మొప్పఁగఁ బల్కఁ గల్గినన్
  జేసిన బాసలన్నియును జేవగఁ దీర్చిన నాయకాగ్రజుల్
  దోసిటఁ బట్టి సంద్రమును దోడఁగ వచ్చు నటన్న సత్యమే

  కన్నడ భాషలో అతి చిన్న పద్యము త్రిపది 3 పాదముల (4,4,3 గణాలు) పద్యము. అందులోను ప్రాస తప్పనిసరి. నాకు కన్నడ ఛందస్సు తెలియదండి. ఊరకే చూసానంతే, సర్వజ్ఞ పద్యాలు త్రిపదులని

  రిప్లయితొలగించండి
 14. పంత మూని చంద్రు నొడిసి పట్ట వచ్చు
  చేవ మీఱఁ గొండలఁ బిండి సేయ వచ్చు
  మానవుండు దలంచిన మానసమున
  దోసిటం బట్టి సంద్రమున్దోడవచ్చు


  న్యాస తపోబలమ్మునకు నారయ దుష్కర కార్య ముండునే
  త్రాస మొసంగ వీసమును ధారుణి లోఁ బరికింప నెందునున్
  వాసిగఁ బట్టఁ బుక్కిటను బార్థ ఋషీంద్రుఁడు మున్ను జహ్నువే
  దోసిటఁ బట్టి సంద్రమును దోడఁగ వచ్చు నటన్న సత్యమే

  రిప్లయితొలగించండి
 15. ఉ.

  మోసము జేయు రాక్షసులు మూఢులు చత్తురు మౌని లీలచే
  వాసము కాలకేయులకు వారిధి, వేల్పుల బాధ జూచి, యా
  పోసనమంద గస్త్య ముని, పుక్కిలిలో కడలిన్ గ్రహించెడిన్
  *దోసిటఁ బట్టి సంద్రమును దోడఁగవచ్చు నటన్న సత్యమే!*

  రిప్లయితొలగించండి 16. గగనమందున్న తారల గణన చేయ
  వచ్చు, సాధ్యము కానట్టి పనులనెల్ల
  పట్టుదల తోడనుసుసాధ్య
  పరచవచ్చు
  దోసిటం బట్టి సంద్రమున్ దోడవచ్చు
  బాగుచేయలేమిల వెర్రి వాని మదిని

  రిప్లయితొలగించండి
 17. దాసుడనయ్యనీకుననుదాపలబెట్టకుజానకీపతీ
  నీసతిజాడలన్యరసినీకుశలమ్మునుదెల్పి వచ్చెదన్
  నీసరి దైవమీ భువిని నెచ్చట లేడనిహెచ్చరించియీ
  దోసిటబట్టిసంద్రమునుదోడగవచ్చునటన్నసత్యమే

  రిప్లయితొలగించండి

 18. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  పైరు పండించ వచ్చు నెడారి నైన
  రిక్కలను నభమందు లెక్కించ వచ్చు
  దోసిటం బట్టి సంద్రమున్ దోడ వచ్చు
  కాని లంచాల నడ్డుకో గలమె భువిని?

  రిప్లయితొలగించండి