15, జనవరి 2024, సోమవారం

సమస్య - 4647

16-1-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరిమళించదె దారమ్ము విరులతోడ”
(లేదా...)
“దారము గూడ వాసనల ధన్యత నొందును పూలతోడుగా”
(డా॥ వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)

19 కామెంట్‌లు:

  1. సుజనులను చేరి నడువగ కుజనుడైన
    కసిడి కాలముననె మార గలడెటులన
    పరిమళించదె దారమ్ము విరులతోడ
    దివియ చేరువన చెలగు తిమిరమైన

    రిప్లయితొలగించండి

  2. వాసు దేవుని చెలిమితో పాండవులకు
    దక్కె గాదె యశమ్మది ధరణి లోన
    ననుచును వచియించిరి పండి తాఖ్యు లిటుల
    పరిమళించదె దారమ్ము విరులతోడ.



    ధారుణి బాండుపుత్రులకు దక్కు యశమ్మది నిశ్చయమ్ము కం
    సారి సఖిత్వమయ్యదియె చాలు నటంచు వచించె క్రీడియే
    సారధి వైనచాలునిక సంగర మందు జయమ్ము తథ్యమౌ
    దారము గూడ వాసనల ధన్యత నొందును పూలతోడుగా.

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    సఖుడు కృష్ణుఁడై పాండవుల్ జయమునంద
    సజ్జనులమైత్రి శుభములు సాధ్యపడఁగ
    కూర్చినంతట మాలగన్ గొప్పగాను
    పరిమళించదె దారమ్ము విరులతోడ

    ఉత్పలమాల
    కూరగ సఖ్యతల్ మిగుల గోకుల కృష్ణుని తోడ పాండవుల్
    గౌరవమంది గెల్చి రనిఁ, గల్గును సజ్జన మైత్రి శ్రేయముల్!
    గూరిచి మాలగా నునికి కోల్పడి నన్ భగవాను సన్నిధిన్
    దారము గూడ వాసనల ధన్యత నొందును పూలతోడుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జ్ఞాన సముపార్జనము వంటి గుణములెల్ల
      సాధుజనుల సంగతమున సౌరుమీరు
      సౌరభము లేకయున్నను స్వతహముగను
      పరిమళించదె దారమ్ము విరులతోడ

      తొలగించండి
    2. ఉత్పలమాల రెండవపాదము చివర, " కలుగును సజ్జన మైత్రి చేతమేల్" అని చదువుకొన మనవి.

      తొలగించండి
  4. పొందు జ్ఞానమ్ము నల్పుడు బుధుని వలన
    వెలుగు దీపమ్ము నిప్పుతో కలియ గానె
    పరి మళి o చ దె దారమ్ము విరుల తోడ
    మంచి భాసించు సత్సంగ మహిమ వలన

    రిప్లయితొలగించండి
  5. మంచివారల సంగడిఁ మసలుకొనిన
    యుక్కివుడు కూడ తానగు నుత్తముండు
    విరుల గుదిగుచ్చ దారాన విస్తరముగ
    పరిమళించదె దారమ్ము విరులతోడ

    రిప్లయితొలగించండి
  6. వారక పండితాళి సహవాసమునందున నుక్కివుండు తా
    జేరగ వారి సేవనము చేయుచు కాలము వెళ్ళబుచ్చగన్
    గౌరవమబ్బు సంఘమున కన్గొన పూవులమాలఁ గూడగన్
    దారము గూడ వాసనల ధన్యత నొందును పూలతోడుగా

    రిప్లయితొలగించండి
  7. సజ్జనులగు సహచరుల సంగమమున
    క్రూరుడైనను కరుణతో మారిపోవు
    మంచి వైన పూవులనెంచి మాలకట్ట
    పరిమళించదె దారమ్ము విరులతోడ

    కూరిమి వల్లకూడుకొను క్రొత్తగ సంగమ లక్షణంబులే
    భీరువులైనవారి యెడ భీతిని పొందుట చూడ శక్యమే
    వీరులతోడ కూర్మియన బింకము పెంపగుఁ బూలచెండులో
    దారము గూడ వాసనల ధన్యత నొందును పూలతోడుగా

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. తే॥ పలుకు నేగూటి చిలుక యా పలుకు సుజన
      మైత్రి సద్బుద్ధి దుర్జన మైత్రి దుర్గు
      ణమ్ములనిడు నవని లోన నయము గాను
      పరిమళించదె దారము విరుల తోడ

      ఉ॥ కూరిమిఁ జూపి దుర్జనులఁ గూడఁగ దుర్గుణ లభ్యతే సుమా
      కూరిమి జూపి సజ్జనులఁ గూడఁగ సద్గుణ లాభమొప్పునే
      కౌరవ పాండు పుత్రులను గాంచఁగ నియ్యది తేటతెల్లమే
      దారము గూడ వాసనల ధన్యత నొందును పూలతోడుగా

      (పూలననుసరించి దారమునకు వాసన కలుగుతుందని అండి)

      తొలగించండి
  9. తే.గీ:ధనికుడను కాని సుంతయు తత్త్వ మెరుగ
    స్వాములందరి ధనమిచ్చి స్వాగతించి
    భాషణముల వెట్టించి తత్త్వము నెరిగితి
    పరిమళించదె దారమ్ము విరుల తోడ!

    రిప్లయితొలగించండి
  10. వారక క్షీర మిచ్చు తెలి వర్ణము కూడిన నీటి కెప్పుడున్
    చేరిన దొడ్డ వారికడ సేవలు చేయగ, నల్పుడైన న
    వ్వారల సద్గుణమ్ములు నవారితమౌగతి వీని కబ్బెడిన్
    దారముగూడ వాసనల ధన్యత నొందును పూరతోడుగా
    అసనారె

    రిప్లయితొలగించండి
  11. ఉ:నేరను ఛందమున్,చదువ నేరను ప్రౌఢము లైన కావ్యముల్,
    నేరుచు రంధి గల్గి స్తవనీయుల సత్కవి మిత్రు లందరన్,
    జేరిచితిన్ సమూహముగ ,శీఘ్రమె నాకు కవిత్వ మబ్బెగా
    దారము కూడ వాసనల ధన్యత నొందును పూల తోడుగా
    (కవిత్వం రాని వాడు కవు లందరి తో ఒక ఫేస్ బుక్ గ్రూప్ తయారు చేశాడు.వాళ్ల వల్ల ఇతనికి కవిత్వం వచ్చింది.)

    రిప్లయితొలగించండి
  12. పరమ భక్తి పరుండయి వాసిగాను
    సతతమారాధనముసేయ సతికికూడ
    నబ్బుపుణ్యమనుచునుందురార్యులెటన
    పరిమళించదెదారమ్మువిరులతోడ



    రిప్లయితొలగించండి
  13. చేరుచుసజ్జనాళినికచేయుచునుండిననెయ్యమెప్పుడున్
    వారలతోసదాతిరుగపద్యములల్లెడుతీరుతెన్నులున్
    నేరుపుతోనొరుల్ గనుచునేర్తురదెట్టులనంగధారుణిన్
    *“దారము గూడ వాసనల ధన్యత నొందును పూలతోడుగా”*

    రిప్లయితొలగించండి
  14. అవని సజ్జన సాంగత్య మలవడంగ
    గౌరవింతురు దుర్జను బౌర వర్యు
    లెలమి సజ్జను తోడుత నేల ననఁగఁ
    బరిమళింపదె దారమ్ము విరుల తోడ


    ద్వారము లందుఁ గట్ట వలెఁ బన్నుగ దండల నుత్సవమ్ములన్
    వారక చింద నందములు వావిరి నెన్నఁగ సౌధ రాజమే
    జేరిన మాల లందు విలసిల్లుచు నింపుగఁ గుంద మింక మం
    దారము గూడ వాసనల ధన్యత నొందును బూల తోడుగా

    రిప్లయితొలగించండి
  15. ఉ.

    వారిజ పుష్ప మాలికల వంతు సుగంధము బంచు దిక్కులన్
    దూరిన దార మంతటయు దోహద మిచ్చెడి పట్టు ధార్యమున్
    నీరపు జల్లులన్ దడిసి నెయ్యము సద్గుణ లక్షనమ్ములై
    *దారము గూడ వాసనల ధన్యత నొందును పూలతోడుగా.*

    రిప్లయితొలగించండి