1, జనవరి 2024, సోమవారం

సమస్య - 4633

2-1-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కామమె మోక్షోపలబ్ధికారణము గదా”
(లేదా...)
“కామమె మోక్షకారణము గాముకులై తరియించు డెల్లరున్”

17 కామెంట్‌లు:

  1. కందం
    నీమమున రేపవళ్లు వి
    రామమ్మెరుగక శబరియె ప్రార్థించుచు శ్రీ
    రాముఁగని తరించెను స
    త్కామమె మోక్షోపలబ్ధికారణము గదా!

    ఉత్పలమాల
    రాముని దర్శనార్థము విరామమెఱుంగక రేపవళ్లుఁ దా
    నీమము దప్పకే శబరి నిర్మలచిత్త నిరీక్షణన్ బరం
    ధాముని ధన్యతన్ గనియు నర్మిలి సేవఁదరించిఁ గాదె! స
    త్కామమె మోక్షకారణము గాముకులై తరియించు డెల్లరున్

    రిప్లయితొలగించండి

  2. రాముని నామము వీడక
    నేమముతో కొల్చుచు నను నిత్యము సీతా
    రాముల నిజరూపము గను
    కామమె మోక్షోపలబ్ధికారణము గదా.


    రాముడె రక్షకుండని నిరంతర మాతని నామమొక్కటే
    నేమము గా దలంచి కడు నిష్ఠగ సాధన జేయుచున్ భువిన్
    భూమమె రామదర్శనము పూజ్యుని గాంచ తపించ నెంచెడిన్
    కామమె మోక్షకారణము గాముకులై తరియించు డెల్లరున్.

    రిప్లయితొలగించండి
  3. నోములువ్రతములుకావవి
    నీమముధర్మముననుంచి నేర్పున జీవుం
    డామనుగడలోననుని
    త్కామము మోక్షోపలబ్ధి కారణముగదా

    రిప్లయితొలగించండి
  4. భామయుగోపికారమణి భావమునందునపారవశ్యయై
    క్షేమమునెంచకే మదిని శీకరమాలికనిండురాత్రులన్
    మోమునుద్రిప్పకన్సరసమున్గ్గనికృష్ణునిబొందెగాతుదిన్
    కామముమోక్షకారణము కాముకులైతరియించుడెల్లరున్

    రిప్లయితొలగించండి
  5. ఏమాత్రమైన దనకీ
    భూమిపయి నెలకొనినట్టి భోగము లందున్
    కామమువిడి భవుని కదియు
    కామమె మోక్షోపలబ్ధికారణము గదా

    రిప్లయితొలగించండి
  6. నీమము గలిగియు సతతము
    నే మాత్రము నా శ పడక నిజ మగు విధులన్
    దా మొన రిం చు తరిన్ ని
    ష్కా మమె మో క్షో ప ల బ్ది కారణము గదా!

    రిప్లయితొలగించండి
  7. నీమముతోడ నిచ్చలును నీరజనాభుని దివ్య రూపమున్
    నీ మనమందునన్ నిలిపి నిశ్చల భక్తిఁ జపింపగా పరం
    ధాముడు నిన్నుఁగాచి తనధామము జేర్చును నిశ్చయంబు నా
    కామమె మోక్షకారణము గాముకులై తరియించు డెల్లరున్

    రిప్లయితొలగించండి
  8. హామిక జాత్రులు దశరథ
    రాముని హృదియందు నిలిపి రాగరహితులై
    పామరమును వీడగ ని
    ష్కామమె మోక్షోపలబ్ధికారణము గదా

    రిప్లయితొలగించండి
  9. నీమముతో ధ్యానించుము
    నీమనమున నీరజాక్షు నిర్మల భక్తిన్
    సేమముఁ గూర్చగ నపుడా
    కామమె మోక్షోపలబ్ధికారణము గదా

    రిప్లయితొలగించండి
  10. కం॥ నేమముఁ దప్పక నడచుచు
    ధామము విభునిది కనఁగను దన్మయ మొందిన్
    నామ జపము విడువనిదగు
    కామమె మోక్షోపలబ్ధి కారణము గదా

    ఉ॥ ధామము విష్ణు ధామమును దన్మయ మొందుచుఁ గోరి సర్వదా
    నేమముఁ దప్ప కుండఁగను నిష్ఠగ వర్తిలు వారలై భువిన్
    నామ జపమ్మునన్ గమలనాభునిఁ గొల్తు మటంచు మీరు నా
    కామమె మోక్షకారణము గాముకులై తరియించు డెల్లరున్

    రిప్లయితొలగించండి
  11. కం:కామించగ నొక గీతను
    నీ మదికిన్ క్లేశ మిచ్చి నిను వీడెను గా!
    క్షేమము గీతార్థ మెరుగు
    కామమె , మోక్షోపలబ్ధికారణము కదా!
    ("గీత" అనే అమ్మాయిని కామించావు.ఆమె క్లేశా న్నిచ్చింది.ఇక గీతార్థం పై కోరిక పెడితే క్షేమము,మోక్షకారణము.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:"కామమె సృష్టిధర్మ"మని "కామము జంపెడు వారు మూర్ఖులం"
    చేమియొ పల్కు వారలను హేళన జేయుచు,"ముక్తి కాంత పై
    కామమె మోక్షకారణము కాముకు లై తరియించు డెల్లరున్
    క్షేమద యైన యామె గొని జీవిత మం" దనె మౌని ప్రేమ తోన్.
    (ఈ ముక్తి కాంత అనే పదమే ఒక చమత్కారం గా తయారైంది.కాముకుణ్ని మోక్షమార్గం లోకి దింపటానికి వాడి కామాన్నే ఉపయోగించి ముక్తికి ఆ పేరు తయారు చేశారేమో!ఎవడి బలహీనతని వాడికే మందు గా వాడినట్టు.)

    రిప్లయితొలగించండి
  13. నీమము తోడుత నిత్యము
    క్షేమం బొడఁగూడు నయ్య సేవింపు పరం
    ధామునిఁ దమి దూరీకృత
    కామమె మోక్షోపలబ్ధి కారణము గదా


    ఏమఱ కెంచి మోక్షమును నెంతయు నిష్ఠను దుష్ట చింతనా
    గ్రామ విహీన చిత్తత నిరంతరమున్ భగవద్విశేష వ
    న్నామము లుచ్చరింపుఁడి ఘనమ్ముగ వీత ఫలాను రక్తి ని
    ష్కామమె మోక్ష కారణము కాముకులై తరియించుఁ డెల్లరున్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    నీమముగా ప్రతి దినమును
    క్షేమమ్మును గోరి తలచి శ్రీరామునినే
    ప్రేమగ కొలువగ నా స
    త్కామమె మోక్షోపలబ్ధి కారణము గదా!

    రిప్లయితొలగించండి
  15. నేమము తోడను సతతము
    రామునినామముజపించరహియది కలుగున్
    స్వామియెశరణమనెడిని
    *“ష్కామమె మోక్షోపలబ్ధికారణము గదా”*


    రాముడె సర్వవేళలనురక్షణచేసెడివాడటంచుతా
    రామునిగాథలన్ విడక రాగముతోడను పాడుచున్ సదా
    ప్రేమనుపంచుకొంచునటు ప్రీతినిచూపెడి స్వచ్ఛ మైనయా
    *“కామమె మోక్షకారణము గాముకులై తరియించు

    రిప్లయితొలగించండి