4, జనవరి 2024, గురువారం

సమస్య - 4636

5-1-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోహమె కద మానవునకు ముక్తి నొసంగున్”
(లేదా...)
“మోహమ్మే హితమౌను మానవునకున్ ముక్తిం బ్రసాదింపఁగన్”

18 కామెంట్‌లు:

  1. వాహకమౌమనసువిడచి
    గ్రాహకమౌబుద్ధి తోడ రాజులు వాడై
    ఆఖరి దవిలిననావ్యా
    మోహమెగదమానవునకుముక్తినొసంగున్

    రిప్లయితొలగించండి
  2. ఐహిక సౌఖ్యమ్ములపై
    ఈహను వీడి మదియందు నీశ్వరరూప
    మ్మూహించుచు భక్తిఁ గొలచు
    మోహమె కద మానవునకు ముక్తి నొసంగున్

    రిప్లయితొలగించండి
  3. కందం
    దైహిక కాంక్షలపై వ్యా
    మోహము విడి యన్నమయ్య పొందె హరిన్ దా
    సోహమటంచుఁ బరముపై
    మోహమె కద మానవునకు ముక్తి నొసంగున్

    శార్దూలవిక్రీడితము
    దేహభ్రాంతిని వీడి యన్నమయ సాధించెన్ పరంధాము, దా
    సోహమ్మై చిరఁజీవియౌ వరమునే సూక్ష్మాన వారించి, వ్యా
    మోహమ్మున్ త్యజియించి యైహికముపైఁ బొందంగ దైవమ్ముపై
    మోహమ్మే హితమౌను మానవునకున్ ముక్తిం బ్రసాదింపఁగన్

    రిప్లయితొలగించండి
  4. మోహపు బుద్ధి రహితుడై
    దేహమ్మ స్థిరమనియును
    దెలసియు భువిలో
    సాహసునకు నిశ్కామపు
    మోహమెగదమానవునకుముక్తినొసంగున్

    రిప్లయితొలగించండి
  5. తాహ తు గలిగిన వాడై
    దేహము పై మమత వీడి దివ్యు o డగు చున్
    సో హమ్మను చొ న రించె డి
    మోహమె గద మానవునకు ముక్తి నొసంగు న్

    రిప్లయితొలగించండి
  6. తాహతు తగ్గిన వేళన
    దేహినిపయి దొరలుచుండు దేహ సుఖముపై
    రాహిత్యమున విడుపుపై
    మోహమె కద మానవునకు ముక్తి నొసంగున్

    రిప్లయితొలగించండి

  7. ఆ హంసుని సేవింపగ
    నాహారము నిద్ర మాని యనవరతమ్మా
    శ్రీహరి పైనను గల వ్యా
    మోహమె కద మానవునకు ముక్తి నొసంగున్.


    ఆహార్యంబది నిల్వబోదు కదరా యజ్ఞానమున్ వీడుచున్
    దేహంబయ్యది బుద్భుదమ్మిదియె తద్దెమ్మంచు గుర్తించి నీ
    వాహారమ్మలు భోగభాగ్యములపై యత్యాశపైజూపు ని
    ర్మోహమ్మే హితమౌను మానవునకున్ ముక్తిం బ్రసాదింపఁగన్.

    రిప్లయితొలగించండి
  8. శా.

    బాహాస్ఫాలనమున్ వశిష్ఠ మునితో బ్రహ్మర్షిగా మార్పుకై
    మాహాత్మ్యమ్మె సయోని మేనకను శ్రీమంతంబుగన్ గాధిజున్
    బాహాటమ్ముగ మాధవిన్ బహుమతిన్ బ్రాప్తించగా నష్టకున్
    *మోహమ్మే హితమౌను మానవునకున్ ముక్తిం బ్రసాదింపఁగన్.*

    రిప్లయితొలగించండి
  9. దేహముపై వ్యామోహము
    నూహలయందైన గొనక నుద్భటముగ సం
    దేహము వీడి జనుము ని
    ర్మోహమె కద మానవునకు ముక్తి నొసంగున్

    రిప్లయితొలగించండి
  10. దేహమ్మన్నది శాశ్వతమ్మనుచు చింతించంగ నింకేల వ్యా
    మోహంబున్ మదినూన్చకున్న మనుజుల్ పుణ్యాత్ము లీధారుణిన్
    మోహావేశము దుఃఖభాజనమగున్ ముమ్మాటికిన్, వీడినన్
    మోహమ్మే హితమౌను మానవునకున్ ముక్తిం బ్రసాదింపఁగన్

    రిప్లయితొలగించండి
  11. కం॥ ఐహిక సుఖములు మమతలు
    దేహికి మూలము వెగడుకుఁ దేకువఁ గని యా
    మోహము విడువగఁ గను ని
    ర్మోహమె కద మానవునికి ముక్తి నొసంగున్

    శా॥ మోహమ్మే కన మానవాళి నిల సంపూర్ణంబుగన్ గ్రమ్మఁగన్
    బాహాటంబగు కోర్కెలెన్నొ జనులన్ బాధించు హింసించు సం
    దేహంబేలొకొ యిచ్ఛలన్ విడువఁగన్ దేహంబునన్ గాంచు ని
    ర్మోహమ్మే హితమౌను మానవునకున్ ముక్తిం బ్రసాదింపఁగన్

    రిప్లయితొలగించండి
  12. కం:మోహము స్త్రీ పైనను,నీ
    ఆహార్యము పైన జూప నవి నిత్యములే
    ఆ హరి లీలల పై గల
    మోహమె కద మానవులకు ముక్తి నొసంగున్.
    (ప్రాపంచిక విషయాల పై గల మోహాన్ని భగవంతుని పైకి మరల్చటాన్ని భక్తి అంతా రని కొందరు తాత్త్వికుల అభిప్రాయం.)

    రిప్లయితొలగించండి
  13. శా:"సోహ" మ్మంచు గ్రహించు సాధనములే శోకమ్ములన్ దీర్చు గా!
    ఊహాకల్పిత దివ్యరూపములతో నూరించు మార్గాల,వ్య
    ర్థాహంకారము జూపు బోధకుల పై , ఆ పుణ్య లోకాల ని
    ర్మోహమ్మే హిత మౌను మానవునకున్ ముక్తిన్ బ్రసాదింపగన్.
    (ఊహించిన దేవతారూపాలు కాక అద్వైతసాధనే అసలైన ముక్తిని ప్రసాదిస్తుంది అని.)

    రిప్లయితొలగించండి
  14. ఆహా నిక్కం బిది సం
    దేహము వలదు మది లోన స్థిర మతి నూనన్
    బాహాటముగ నశించిన
    మోహమె కద మానవునకు ముక్తి నొసంగున్


    గేహక్షేమ విహీన దుర్భర ఘన క్లేశార్త భూతాలికిన్
    సాహాయ్యం బొనగూర్చి యిచ్చుటయు రక్షన్, సంత తామేయ దు
    ర్దేహాశా విలయమ్ము, నింద్రియ చ యాధీ నావహీనమ్ము, ని
    ర్మోహమ్మే హితమౌను మానవునకున్ ముక్తిం బ్రసాదింపఁగన్

    రిప్లయితొలగించండి
  15. సాహసమగుసందేశము
    దేహులకిది కష్టమైన దిగులునుమాన్పే
    యాహా!యత్యాసలువిడు
    మోహమెకద మానవునకు ముక్తినొసంగున్.

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    దేహమ శాశ్వతమనుచును
    పాహి యనుచు సేవచేయు పరమాత్ముండౌ
    నా హరిపై గలిగిన వ్యా
    మోహమె కద మానవునకు ముక్తినొసంగున్?

    రిప్లయితొలగించండి
  17. నేమము తోడను సతతము
    రామునినామముజపించరహియది కలుగున్
    స్వామియెశరణమనెడిని
    *“ష్కామమె మోక్షోపలబ్ధికారణము గదా”*


    రాముడె సర్వవేళలనురక్షణచేసెడివాడటంచుతా
    రామునిగాథలన్ విడక రాగముతోడను పాడుచున్ సదా
    ప్రేమనుపంచుకొంచునటు ప్రీతినిచూపెడి స్వచ్ఛ మైనయా
    *“కామమె మోక్షకారణము గాముకులై తరియించు డెల్లరున్”*

    రిప్లయితొలగించండి