13, జనవరి 2024, శనివారం

సమస్య - 4645

14-1-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తెలుగు నాంధ్రభాష యనఁగవలదు సుమ్ము”
(లేదా...)
“తెలుఁగన నాంధ్రభాష యని తెల్పుట శాస్త్రవిరుద్ధమే సుమా”

18 కామెంట్‌లు:

  1. అలిగినతాపసుండునటయాతనిబిడ్డకుశాపమీయగా
    తొలగినవాడునాంధ్రుడుగ దోషిగనుండెనుదక్షిణంబునన్
    మెలగిననార్యుడీతడనిమెచ్చరుతెల్గుగ ద్రావిడంబునన్
    తెలుగునునాంధ్రభాషయనితెల్పుటశాస్త్రవిరుద్ధమేగదా

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    ప్రీతి గౌరవించక మీరుమాతృభాష
    శాస్త్ర విజ్ఞానమెంచియుఁ జదువనొప్పి
    ప్రజ్ఞయని యాంగ్లమును సంకర మొనరించి
    తెలుగు నాంధ్రభాష యనఁగవలదు సుమ్ము!

    చంపకమాల
    వెలయగ నీశ్వరున్ డమరు వేడ్కగ రువ్విన నక్షరాలితో
    తెలియగ శాస్త్రవిద్యలను దీక్షగ నాంగ్లము నభ్యసించినన్
    గలుపుచు నన్యభాషలను జ్ఞానులమంచును సంకరంబునౌ
    తెలుఁగన నాంధ్రభాష యని తెల్పుట శాస్త్రవిరుద్ధమే సుమా!

    రిప్లయితొలగించండి
  3. రెండు తెలుగు రాష్ట్రములందు నుండుటయును ,
    యిచట నచట యనక మరి యెచటనైన
    యిల పయిన దాని పొలపము నెంచిచూడ
    తెలుగు నాంధ్రభాష యనఁగవలదు సుమ్ము

    రిప్లయితొలగించండి
  4. తెలుఁగన తేనెలూరు కడు తీయని భాషని పేరుగాంచె నా
    తెలుగుకు బట్టెనో తెగులు తెల్లముగాదిపు డెల్లవారికిన్
    తెలుగున మాటలాడఁగ యధేచ్ఛగ యాంగ్లమె బల్కు నిప్పుడా
    తెలుఁగన నాంధ్రభాష యని తెల్పుట శాస్త్రవిరుద్ధమే సుమా

    రిప్లయితొలగించండి

  5. తీయ తేనియ లొలికెడి తెలుగు భాష
    ప్రాంతమునకొక యాసతో పరిఢవిల్లి
    భూరి రూపాంతరము చెంద భువిని నేటి
    తెలుగు నాంధ్రభాష యనఁగవలదు సుమ్ము.


    తెలుగది తీయతేనియకు ధీటని పూర్వులు చెప్పనేమిరా
    పలువిధ ప్రాంతభేదములు వాసిగ జేరుచు భూరి మార్పుతో
    పలుకుచు నుండ నేడిలను వాడుక యందున నున్న యట్టి యీ
    తెలుఁగన నాంధ్రభాష యని తెల్పుట శాస్త్రవిరుద్ధమే సుమా.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. పద్యమై మరిగద్యమై పరిమళించి
    తాళపత్ర నిధులలోన తన్మయించి
    వెలుగు లీనిన తెలుగును వీడి నేటి
    తెలుగు నాంధ్రభాష యనఁగవలదు సుమ్ము

    గలగలపారు జీవనది కైవడి మంజులమైనఘోషగా
    పలుకులు తేనెలొల్కనుచు పండితులే వచియించుభాషగా
    విలసితమైనతెల్గు మరి వేగమె సంకర మొంద దానినే
    తెలుఁగన నాంధ్రభాష యని తెల్పుట శాస్త్రవిరుద్ధమే సుమా

    రిప్లయితొలగించండి
  8. ఆంధ్ర మందున పలుకు దు రాంధ్ర భాష
    ప్రక్క రాష్ట్రము వారలు పలుకు తెలుగు
    నందు వలనను భావించి రచటి జనులు
    తెలుగు నాంద్ర భాష యనగ వలదు సుమ్ము

    రిప్లయితొలగించండి
  9. తేనెలూరెడు భాషనా తెలుగు భాష
    తెలుగు భాషకు పట్టెను తెగులు నేడు
    ఆంగ్ల పదముల సంకరమైన నేటి
    తెలుగు నాంధ్రభాష యనఁగవలదు సుమ్ము

    రిప్లయితొలగించండి
  10. తే॥ వెలిఁగె దశ దిశలను నేఁడు తెలుఁగు భాష
    సరళమైన మార్పులఁ గని మరలు గొలుపు
    మాండలీకముల నరసి మహిని నిండె
    తెలుఁగు నాంధ్రభాష యనఁగ వలదు సుమ్ము

    చం॥ వెలుఁగఁగ దేశదేశముల వృద్ధినిఁ బొందుచు వెండి కాంతులన్
    మలగక ప్రస్ఫురిల్లుచును మన్నన నొందుచు విశ్వమంతటన్
    దెలుఁగన విశ్వ భాషయనిఁ దెల్లము కాఁగ వచించి రిట్టులన్
    దెలుఁగన నాంధ్రభాష యని తెల్పుట శాస్త్ర విరుద్ధమే సుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను ఒక దేశమలో ఒక పార్కులోని పెట్టెను (box) తెరిచి చూసాను. అందరి సౌలభ్యము కోసము పెట్టినది. ఎవరైనా తీసుకొని చదివి మరల ఉంచెయ్యచ్చు. చాలా వరకు అక్కడి వారు వ్రాసిన తెలుగు పుస్తకాలే! అమెరికా దేశములో అత్యంత శీఘ్రంగా విస్తరిస్తున్న భాష తెలుగండి. కానీ పురోహితులు తమిళులే అధికము.

      తొలగించండి
    2. తేటగీతి రెండవ పాదము చివర మరులు కొలుపు పొరపాటున మరలు గొలుపు అని వ్రాసాను క్షమించాలి

      తొలగించండి
  11. తే.గీ: ఆంధ్రయును,తెలంగాణమ్ము ననెడు రచ్చ
    పెచ్చు మీరిన కాలాన రెచ్చి పోయి
    పలికె నొక తెలంగాణంపు భక్తు డిట్లు
    తెలుగు నాంధ్రభాష యనగ వలదు సుమ్ము

    రిప్లయితొలగించండి
  12. చం:గలగల పారు కృష్ణకును,గౌతమికిన్ నడి నున్న ప్రాంతమే
    తెలియగ నాంధ్రభూమి యగు,దీని గణించుట నేడు సాధ్యమే!
    నలు దెసలన్ విరాజిలుచు నవ్యత బొందిన యీ దినమ్ములన్
    తెలుగన నాంధ్రభాష యని తెల్పుట శాస్త్రవిరుద్ధమే సుమా!
    (ఆంధ్రదేశం అంటే ఒకప్పుడు కృష్ణా గోదావరీ మధ్యదేశ మని చెప్ప బడింది.కానీ తెలుగు భాష చాలా చోట్ల వ్యాపించింది కనుక ఆంధ్రభాష అనవద్దు అని.)

    రిప్లయితొలగించండి
  13. చం:"తెలుగునె యాంధ్ర మందు"రని తెల్పగ నా సుమ యేదొ యొక్క ఛా
    నలున,నొకండు పల్కె "విను! నా తెలగాణపు భాష కాదొకో!
    తెలియక బల్క వద్దు నను దిట్టిన దిట్టుము మూర్ఖు డంచునే
    తెలుగన నాంధ్రభాష యని తెల్పుట శాస్త్రవిరుద్ధమే సుమా!"
    (ఇక్కడ సుమా!అంటే యాంకర్ సుమని సంబోధించినట్లు.నిజానికి శాస్త్రవిరుద్ధం అనే పదం వాడక్కర లేదు కానీ నేను మూర్ఖుణ్ని అని అతనే చెప్పుకున్నాడు కనుక ఏ పదం వాడాలో తెలియక శాస్త్రవిరుద్ధం అన్నాడు. )

    రిప్లయితొలగించండి
  14. తెలుఁగు నేలను రెండు ముక్కలుగఁ జేయఁ
    జలము నూన నాంధ్రులు రిపు సమితి గాఁగ
    బ్రతుకు పై నాశ గలదేని రామ! రామ!
    తెలుఁగు నాంధ్ర భాష యనఁగ వలదు సుమ్ము


    లలితము లైన శబ్దములు రాసులు గాఁ దనరంగఁ దెన్గునం
    గలఁత వహింపఁ బండితులు కావ్యము లందు ననేక రీతులం
    జెలఁగఁగ నన్య దేశ పద చిత్రము లక్కట నేఁడు వింత తం
    తెలుఁ గన నాంధ్ర భాష యని తెల్పుట శాస్త్ర విరుద్ధమే సుమా

    [తంతు + ఎలుఁ గన = తం తెలుఁ గన]

    రిప్లయితొలగించండి
  15. అందమైనభాషయనగనవనియందు
    తెలుగు నాంధ్రభాష, యనగ వలదు సుమ్ము
    నర్థమవనిభాషయటంచుననవరతము
    తేనెవంటిదీభాషని తెలుసుకొనుము

    రిప్లయితొలగించండి