25, జనవరి 2024, గురువారం

సమస్య - 4656

26-1-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఓర్పు సన్యాసులకు నుండు నొక్కొ కనఁగ”
(లేదా...)
“అకటా యోరుపు లేని మానవులె సన్యాసంబుఁ గైకొంద్రు పో”

27 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మౌని కౌశికుండు భ్రమసి మేనకఁ గొనె!
    క్రీడి యూర్వశి వగలొల్క నోడ లేదె!
    విబుధు లెల్లరుఁ దెలిసిన విషయమనఁగ
    నోర్పు సన్యాసులకు నుండునొక్కొ కనఁగ?

    మత్తేభవిక్రీడితము
    సకలంబున్ దన దివ్యదృష్టిఁగను విశ్వామిత్రుడే మేనకన్
    వికలంబైన తపంబునన్ గొనియె సంప్రీతిన్! విలాసంబుగన్
    బ్రకటింపన్ మది యూర్వశీలలన యా పార్థుండు వారించెనే!
    యకటా! యోరుపు లేని మానవులె సన్యాసంబుఁ గైకొంద్రు పో!

    రిప్లయితొలగించండి
  2. తీర్పు వివాధమమ్ములకును
    గూర్పుగజెప్పుటకుతెలివిగొప్పగనుండున్
    నేర్పును శాంతము మిక్కిలి
    ఓర్పు సన్యాసులకునుండు నొక్కొకనగ

    రిప్లయితొలగించండి
  3. చాల కాలము నుండి యీశ్వరుని గాంచ
    కొసరి , ధ్యానము సలుపుచు , కోరి నటుల
    వేల్పు దర్శమగుదనుక వేచియుండు
    యోర్పు సన్యాసులకు నుండు నొక్కొ కనఁగ

    రిప్లయితొలగించండి

  4. జయ విజయులను శపియించ్రి సనకసాది
    మునులు, దుర్వాశుడుశపించె వనిత కణ్వ
    సుతనటంచు తెలిపె నొక సూరి యిటుల
    నోర్పు సన్యాసులకు నుండు నొక్కొ కనఁగ.


    వికలంబైన మనస్సుతో కొమ తనన్ వీక్షింపలేదంచు క్రో
    ధకుడే సంజ్వరమంది నత్తరిని తా దాక్షిణ్య మున్ వీడుచున్
    సఖి కణ్వాఖ్యుని ముద్దు పుత్రికను తా శాపించె దూర్వాసుడే
    యకటా యోరుపు లేని మానవులె సన్యాసంబుఁ గైకొంద్రు పో!

    రిప్లయితొలగించండి
  5. చేతమందున బ్రతుకుపై భీతిజెందు
    వాడు సంసార బంధాలు వక్కరించు
    సహనశీలత లోపించి సాధువగును
    ఓర్పు సన్యాసులకు నుండు నొక్కొ కనఁగ

    వికృతంబైన తలంపులే మనసులో విన్యాసముల్ సేయగా
    సకియేలా తనకంచు పల్కి విడినన్ సంసార జంజాటమున్
    సుకమే లక్ష్యము చేసికొన్న పిదపన్ శోకంబు లేకుండునా
    యకటా! యోరుపు లేని మానవులె సన్యాసంబుఁ గైకొంద్రు పో

    రిప్లయితొలగించండి
  6. మీ పూరణ బావుంది .

    వలయు మోక్షగాములకు ప్రబలము గాను
    నోర్పు; సన్యాసులకు, నుండు నొక్కొ కనఁగ
    వేరు మార్గము, దైవము, వేదవిత్తు
    లైన నేమి యా పండితులైన నేమి!



    రిప్లయితొలగించండి
  7. శాంతి సహనము మునులకు సహజ గుణము
    కొన్ని వేళల వారలు కోప ముగను
    శాప మిడట ను జూడంగ సత త మిలను
    నోర్పు సన్యా సులకు నుండు నొ క్కొ కనగ?

    రిప్లయితొలగించండి
  8. అకలంకంబగు జీవనమ్మున వివాహంబొక్క యాపత్తియై
    వికలంబాయెను మానసంబు వితతిన్ వేధించు నర్ధాంగితో
    సకలంబున్ విడనాడి యా మగఁడు తా సన్యాసియై పోయెనే
    అకటా యోరుపు లేని మానవులె సన్యాసంబుఁ గైకొంద్రు పో

    రిప్లయితొలగించండి
  9. ఇంట నర్ధాంగితో బాధ యినుమడింప
    సన్యసించెను కోల్పోయి సహన మతఁడు
    యింట గెలువక బయటతా నెటుల గెలుచు
    ఓర్పు సన్యాసులకు నుండు నొక్కొ కనఁగ

    రిప్లయితొలగించండి
  10. -
    తకధోం! ధోంతక! క్రింద మీద పడుచున్ తైతక్కలేబోదురౌ
    రకటా యోరుపు లేని మానవులె; సన్యాసంబుఁ గైకొంద్రు పో
    వికటింపన్ గృహ సీమ లోసుఖములే వీరాధివీరుల్ జిలే
    బి కనాకష్టము జీవితమ్ము వినవే వేసారి పోబోకుమా!




    రిప్లయితొలగించండి
  11. తే॥ ఇంటిలోని పోరుఁ బడఁగ నీశ్వరునికి
    యగున సంసార బాధల నలసి సహన
    ముడుగ సన్యసింతురు గద యుర్వి లోన
    నోర్పు సన్యాసులకు నుండు నొక్కొ కనఁగ

    మ॥ వికలం బైనను మానసంబిలను నిర్వేదంబు హెచ్చంగఁ దా
    నిఁక తాళంగను లేనటంచు సహనమ్మే వీడగన్ జాలు నా
    కిఁక సంసారపు భాదలంచుఁ జను సర్వేశానురక్తుండునౌ
    యకటా యోరుపు లేని మానవులె సన్యాసంబు గైకొంద్రు పో

    రిప్లయితొలగించండి
  12. చిన్న తనము నందుఁ జదువు సున్న గాఁగ
    గీత లోని సుద్దులు కొన్ని ప్రీతిఁ బల్క
    నెన్న నిక్కమ్ము భూ దేవి కున్న యట్టి
    ఓర్పు సన్యాసులకు నుండు నొక్కొ కనఁగ


    వికటంబై చనఁ బ్రేమ దారుణముగన్ విచ్ఛిన్నచేతస్కులై
    యకలంకాత్ములు కొంద ఱిద్ధరను సన్యాసమ్ము కాంక్షింపఁగా
    సకలాతంకము లుప్పతిల్ల నిల సంసారమ్ము సాగింపఁగా
    నకటా యోరుపు లేని మానవులె సన్యాసంబుఁ గైకొంద్రు పో

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    శాపమొసగితిరి జయ విజయులకు సన
    కాది మునులు కోపమ్మున, కణ్వ సుతకు
    నాగ్రహమున శాపమ్మిడినాడొక ముని
    యోర్పు సన్యాసులకు నుండునొక్కొ కనగ?

    రిప్లయితొలగించండి
  14. కాల మీరీతి గామారె గనుడు నేడు
    మంచితనమను మాటయె మంట గలిసె
    శాంతిమంత్రములుపఠించుసాధులేరి
    నోర్పు సన్యాసులకు నుండు నొక్కొ గనగ


    రిప్లయితొలగించండి