2, జనవరి 2024, మంగళవారం

సమస్య - 4634

3-1-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తీఁగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్”
(లేదా...)
“తీఁగలు లేని వీణ గడుఁ దీయగ మ్రోగెను మీటినంతటన్”

30 కామెంట్‌లు:

  1. తాఁగనె కణ్వుని కూతురు
    వేఁగనె, దుష్యంతు డంతో ప్రేమను, మదిలో
    రాగము సాగెను రాజుకు
    తీయగ లేనట్టు వీణ తీయగ బలికెన్

    రిప్లయితొలగించండి
  2. సాగినసాధనన్ ఋషియు శాంతుడునయ్యెతదేక దీక్షతో
    మూగినబాహ్యవాంఛలవి యోడెనుధీరుని చిత్త వృత్తితో
    లోఁగనెపారమార్థమును లుప్తమునయ్యెగ దేహ భ్రాంతియున్
    తీఁగలులేనివీణగడుతీయగమ్రోగెనుమీటినంతటన్

    రిప్లయితొలగించండి
  3. తీగలు సడలిన జక్కగ
    మ్రోగవనెడి భయమునొంది మోపుగ వాటిన్
    లాగి బిగించగ , విరిగిన
    తీఁగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్

    రిప్లయితొలగించండి
  4. సాగియు ప్రయోగ మవనిని
    రాగము పలికింప దగియు రమణి యము గా
    మ్రో గు పరి కరము రాగా
    తీగలు లేనట్టి వీణ తీయగ బలికెన్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. కందం
      భాగవతము రాజులకిడి
      భోగపు సిరిఁ గోరననగ పోతన, దిగులున్
      వీగుచు కచ్ఛపి దోషపు
      తీఁగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్


      ఉత్పలమాల
      భాగవతంపునంకితము భాగ్యమటంచను ఱేని పాలిటన్
      దూగెడు సంపదల్ బడయఁ ద్రోయను భారతి! రామమూర్తికే
      స్వాగతమన్న,కచ్ఛపి యపస్వరమొల్కు బిగింపులుండెడున్
      తీఁగలు లేని వీణ గడుఁ దీయగ మ్రోగెను మీటినంతటన్

      తొలగించండి
    2. గురుదేవులకు మరియు రాగమౌక్తికం గారలకూ ధన్యవాదములు. ఉత్పలమాల మొదటి పాదములో, ' భాగవతంపుటంకితము' అని సవరణ

      తొలగించండి
  6. త్యాగము సద్భావము అను
    రాగము ఆప్యాయతలును రంజిలుచుండన్
    సాగిన సంసారములో
    తీఁగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్

    రిప్లయితొలగించండి
  7. త్యాగయ్య పలుకులకు శ్రీ
    రాగము తోడై హృదయము రంజింపంగన్
    సాగెడు గాన ప్రవాహము
    తీఁగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్

    రిప్లయితొలగించండి

  8. ప్రాగహరపు కావ్యమ్ముల
    నోగితమించుకయులేని హుండుడు వ్రాసెన్
    బాగరి సతి దయతో గద
    తీఁగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్.


    ఓగితమే వితానమగు హుండుడు కాళి కృపార్థ లబ్ధితో
    ప్రాగహరంపు కావ్యముల వ్రాసె మహాకవి కాళిదాసటం
    చాగిరి యాత్మభూత సతి యక్కసమందిన పాళమందునన్
    తీఁగలు లేని వీణ గడుఁ దీయగ మ్రోగెను మీటినంతటన్.

    రిప్లయితొలగించండి
  9. ఆ గగనాన చందిరుఁడు నా విరజాజి పరీమళంబులా
    సాగెడు పిల్లవాయువులు సారెకు కోకిల నిస్వనంబులున్
    రాగసుధారసంబు మది రంజన గూర్చగ ప్రేమవల్లరిన్
    తీఁగలు లేని వీణ గడుఁ దీయగ మ్రోగెను మీటినంతటన్

    రిప్లయితొలగించండి
  10. సాగెడు చల్లని గాలులు
    నూగెడు పూలతల పరిమళోద్భటములు నా
    సోగ కనుల సైగలతో
    తీఁగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్

    రిప్లయితొలగించండి
  11. కం॥ సాగఁగఁ గాపుర మిల నను
    రాగముఁ గాంచుచు మధురము రమ్యము పొగడన్
    బాగుగ సుకవి నుడివెనఁట
    తీగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్

    ఉ॥ బాగుగ బాధ్యతల్ గనుచు భావన మీరఁగ మోదమందుచున్
    సాగఁగఁ గాపురమ్మిలను చక్కగ సఖ్యత నొంది యొప్పుచున్
    మ్రోగును జీవితంబునను మోహన రాగము సర్వవేళలన్
    దీగలు లేని వీణ గడుఁ దీయగ మ్రోగెను మీటినంతటన్

    మరొక పూరణ

    ఉ॥ భాగవతామృతమ్ము నిల భక్తినిఁ గ్రోలఁగ మోదమందుచున్
    వేగమె మానసంబునను బ్రీతినిఁ గాంతురు మానవాళియున్
    సాగఁగ భక్తి తత్పరత చక్కగ ధాత్రినిఁ దోఁచె నిట్టులన్
    దీగలు లేని వీణ గడుఁ దీయగ మ్రోగెను మీటినంతనే

    రిప్లయితొలగించండి
  12. బాగుగఁ గూసెను గోయిల
    రాగము సెలరేఁగఁ జిగురులం దిని తనియన్
    దాఁగుచుఁ గొమ్మల లోనం
    దీఁగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్


    తూఁ గన నేర కింతయును దొయ్యలిఁ గానక తిర్గి తిర్గి లో
    వేఁగుచు నుండఁ దాపమున వృక్షపు మూలము నందు జానకిం
    దాఁ గని హన్మ వొంగఁగ ముదం బెద పాడెను హర్ష రాగముల్
    తీఁగలు లేని వీణ గడుఁ దీయగ మ్రోగెను మీటి నంతటన్

    రిప్లయితొలగించండి
  13. కం:రాగములన్నిటి చక్కెర
    తీగల వలె చేసి యామె తీరుగ బాడెన్
    తీగల వీణలు లే వట
    తీగలు లేనట్టి వీణ తీయగ బలికెన్.

    రిప్లయితొలగించండి
  14. ఉ:రాగసుధాసముద్ర మని రాణ గడించిన సుబ్బలక్ష్మి యే
    మా గుడి జేరె పిల్వగనె ,మా హృదయమ్ములు రంజిలంగ యే
    మా గళ మందు తీపి? సభ యందున వీణియ లేక పోయినన్
    తీగలు లేని వీణ కడు తీయగ మ్రోగెను మీటినంతటన్
    (సుబ్బలక్ష్మి గారి గాత్రమే ఒక తీగలు లేని వీణ.ఆమె పిలువగానే కచేరీకి రావటం మంటే మీటి నంతనే రాగాలు పలకటం.)

    రిప్లయితొలగించండి
  15. ఉ.

    మాగు విలోలమౌ రవళి మానస వీణను గాంచ శక్యమే
    తూగెడి పానశౌండుడను దుర్భర వర్ణన యక్షవాటమున్
    వీగిన యూహలందు సఖి వేదన వాడుక రాగ మాలికల్
    *తీఁగలు లేని వీణ గడుఁ దీయగ మ్రోగెను మీటినంతటన్.*

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సాగెడు కచేరి యందున
    రాగముతో పాడుచుండ రమణులు పాటల్
    వేగమె స్పందించె నెడద
    "తీగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్."

    రిప్లయితొలగించండి