27, జనవరి 2024, శనివారం

సమస్య - 4658

28-1-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గుంజీల్ దీయింత్రు కవుల గుంటూరు జనుల్”
(లేదా...)
“గుంజీల్ దీయఁగఁ జేతు రెల్ల కవులన్ గుంటూరు వాసుల్ గటా”
(గుంటూరులో నాకు గురుసన్మానం జరుగుతున్న సందర్భంగా)

20 కామెంట్‌లు:

  1. కుంజరకవీంద్రులకును
    పంజావిసరినకిశోరపండితులుండన్
    అంజనమునదొరకరుగా
    గుంజీల్దీయింత్రుకవులగుంటూరుజనుల్

    రిప్లయితొలగించండి
  2. కందం
    రంజిల్లుచు పాండితికిన్
    వింజామర సేవజేసి, వికృతపు భావాల్
    పంజావిప్పిన నోపక
    గుంజీల్ దీయింత్రు కవుల గుంటూరు జనుల్!


    శార్దూలవిక్రీడితము
    రంజింపన్ దగు పాండితీ ప్రభగనన్ హ్లాదాన స్తోత్రమ్ములున్
    పుంజాలై మది నూపునూయలలనన్! పొంగింప నశ్లీలముల్
    గుంజల్ బట్టుకు నిగ్గఁదీసి సభలో కోలాహలంబెంచుచున్
    గుంజీల్ దీయఁగఁ జేతు రెల్ల కవులన్ గుంటూరు వాసుల్ గటా!

    రిప్లయితొలగించండి
  3. అంజన మేసి తప్పులను
    మంజులమౌ కవితలందు మాన్యులు గనియున్
    సంజయ తొసగులు గలచో
    గుంజీల్దీయింత్రుకవులగుంటూరుజనుల్

    రిప్లయితొలగించండి
  4. అంజలి ఘటించి కవులను
    పుంజీలకొలది కవితలు పొంకించమనన్
    రంజిలగ వ్రాయ కుండిన
    గుంజీల్ దీయింత్రు కవుల గుంటూరు జనుల్

    రిప్లయితొలగించండి
  5. శార్దూలవిక్రీడితము:
    రంజిల్లన్ హృదయాలు శ్రోతల మనోల్లాసంబు పెంపారగన్
    కంజారున్ సతి వాణి జిహ్వపయి తూఁగాడన్ విలాసంబుగా
    సంజాతంబగు కావ్యమాధురుల నాస్వాదింత్రు లేకున్నచో
    గుంజీల్ దీయఁగఁ జేతు రెల్ల కవులన్ గుంటూరు వాసుల్ గటా

    రిప్లయితొలగించండి

  6. కంజాక్షు లొక్కరోక్కరు
    నంజన్ జేరి సుకవియని యభిమానముతో
    కంజాతము లిచ్చుచు రహి
    గుంజీల్ దీయింత్రు కవుల గుంటూరు జనుల్.


    గుంజాటమ్మె కవీంద్రచంద్రులకటన్ గోకొల్లరుల్ పండితుల్
    కంజాక్షుల్ దరిజేరి తోషమున సత్కార్యమ్ముగా నెంచుచున్
    కంజాతమ్ముల మాలవేయుతరి సత్కారమ్మునే పొందగా
    గుంజీల్ దీయఁగఁ జేతు రెల్ల కవులన్ గుంటూరు వాసుల్ గటా.

    రిప్లయితొలగించండి
  7. సంజాతంబగు రచనల్
    మంజీరానదము పగిది మార్మ్రోయునిటన్
    గంజారులుగద నరయగ
    గుంజీల్ దీయింత్రు కవుల గుంటూరు జనుల్

    సంజాతంబగు కావ్యధార ఘనమౌ సత్సాంప్రదాయమ్ముతో
    మంజీరా నదిసల్పునట్టి ధ్వనిలా మార్మ్రోయు నిచ్చోటనే
    కంజారుల్ గద యెల్లవారిట సదా కార్యోన్ముఖుల్ రూడిగా
    గుంజీల్ దీయఁగఁ జేతు రెల్ల కవులన్ గుంటూరు వాసుల్ గటా

    రిప్లయితొలగించండి
  8. రంజిత వర్తన గల్గియుl
    మంజుల చిత్తంబు తోడ మహనీయులు గా నంజలి ఘటింతు రె ట్టుల
    గుంజీ ల్ దీ యింత్రు కవుల గుంటూరు జనుల్?

    రిప్లయితొలగించండి
  9. కందం:
    కంజారుని సతి కృపతో
    రంజిల్లఁగ జేయుపద్య రచనమునందున్
    మంజుల పదములఁ గానమి
    గుంజీల్ దీయింత్రు కవుల గుంటూరు జనుల్

    రిప్లయితొలగించండి
  10. కం॥పుంజీలకు పుంజీలుగ
    రంజిలఁ జేయని కృతులను వ్రాసిన కవులన్
    సంజయ యేమనిఁ దెల్పుదు
    గుంజీల్ దీయింత్రు కవుల గుంటూరు జనుల్

    శా॥ రంజిల్లన్ గను తేనెలూరు కవితల్ వ్రాయంగఁ గీర్తించుచున్
    సంజీవిన్ మరపించు కైతలనుచున్ సన్మానమున్ జేయరే!
    రంజిల్లన్ గనలేని క్షుద్ర కవితల్ వ్రాయంగఁ గోపోన్నతిన్
    గుంజీల్ దీయఁగఁ జేతురెల్ల కవులన్ గుంటూరు వాసుల్ గటా!

    రిప్లయితొలగించండి
  11. నంజుండున్గనపండుమిర్చియటతానైతోడుగోంగూరయున్
    గంజిన్ద్రావుచుకావ్యరాజములసాకల్యంబుగానేర్చిరే
    ఝంఝాటంబులవిశ్వనాథుడచటన్చారుండునైయుండగా
    గుంజీల్దీయగజేతురెల్లకవులన్గ్గుంటూరువాసుల్గటా

    రిప్లయితొలగించండి
  12. మంజుల పద్య సరోరుహ
    పుంజమ్ముల నెల్ల వారి ముద మారంగన్
    రంజిల్లఁ జేయు వఱకును
    గుంజీల్ దీయింత్రు కవుల గుంటూరు జనుల్


    పుంజీభూతము లైన దోషము లహో పుంఖాను పుంఖమ్ము లుం
    డం జోద్యమ్ముగ స్వీయ పద్యముల నా గండమ్ము నెట్లైన దా
    టం జింతించెడు వారి నెల్లరను వీడం జాల కత్యుగ్రులై
    గుంజీల్ దీయఁగఁ జేయుదుర్ కవుల నా గుంటూరు వాసుల్ గటా

    రిప్లయితొలగించండి