17, జనవరి 2024, బుధవారం

సమస్య - 4648

18-1-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దగ్గు వారలకే శాంతి దక్కుచుండు”
(లేదా...)
“దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

43 కామెంట్‌లు:

  1. నిగ్గును దేల్చనెంచినను నెమ్మది నెన్నడు వీడకుండుమా
    భగ్గున మండు సంగతులు పైకొన తొందరపాటుకున్ సదా
    పగ్గము వేయగాదగును పంతము లాడక చర్చలందునన్
    దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉబ్బసమునకు గురియైన నుపశమనము
      కోరి యౌషధమును వాడి తీరవలయు
      శ్లేష్మ ముక్కిరిబిక్కిరి చేసి నపుడు
      దగ్గు వారలకే శాంతి దక్కుచుండు

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.

      తొలగించండి
  2. తేటగీతి
    జూదమోడి వనముఁ బోవ సోదరుండు
    ధార్తరాష్ట్రులపైననిఁ దలఁతుమనగ
    ధర్మజుండడ్డి గెల్చె నదనున! విధికిఁ
    దగ్గు వారలకే శాంతి దక్కుచుండు

    ఉత్పలమాల
    సిగ్గుగఁ దల్చి కానలకుఁ జేరుట కొప్పక జూదమోడినన్
    భగ్గున మండి భీముడట భండనమెంచుదమన్న ధర్మజుం
    డొగ్గక యాపి మీదట సమున్నతిఁ గెల్చె! నయుక్తమైనచోఁ
    దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్

    రిప్లయితొలగించండి
  3. కంటి ముందున విజయమ్ము కానవచ్చు
    పాళమందున పెనకువ పాటి యైన
    నించుక ప్రతికూల మదియె యెదురైన
    దగ్గు వారలకే శాంతి దక్కుచుండు


    పగ్గియ గల్గనేమి గరువమ్మును జూపి దురాక్రమమ్ముతో
    వగ్గుల హింసపెట్టు బలవంతుల కన్నను ధాత్రి యందునన్
    సిగ్గును వీడి యక్కజుల చేతను జిక్కిన కాలమందునన్
    దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్.

    రిప్లయితొలగించండి
  4. కలుగు నష్టముపయి యవగతి కలుగక
    చిన్న చిన్న తప్పిదమగు చేష్ట లందు
    కోప పడక యవసరము కొలది తాము
    దగ్గు వారలకే శాంతి దక్కుచుండు

    రిప్లయితొలగించండి
  5. శాంతిసమరంబుజేసెనుసాధువనగ
    శత్రుభావంబులేకనుసమతగనుచు
    గాంధితాతయెనెగ్గెనుగ నిసుమంత
    దగ్గువారకేశాంతిదగ్గుచుండు

    రిప్లయితొలగించండి
  6. సకల విజయాలు సమకూరు సతత మనుచు
    విర్ర వీగుట మానియు విజ్ను లగుచు
    సమయ సందర్భ మెరిగియు సహన ముగను
    దగ్గు వారలకే శాంతి దక్కు చుండు

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. తే॥ నేననెడి యహము దరికి నీవు చేర
      వలదు సర్దుకు బ్రదుకఁగఁ గలలు పండు
      ననువు గానిచోట మనఁగ వినయముఁ గనిఁ
      దగ్గు వారలకే శాంతి దక్కుచుండు

      ఉ॥ నెగ్గగ జీవితంబునను నిత్యము సర్దుకు పోకఁ దప్పునా
      భగ్గున మండు వారలకు బాధలు తప్పువు లోకమందునన్
      సిగ్గును వీడి సర్దుకొన శ్రేయముఁ గాంతురు సర్వవేళలన్
      దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.

      తొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    రాజధర్మములెల్లను ప్రౌఢిగలిగి
    పల్కువడి బుద్ధిహీనుడై వాదులాడు
    సామితో తగవాడక సహనమెంచి
    దగ్గువారలకే శాంతి దక్కుచుండు.

    చక్కని రాజధర్మములు శస్తమునౌవిధి తెల్పువేళలో
    పెక్కుగ మూర్ఖవాదనలు వెంబరియై నొనరించు రాజుతో
    చిక్కులుసంభవించునను చింతన జేసి క్షమన్ ఘటించుచున్
    దగ్గెడి వారికే సుఖము దక్కునుగాదె ధరాతలమ్మునన్.

    రిప్లయితొలగించండి
  9. పగ్గెలు బలుకక నొకింత యొగ్గియున్న
    కగ్గదు ఇసుమంతయు మన గౌరవమ్ము
    ఎగ్గులాడక పెద్దల యెడనుకాస్త
    దగ్గు వారలకే శాంతి దక్కుచుండు

    రిప్లయితొలగించండి
  10. -

    బొగ్గు లమ్ము కొనిననేమి బువ్వ కొరకు
    దగ్గు వారలకే శాంతి దక్కుచుండు
    కర్మ యోగమునకు సాటి కలదె భువిని
    విశ్వ దాభి రమణి వినవే జిలేబి


    రిప్లయితొలగించండి
  11. తగ్గినఁ నెగ్గుకాదు ప్రవిదారణమందున ద్యూతమందునన్
    నెగ్గుట దుర్లభంబగుట నిశ్చయమట్టులఁ దోచి నంతటన్
    సిగ్గిలకుండుటే పరమ శ్రేయము, చొప్పడు సంకటంబులం
    దగ్గెడువారికే సుఖము దక్కును గాదెధరాతలమ్మునన్

    రిప్లయితొలగించండి
  12. దురము నందున నాడెడు ద్యూతమందు
    గెలుపు సాధ్యము కాదని తెలిసినంతఁ
    దగ్గు వారలకే శాంతి దక్కుచుండు
    పౌరుషము సడలించిన పరువుదక్కు

    రిప్లయితొలగించండి
  13. -

    దిగ్గున నాకసమ్ము నకు దీటుగ లేచిన కోపతాపముల్
    నెగ్గున నెల్లకాలములు నెమ్మది యోచన లేను మేలురా
    పగ్గము బట్టకున్నను స్వభావపు రీతిని తానకమ్ముతో
    దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్

    దిల్రూబా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
      "నెగ్గున యెల్లకాలములు" అనండి.

      తొలగించండి
  14. మ్రగ్గిన మాత్రుభాషఁ గని మాన్యులు శంకరు లప్రమత్తులై
    దిగ్గజ మల్లె పద్యముల దిక్కులఁ జాటెడి ధీవరేణ్యుడై
    నిగ్గులు దేఱు యల్లికల నేర్పెడి నేతకు నాంగ్లమందునన్
    దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్.

    రిప్లయితొలగించండి
  15. భండనమ్ములోఁ బగవారి బలము లెల్ల
    వీఁగు నంత వఱకుఁ జక్క వేచి వేచి
    చిక్క సమయమ్ము సెలరేఁగఁ జేవ తోడఁ
    దగ్గు వారలకే శాంతి దక్కు చుండు


    నెగ్గెడు నాశ సన్నగిల నీల్గుచు నుండ స్వ పక్ష వీరులే
    మ్రగ్గుచు నుండ ఘోర సమరమ్మున విజ్ఞత నాలకించి వే
    ప్రెగ్గడ పల్కు లింపుగ వివేకముతోఁ బ్రతికూల వేళలం
    దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్

    రిప్లయితొలగించండి
  16. తే.గీ:మనమునన్ శాంతి లే దని,మరచి పోవ
    బాధ లన్నిటి,నీ ధూమ పాన మనుచు
    పొగను బీల్చి,యనారోగ్యమ్ము బొంది,యెపుడు
    దగ్గు వారల కే శాంతి దక్కుచుండు ?

    రిప్లయితొలగించండి
  17. ఉ:భగ్గని ద్వేషభావములు వర్ణము లందు మతమ్ములందు నన్
    పగ్గము లేక రెచ్చు తరి వారల చర్చల యందు దూరగా
    నగ్గిని వోలె రెచ్చుటయె యౌ గద,యత్తరి నట్టి చర్చలన్
    దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్

    రిప్లయితొలగించండి
  18. పగ్గములందగానబడబానలమోయనపాలకుండునున్
    భగ్గునమండగాదగునే, ఫక్కుననవ్వరెవిజ్ఞులయ్యెడన్
    నిగ్గునుదేల్చినిల్వగలనేర్పునుజూపినదక్షుడేయిలన్
    దగ్గెడువారికే సుఖముదక్కునుగాదెధరాతలమ్మునన్

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    వాద ప్రతివాదముల తోడ వ్యర్ధముగను
    జగడ మాడుచునుండెడు సమయమందు
    సహనమే మేలటంచును సర్దుకొనుచుఁ
    దగ్గు వారలకే శాంతి దక్కుచుండు.

    రిప్లయితొలగించండి
  20. ఉ.

    ఎగ్గులువల్కు మూర్ఖులను నేనుగు కుక్కల కిచ్చు జాలిగా
    నిగ్గులు జల్లు పండితులు నెగ్గుచు నందరిలో ఘనంబుగా
    సిగ్గును జూపి దక్షతను శీలము స్నేహము నొందు వైఖరిన్
    *దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్.*

    రిప్లయితొలగించండి
  21. తగ్గక యించుకై ననట ధాష్టికమున్ కనపర్చిరాజుతా
    నెగ్గక పోరునందు వడినిల్చెపరాజితుడైరణమ్ములో
    మొగ్గులు చూపి ధర్మమున ముందుగ చంపిరి ధార్తరాష్ట్రులన్
    దగ్గినవారికే సుఖము దక్కునుగాదె ధరాతలంబునన్

    రిప్లయితొలగించండి