8, జనవరి 2025, బుధవారం

సమస్య - 4997

9-1-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుగ్ధసాగరమందున ధూళి రేఁగె”
(లేదా...)
“దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!”

25 కామెంట్‌లు:

krkr చెప్పారు...

దిగ్ధిదిగంతముల్గదిలె దేవత లందరుఁగర్తలైరి ,సం
దిగ్ధము లేకసాగుచునుదివ్యసుధామృత ధారకోసమై,
స్నిగ్ధమనోహరమ్ముఁగన శ్రీ మరి చంద్రులు వెల్వడంగ నా
దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!
కొరుప్రోలు రాధాకృష్ణ రావు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
పెట్టినది మందర గిరియై చుట్టినదన
తాడు గాక భుజంగమై త్రచ్చినంత
ప్రప్రథమముగ సహజమై బయలువెడలి
దుగ్ధసాగరమందున ధూళి రేఁగె!

ఉత్పలమాల
దుగ్ధయె మీరఁగన్ సుధను తోషమునంద సురాసురాళి సం
దిగ్ధము వీడుచున్ గిరిని దెచ్చి, భుజంగము సుట్టి త్రచ్చినన్
జగ్ధము పుట్టునెట్లు? సహజమ్ముగ నాదిని మట్టివీడుచున్
దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!

BMahalakshmi చెప్పారు...

ముగ్ధమనోహరంబుగను మోదినితామరవిచ్చుచుండ సం
దిగ్ధతకానవచ్చెనటతేటనుచంద్రునిమబ్బుగ్రమ్మగా
దుగ్ధపయోధిమధ్యమునధూళియురేఁగెనుచూడుమాహరీ
దగ్ధమునయ్యెమేఘమది దంభమువీఁడుచు సూర్యరశ్మితో

Sitharamayya Solasa చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కవుతా రామకృష్ణ చెప్పారు...

దుగ్ధపయోధిఁ ద్రచ్చఁ బగఁ ద్రుంచి, సురాసురులెల్ల చేరి వై
దగ్ధిని మంధరాచలము దార్ఢ్యపుకవ్వముగాను జేసి ని
ర్దిగ్ధులు చుట్టివాసుకినిఁ ద్రిప్పగ మంధరమందుఁ గూలగాన్
దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!

విరించి చెప్పారు...


తొల్లి మంగళ కరమగు తోయజాక్షి
పుట్టె నమృతకరుడు పుట్టె భువనములను
దగ్ధమొనరించు చెడియందు దాగెనేమొ
దుగ్ధసాగరమందున ధూళి రేఁగె


మగ్దమనోహరమ్మయిన ముద్దియ ద్రోవది వల్వలూడ్చి సం
దిగ్ధపు జూదమందు యట ధీరులు పాండుసు తుండ్ర దెందమున్
దుగ్ధమొనర్చిరా ఖలురు దుష్టచతుష్టయ మింక గాంచగా
దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ! (1)


ముగ్దమనోహరమ్మయిన ముద్దియ వెల్వడె ముందు, భాస్కరున్
స్నిగ్ధుడు తారకాభికుడు సింధువు బుట్టెను కాంచ లోకమున్
దగ్ధమొనర్చెడిన్ మిగుల దబ్బరమేదియొ చేరవచ్చునో
దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!

Sitharamayya Solasa చెప్పారు...

ముగ్ధ మంజులమైనట్టి పొడకలిగియు
స్నిగ్ధమగు తనువుపయిన సెంక తోడ
దిగ్ధమౌ మానసము నందు దిరుగబడిన
దుగ్ధసాగరమందున ధూళి రేఁగె

M.B.G.TILAK చెప్పారు...

స్రగ్ధరుడగు వానిని పాంచజన్యధరుని
స్నిగ్ధ సుమనోహరంబగు సిరివరించె
దగ్ధ హృదయులై గాంచగఁ దానవతతి
దుగ్ధసాగరమందున ధూళి రేఁగె

దుగ్ధ సముద్రమున్ జిలుక ద్యోతకమైనవి పెక్కు వస్తువుల్
ముగ్దమనోహరంపు సిరి మోదము గూర్చెను నీకు జోడుగా
దగ్ధములైన చిత్తములు దానవ బృందపు ద్వేషభావమై
దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సుధను సాధింప దనుజులు సురలు కలిసి
మంధర గిరి కవ్వము గాగ మధన పరుప
దుగ్ధ సాగర మందున ధూళి రే గె
కంప మొందు చు వారలు గాంచి రచట

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

దుగ్ధము నీరమొక్కటిగ దోసమెరుంగని స్నేహబంధమున్
దగ్ధము చేయనెంచియొక ద్రాపుడు చిచ్చునురేపె నంతటన్
దుగ్ధము భిన్నమైనటుల దుర్విధి దూరముజేసె నిర్వురిన్
దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

బాల్య స్నేహితులిర్వురి బంధమెపుఁడు
బాలునీరుగ నొక్కటై బరఁగుచుండె
ద్రాపుడొక్కఁడు చిచ్చును రేపినంత
దుగ్ధసాగరమందున ధూళి రేఁగె

కంది శంకరయ్య చెప్పారు...


మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ దుగ్ధ సనక సనందనాదులు పడయఁగ
జయవిజయులకుఁ గుపితులై శాప మొసఁగ
నల్లకల్లోల మయ్యెనా యబ్ధియందు
దుగ్ధసాగర మందున ధూళిరేఁగె

ఉ॥ ముగ్ధులు నిందిరా రమణు ముంగిట వ్రాలఁగ నడ్డగించినన్
స్నిగ్ధత తోడ నేమముగఁ జేసిడి వారలు ద్వారపాలనన్
దుగ్ధను బ్రహ్మ మానససుతుల్ గని శాపమొసంగఁ గ్రుద్ధులై
దుగ్ధ పయోధి మధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:మంథరము కవ్వ మై నిల్వ,మథనమునకు
వాసుకియె త్రాడు గా నిల్వ ప్రబల వేగ
మునకు చలియింప నడుగున భూమి కూడ
దుగ్ధసాగరమందున ధూళి రేఁగె”
(మంథరము,వాసుకి కవ్వము,తాడు రూపం లో చిలుకుతుంటే అడుగున ఉన్న భూమి కూడా కదిలి దుమ్ము రేగింది.)

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

సురలు నసురులును కలసి సుధను కోరి
చిలుకు చుండగ పుట్టగ శీఘ్ర గతిన
కామ ధేనువుతో పాటుగరళమచట
దుగ్ధ సాగర మందును ధూళిరేగె.

దుగ్ధయు పుట్టగా మదిని దుర్మతితోడను కౌరవాధముల్
దగ్ధము చేయనెంచుచును తల్చుచు లక్క గృహమ్ము కాల్చిరే
ముగ్ధమనోహరిన్ సభను పుట్టములూడ్వగనెంచిరయ్యయో
*“దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!”*

Dhanikonda Ravi Prasad చెప్పారు...

2)ఉ:దగ్ధులు కాగ స్పర్థలను దైత్యులు,దేవత లెల్ల వీరి దౌ
వాగ్ధృతి పెచ్చరిల్లె, గిరి భారము భూమిని తాక వింతగా
దుగ్ధపయోధిమధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!”
ముగ్ధ మనోహరాకృతిని బూనిన నిన్ గన సద్దు నిల్చె గా!
(అంతా కోలాహలం గా ఉంది దుమ్ము రేగుతోంది.నీ ఆకారం చూడగానే నిశ్శబ్దం వచ్చింది.)

BMahalakshmi చెప్పారు...

దంభమువీడుచుగాలితాకుటన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

దేవ దానవులు దివిరి దించు చుండ
వాసుకిఁ దగిలించుచు నుండ బరువు మీఱ
మందర నగమ్ము గూల నమంద గతిని
దుగ్ధ సాగర మందున ధూళి రేఁగె


ముగ్ధ నొసంగ కున్న రుష భూపతి వొంద నెడంద యం దసం
దిగ్ధము యుద్ధ మేర్పడఁగ దిక్కులు మిక్కిలి పిక్కటిల్ల స
మ్యగ్ధుత మానసాబ్జమున నంబర మంటఁగ రాజచంద్రు ప్రో
ల్దుగ్ధ పయోధి మధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

సుధను గోరి సాగరమును సుర లసురులు
పర్వతమ్ము మందరను కవ్వముగ చేసి
త్రాడుగా వాసుకిని కట్టి త్రచ్చినంత
రయముగాను,భయముగొల్ప ప్రథమముగను
దుగ్ధ సాగర మందున ధూళి రేగె.