2, మార్చి 2025, ఆదివారం

సమస్య - 5050

3-3-2025 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భరణంబునుఁ గోరె వధువు పరిణయవేళన్”
(లేదా...)
“భరణముఁ గోరె నా వధువు బంధువులెల్లరుఁ జూడ పెండ్లిలో”

22 కామెంట్‌లు:

  1. సరియగు జోడియని దలచి
    స్థిరపరచిన పెండ్లి కొడుకు చేరువకరిగెన్
    వరునికి తొడుగగ స్వర్ణా
    భరణంబునుఁ గోరె వధువు పరిణయవేళన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సురుచిర మైనరూపమని సుందరినే వరియించె నాతడే
      సరియగు జంటయౌననుచు సమ్మతిఁ దెల్పిరి తల్లిదండ్రులే
      పరిణయమాడు వేళ తన వారల తోడను చక్కనైన యా
      భరణముఁ గోరె నా వధువు బంధువులెల్లరుఁ జూడ పెండ్లిలో

      తొలగించండి
  2. కందం
    తరుణి వరుని నచ్చియు బం
    గరు వందతులమ్ములెంచి కావలెననియున్
    మురిపెమున నదనముగ నా
    భరణంబునుఁ గోరె వధువు పరిణయవేళన్!

    చంపకమాల
    తరుణికి కుందనమ్ము గన దాల్చెడు కోరిక మిక్కుటమ్మగున్
    వరుడిని నచ్చినప్పుడహొ! వంద తులమ్ములు గోరె! మెచ్చుచున్
    మురిపెము మీర వేరొకరి ముక్కెరఁ దానదనంబునెంచి యా
    భరణముఁ గోరె నా వధువు బంధువులెల్లరుఁ జూడ పెండ్లిలో!

    రిప్లయితొలగించండి
  3. సరసిజ నేత్రికిన్ వరుడు సమ్మతి
    తోడను పెట్టనున్న యా
    భరణములెల్ల బెట్టె కడు భవ్య
    మనోహర చంద్ర హారమున్
    సరిపడు డబ్బులేక కొన జాలక
    పోయెను , గాని కంఠ పా
    భరణము గోరె నావధువు బంధువు
    లెల్లరు జూడ పెండ్లిలో

    రిప్లయితొలగించండి
  4. కం॥ధరనటుల కట్నకానుక
    ల రవళి హెచ్చఁగఁ గరప సలక్షణ రీతిన్
    సరియగు పద్ధతినిఁ దలఁచి
    భరణంబునుఁ గోరె వధువు పరిణయ వేళన్

    చం॥ కరుణను జూపకుండఁగను కాంక్షగఁగోరుచునుండ హెచ్చుగన్
    ధరణినిఁ గట్నకానుకలు తప్పనిఁ దెల్పఁగఁ దాను సాహసిం
    చి రమణి స్వంత భద్రతయు శ్రేయముఁ బొందఁగ నెంచి దీటుగా
    భరణముఁ గోరె నావధువు బంధవులెల్లరుఁ జూడ పెండ్లిలో!

    పెనుకొండ రామబ్రహ్మం  ప్లజెంటన్

    రిప్లయితొలగించండి
  5. వరు డొ సగిన నగలు దనకు
    సరిపడ లేదనుచు దాను సంశయ పడుచున్
    మరి యొక టి ని మ్మ నుచు నా
    భరణంబు గోరె వధు వు పరిణయ వేళన్

    రిప్లయితొలగించండి
  6. మురిపము నొంది వరుడు దన
    శిరోధరని పసుపు కొమ్ము చేర్చిన పిదపన్
    హరుసము నొందుచు నొక యా
    భరణంబునుఁ గోరె వధువు పరిణయవేళన్

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారికి నమస్సులు. నిన్నటి పూరణలు:

    అనలాంబకుననుమతితో
    ఘనముగ కాశీనగరపు కాపరియౌచున్
    చను కాలభైరవుడనెడి
    శునకంబా! నిన్ను గొలువ శుభములు గలుగున్.

    అనిరుద్ధుండగు నాగభూషణుడె యాజ్ఞాపించ కాశీపురిన్
    ఘనమౌ రూపున కావలిన్ సలుపుచున్ గంభీర తత్త్వమ్ముతో
    మనుచున్ క్షేత్రపు కాలభైరవుడవై మంతున్ ప్రవర్తించునో
    శునకంబా! నిను గొల్చినన్ శుభములస్తోకంబుగా దక్కెడిన్.

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    హరువుగ గూర్చిన వేదిని
    మురిపెముగ జరిగెడి ప్రేమపూరిత మనువు
    న్నరులను జూపుచు కంఠా
    భరణంబును గోరె వధువు పరిణయ వేళన్.

    విరులనుగల్గి యందముగ వెల్గెడి వేదికపైన పెద్దలం
    దరివి శుభాభినందనలు దక్కెడి వేళను గారమొందుచున్
    వరునిని వేడుచున్ తనకు వన్నెలుజిందెడి నొక్క పైడి యా
    భరణముగోరె నావధువు బంధువులెల్లరుజూడ పెండ్లిలో.

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి:
    గురువుగారికి నమస్సులు. నిన్నటి పూరణ.

    ఘనదేవుండగు విశ్వనాథుని సదా కారుణ్యమున్ జూపుచున్
    మనుపున్ జేసెడి యన్నపూర్ణ సతినిన్ మంతైన శీలంబుతో
    ననువున్ వేడియు కాలభైరవునిగా నల్లాడుచున్ వెల్గునో
    శునకంబా! నిను గొల్చినన్ శుభములస్తోకంబుగా దక్కెడిన్.


    రిప్లయితొలగించండి
  10. వరునికి గానమందు గల బాళి గ్రహించి వివాహవేదికన్
    పురమున మేటి గాయకుల పొంకపు గోష్ఠి నమర్చనా సభా
    వరణమునందు మక్కువగ పాటలు రాగములందు శంకరా
    భరణముఁ గోరె నా వధువు బంధువులెల్లరుఁ జూడ పెండ్లిలో

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి:

    సరి జంటగ ముడివడిరా
    వరుడును వధువుయు యొకటిగ వలపుల వేదిన్
    చెరగక నిలిచెడు ప్రేమా
    భరణంబును గోరె వధువు పరిణయ వేళన్.

    సరియగు జంటగా నమరి సన్నని నవ్వుల మోహమందునన్
    పరిపరి జూపులన్ గలిపి బాసలు జేయుచు సందడించు నా
    మురిపెపు పెండ్లి వేడుకను మూడగు ముళ్ళను నిల్చెడిన్ స్థిరా
    భరణముగోరె నా వధువు బంధువులెల్లరు జూడ పెళ్ళిలో.

    రిప్లయితొలగించండి
  12. పరిణయమైన వేళకు సుభాగ్య పదోన్నతి గల్గినంతటన్
    వరుడు తలంచె కారణము వన్నెల చిన్నెల పెండ్లమంచు తా
    సరసముఁ జూపి కోరుమన చక్కెర బొమ్మను భర్త, కాంచనా
    భరణముఁ గోరె నా వధువు బంధువులెల్లరుఁ జూడ పెండ్లిలో!!

    రిప్లయితొలగించండి
  13. వరుడు వధువు ప్రేమికులే
    యరమరికలు లేక పెండ్లియాడిరి తెగువన్
    వరుని కడకేగి కంఠా
    భరణంబునుఁ గోరె వధువు పరిణయవేళన్

    రిప్లయితొలగించండి
  14. తరుణికి సుందరాంగునకు తద్దయు ప్రేముడి గల్గె నంతటన్
    వరముగ బెద్దలౌననఁగ బాయక పెండిలియాడి రొక్కటై
    పరిణయమాడు వేళ దన భర్తను లాలనతోడ నొక్క యా
    భరణముఁ గోరె నా వధువు బంధువులెల్లరుఁ జూడ పెండ్లిలో

    రిప్లయితొలగించండి
  15. పరిణయ నూతన జంటయు
    తిరుమలవాసుకి వివాహ తీర్చెడి వేళన్
    సిరికికి వేయ మెడన నా
    భరణంబునుఁ గోరె వధువు పరిణయవేళన్

    రిప్లయితొలగించండి
  16. మరిమరి వరుడా భరణిని
    మురిపెమ్ముల జూడ నొసలు ముడివెట్టుచు జూ
    చి రసోత్తరముగ కంఠా
    భరణంబును గోరె వధువు పరిణయ వేళన్


    రిప్లయితొలగించండి
  17. -
    అరయ సమస్యాపూరణ
    పు రంగమే వేదిక యిరువురి కలయికకున్
    మురిపెమున కైపదపుటా
    భరణంబును గోరె వధువు పరిణయ వేళన్



    రిప్లయితొలగించండి
  18. కం:మురిపెముగ బంధు వొక" డా
    భరణ మ్మే మిత్తు?" ననగ పఠియింపన్, కా
    వ్యరుచిన్ దెల్పుచు కంఠా
    భరణంబునుఁ గోరె వధువు పరిణయవేళన్”
    (పెళ్లి లో బహుమతు లిచ్చే టప్పుడు వధువుని కొందరు అడిగి ఇస్తారు.ఆమె ఏ ఆభరణమూ వద్దు.పానుగంటి వారి కంఠాభరణం నాటకం పుస్తకం కొనిపెట్ట మన్నది.)

    రిప్లయితొలగించండి
  19. చం:దొరుకదు సుంత తీరికయు,తోచదు పూరణ యేది పెండ్లి సం
    బరముల గాని పద్యముల పై గల మక్కువ యామె కెట్టిదో
    చరచర ఫోను దెమ్మనుచు చక్కని పూరణ జేయ శంకరా
    భరణముఁ గోరె నా వధువు బంధువులెల్లరుఁ జూడ పెండ్లిలో”

    రిప్లయితొలగించండి
  20. వరుని కొకనికి నెఱుక పడఁ
    దరుణీ మణి వఱచి చూపు తమ్ములు తగ నం
    తరముం గని యనిశపుఁ దన
    భరణంబునుఁ గోరె వధువు పరిణయ వేళన్


    తరుణుల కెల్ల భూష లనఁ దద్దయుఁ బ్రీతి జనించు నిద్ధరం
    బరిణయ వేళ వృద్ధి యగు బంధము వారికి భూషణమ్ములన్
    వరుఁ డెద హర్ష మందఁగను వారిజ లోచన కాంతిమద్గళా
    భరణముఁ గోరె నా వధువు బంధువు లెల్లరుఁ జూడఁ బెండ్లిలో

    రిప్లయితొలగించండి
  21. వరుని వయస్సునెంచక వివాహము చేయగ నిశ్చయింపగన్
    మురిపెము గాను పెంచుకొన పూర్ణమ పుత్తడి బొమ్మ నీయగన్
    తరుణిది ప్రాయమెంచుటకు తక్కువదౌటను కన్య శుల్కమౌ
    భరణముఁ గోరె నా వధువు బంధువులెల్లరుఁ జూడ పెండ్లిలో!

    రిప్లయితొలగించండి