23, మార్చి 2025, ఆదివారం

సమస్య - 5071

24-3-2025 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దగ్ధమైన కనులె దారిఁ గాంచె”
(లేదా...)
“దగ్ధములైన నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్”

15 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    ముగ్ధ గిరిజ నియతి ముక్కంటి సేవించి
    పతిగనొంది హరునిఁ బంతమూనఁ
    బొలతి రతికినందె బూది యనంగుడై!
    దగ్ధమైన కనులె దారిఁ గాంచె!

    ఉత్పలమాల
    ముగ్ధమనోహరాకృతిని ముక్కను స్వామికి సేవలందసం
    దిగ్ధపురీతిఁ బొంది పతిదేవునిగన్ హిమశైలసూనయే
    దగ్ధుని మన్మథున్ రతికి దక్కఁగఁ గోరననంగుఁజేయుచున్
    దగ్ధములైన నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్

    దగ్ధమైన,దగ్ధములైన = మండిన

    రిప్లయితొలగించండి
  2. కొత్తగా వివాహమయిన భర్త, భార్యను చూడటానికి అత్తగారింటికి బయలుదేరాడు:-

    ముగ్ధను జూడఁ బోయె పతి మూగిన కోర్కెలు వేగిరింప సం
    దిగ్ధమె మార్గమేమియునుఁ దేటము కాదు తమస్సు వేళలో
    స్నిగ్ధత కొంత కొంత విడి నీరజ బంధుడు రాగ చీకటుల్
    దగ్ధములైన నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్!!

    రిప్లయితొలగించండి
  3. వైద్య విద్య యందు విఖ్యా తు డై యొప్పి బాగు చేయు చుండె బాధి తులను
    కాలి నట్టి వాని కనులను సరి జేయ
    దగ్ధ మైన కనులె దారి గాంచె

    రిప్లయితొలగించండి
  4. అన్యులు మన స్వేచ్ఛనణచగ కినుకతో
    దగ్ధమైన కనులె , దారిఁ గాంచె
    జాతిపిత తలంపు సరళి పాటించుచు
    శాంతి మార్గ మెంచి సమితి సలుప

    రిప్లయితొలగించండి

  5. కులము గాని యొక్క కొమిరెను పెండ్లాడ
    చంప దలచి మమ్ము శత్రువొకడు
    నిప్పుపెట్టెనపుడు నిలయమున, కవియె
    దగ్ధమైన, కనులె దారిఁ గాంచె.


    ముగ్ధమనోహరమ్మయిన బోటికులమ్మది భేదమైన సం
    దిగ్ధము లేక నిర్వురము ధీటుగ పెండిలి యాడ నెంచగా
    దుగ్ధను గల్గి కాల్చిరట దుష్టులు మాదగు కొంప లిండ్లటన్
    దగ్ధములైన, నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్.

    రిప్లయితొలగించండి
  6. ముగ్ధమనోహరంబయిన పుణ్యజనాధిపు పత్తనంబునన్
    స్నిగ్ధము పూసితోకకట చిచ్చెర, వెట్టగ గాలిపట్టికిన్
    దుగ్ధపయోధిజాతదయ తోయములన్ విధి నగ్ని దోచె; నా
    దగ్ధములైన నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్

    [దోచెన్ + ఆదగ్ధములైన, ఆదగ్ధములైన = దగ్ధము కాని]

    రిప్లయితొలగించండి
  7. ముగ్ద మోహనమ్ము ముద్దియ రూపమే
    దెప్పరమున నేత్రదృష్టి తొలగి
    తీవ్రమైన కృషికి తిరిగివచ్చెను భళా!
    దగ్ధమైన కనులె దారిఁ గాంచె

    దుగ్దసముద్రనందనగ దూకొన నొప్పును భామ రూపమే
    ముగ్దమనోహరంబయిన ముద్దియ కన్నుల కాంతిపోయి సం
    దిగ్ధత నొందె వీక్షణము తీవ్రచికిత్సకు దృష్టి లభ్యమై
    దగ్ధములైన నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్

    [దగ్ధము = పాడైనది, పనికిమాలినది]

    రిప్లయితొలగించండి
  8. పల్లెటూరిలోన పగలు పడగలెత్తె
    కాలి యూరు వల్లకాడు మిగిలె
    పగలుచల్లబడెను తగవులు మదిలోన
    దగ్ధమైన కనులె దారిఁ గాంచె

    రిప్లయితొలగించండి
  9. దుగ్ధము నీరమట్లు పరితోషముగా మనుచుండ స్నేహితుల్
    దుగ్ధనుబూని మచ్చరము దూకొన జేసెనొకండు వారికిన్
    స్నిగ్ధత గూర్పగా హితులు చేసిన యత్నము నివ్వటిల్లగా
    దగ్ధములైన నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:దారి గాంచ లేక తపియించె మా కనుల్
    విప్లవమ్మె మనకు విధియటంచు
    దమనకాండ కీవు దగ్ధమైతివి నీవు
    దగ్ధమైన, కనులె దారిఁ గాంచె”
    (విప్లవం లో మరణించిన ఒక యోధునికి మరొక యోధుడు నివాళి ఇవ్వటం.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:దుగ్ధలు హెచ్చి నా సుతులు దూరము జేసిరి ధర్మ, మింక సం
    దిగ్ధము లేదు వారి క్షతి,తీరని పాపము నాదు దృష్టినే
    దగ్ధము జేయ, నాకు నిజతత్త్వము జూపిన కృష్ణ నేడు నా
    దగ్ధములైన నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్”
    ("కృష్ణా! నేను ఏ జన్మ లోనో చేసిన పాపం నా దృష్టిని దగ్ధం చేసింది.నీ నిజస్వరూపాన్ని చూపటం తో ఆ దగ్ధమైన నేత్రాలు ఒక దారిని కనుగొన్నాయి " అని ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని తో అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  12. ఆ॥ విజ్ఞత చెదరదని
    వివరించె మిల్టను
    గ్రుడ్డి తనముఁ బడసి గొప్ప గనటు
    వ్రాసె పథముఁ గరపు పగిది మానవులకు
    దగ్థమైన కనులె దారిఁ గాంచె

    ఉ॥ దుగ్ధను జూపనేలనొకొ దుష్టుని వోలెను జ్ఞాన సంపదల్
    దగ్ధము గావు విజ్ఞతను దప్పక నెల్లరుఁ బొందఁగన్ దగున్
    ముగ్ధ మనోహరంబదియె స్ఫూర్తిని మిల్టను దెల్పె సత్యమున్
    దగ్ధములైన నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్

    John Milton 43వ ఏట పూర్తిగా గ్రుడ్డి వాడైన పిదప Paradise Lost (చాలవరకు) & Paradise Regained వ్రాస్తాడండి. పంక్తులు బుఱ్ఱలో ఉంచుకొని వారి అమ్మాయికి చెప్పితే ఆమె వ్రాస్తుంది (నాకు తెలిసిన వరకు). ఇంతవరకు English literature లో అంత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథాలుగా ఇవి ఉన్నాయండి.

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. రామ కథ నుడువుచు రగులు చుండ మిగుల
      సీత కొఱకు వెదకు కోఁతు లందుఁ
      బక్ష్మ యుగ్మ మకట పక్షి సంపాతికి
      దగ్ధమైన కనులె దారిఁ గాంచె

      [దగ్ధమైన యల్పములు; కను = అల్పము]


      దుగ్ధ పరిప్లుతమ్ము లయి తొల్లి శుచిత్వము నంది నింపుగా
      ముగ్ధ మనోహరమ్ము లవిపో మఱి యివ్విషయంబు నందు సం
      దిగ్ధము లేదు కన్నులను ద్రిప్పుచు దిక్కులఁ జూచుచుండ ని
      ర్దగ్ధము లైన నేత్రములె దారిని గాంచెను స్పష్టమౌ గతిన్


      తొలగించండి